Fixed Deposit: ఎక్కువ వడ్డీ ఇచ్చే టాప్ 5 బెస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే

పెట్టుబడులపై రిస్కు అస్సలు వద్దు అనుకునేవారు ఎఫ్డీ చేయడం అత్యుత్తమం. రిస్క్ అస్సలు ఉండకపోగా వచ్చే మొత్తం కూడా ఫిక్స్డ్ గానే ఉంటుంది.

news18-telugu
Updated: November 4, 2020, 3:54 PM IST
Fixed Deposit: ఎక్కువ వడ్డీ ఇచ్చే టాప్ 5 బెస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే
Fixed Deposit: ఎక్కువ వడ్డీ ఇచ్చే టాప్ 5 బెస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా సంక్షోభం నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా పెనుమార్పులు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక విధానంలో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) చెల్లించే వడ్డీ రేట్లను బ్యాంకులు బాగా తగ్గించాయి. కానీ మార్కెట్ లింక్డ్ పెట్టుబడుల్లో ఉన్న రిస్కు కారణంగా ఎఫ్డీలకు మనదేశంలో ఏమాత్రం ఆదరణ తగ్గడంలేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతివారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, చిన్న పట్టణాల్లో ఎఫ్డీలకు విపరీతమైన ఆదరణ ఉంది.

సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా..



ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు కాలపరిమితి ఉన్న ఎఫ్డీ పై చెల్లించే వడ్డీ రేట్లు గరిష్ఠంగా 4.9శాతం నుంచి 6.3 శాతం ఉంటోంది. సీనియర్ సిటిజన్లకు మాత్రమే గరిష్ఠంగా 6శాతం బ్యాంకులు వడ్డీగా చెల్లిస్తున్నాయి. అది కూడా దీర్ఘకాల పొదుపు అయితేనే అంటే వీటి కాలపరిమితి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటే అదనపు వడ్డీగా గరిష్ఠంగా 0.3శాతం నుంచి 0.5శాతం లభిస్తుంది. ఇది స్పెషల్ స్కీమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెషల్ సీనియర్ ఎఫ్డీ స్కీమ్ పథకం కింద ఈ ఏడాది చివరి వరకు మాత్రమే ఈ అదనపు వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.

Bank of Baroda కస్టమర్లకు గుడ్ న్యూస్... ఆ ఛార్జీలు రద్దు

Business Loan: వ్యాపారానికి అప్పు కావాలా? మోదీ ప్రభుత్వ పథకానికి నవంబర్ 30 లోగా అప్లై చేయండి

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు


పైనచెప్పిన బ్యాంకు వడ్డీలు మీకు ఆకర్షణీయంగా అనిపించకపోతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను మీరు ఆశ్రయించవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు ఎక్కువ. డిపాజిటర్ల పొదుపును సురక్షితంగా కాపాడుతూ అత్యధిక వడ్డీ రేటు చెల్లించే ఆ టాప్ 5 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వివరాలు ఇలా ఉన్నాయి. నిర్దిష్ట కాలపరిమితితో కూడిన రూ. 2 కోట్ల రూపాయల్లోపున్న ఎఫ్డీలపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఏడాది కాలపరిమితితో కూడిన ఎఫ్డీపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 ఏడాది కాలపరిమితి (ఏడాదికి)


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ 7.10%

జన స్మాల్ ఫైనాన్స్ 6.90%

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ 6.75%

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ 6.50%

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 6.50%

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రం సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.6% వడ్డీని చెల్లిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోల్చిచూస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 2% అదనంగా వడ్డీ లభిస్తుందన్నమాట.

3 ఏళ్ల ఎఫ్డీపై స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు చెల్లిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 ఏళ్ల కాలపరిమితి(ఏడాదికి)


జన స్మాల్ ఫైనాన్స్ 7.50%

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ 7.15%

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ 7.15%

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ 6.90%

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 6.05%

EPFO: వాట్సప్‌లో ఈపీఎఫ్ఓ హెల్ప్‌లైన్... హైదరాబాద్, విజయవాడ నెంబర్స్ ఇవే

Jan Dhan account: జన్ ధన్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్

మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్డీలపై జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana small finance bank)అత్యధికంగా 8% వడ్డీని సీనియర్ సిటిజన్లకు చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లు కాని ఖాతాదారులకు 3 ఏళ్ల కాలపరిమితితో కూడిన ఎఫ్డీపై ఏటా 7.5% వడ్డీ చెల్లిస్తోంది.

5ఏళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్డీలపై అత్యధిక వడ్డీ చెల్లించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు


సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ 7.50%

జన స్మాల్ ఫైనాన్స్ 7.00%

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ 6.75%

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ 6.00%

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 5.80%

బీమా కూడా ఉందిగా


పైన చెప్పిన ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అత్యధిక వడ్డీని పొందేందుకు నిర్భయంగా మీరు డిపాజిట్ చేయచ్చు. ఈ బ్యాంకుల విశ్వసనీయతకు ఎటువంటి ఢోకా లేకపోగా రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనలను ఇవి పాటిస్తాయి. ఈ బ్యాంకుల్లో పొదుపు చేసుకునే డిపాజిటర్లకు తాము చేసే డిపాజిట్లపై అసలు, వడ్డీపై ఇన్సూరెన్స్ సౌలభ్యం కూడా ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద గరిష్ఠంగా రూ.5 లక్షల బీమా లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు దివాళా తీసినా డిపాజిటర్లకు వచ్చిన నష్టమేమీ ఉండదన్నమాట.

రిస్కు వద్దంటేనే


పెట్టుబడులపై రిస్కు అస్సలు వద్దు అనుకునేవారు ఎఫ్డీ చేయడం అత్యుత్తమం. రిస్క్ అస్సలు ఉండకపోగా వచ్చే మొత్తం కూడా ఫిక్స్డ్ గానే ఉంటుంది. కానీ డబ్బు సురక్షితంగా ఉండాలంటే సంప్రదాయ పొదుపు పథకాలైన ఎఫ్డీలను ఆశ్రయించక తప్పదు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అన్నీ ఒకేరకమైన వడ్డీ పాలసీని అనుసరించవు. దీంతో ఒక బ్యాంకులో ఇచ్చే వడ్డీ మరో బ్యాంకుతో పోలిస్తే ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. అందుకే మీరు ఎఫ్డీ చేయాలంటే ముందు ఆ బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై కనీస అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది. ఎందుకంటే మనదేశంలోకూడా బ్యాంకులు సంక్షోభానికి గురవుతుండటాన్ని మనం తరచూ చూస్తున్నాం.
Published by: Santhosh Kumar S
First published: November 4, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading