హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan Rates: తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే!

Home Loan Rates: తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే!

 Home Loan Rates: తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే!

Home Loan Rates: తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే!

Home loans | హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ముందుగా ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుందో చెక్ చేసుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank Home Loan | సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే చేతిలో డబ్బులు లేవా? అందుకని హోమ్ లోన్ (Home Loan) తీసుకొని కొత్త ఇల్లు కొనడం లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవడం వంటివి చేయాలని యోచిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ముందుగా ఏ బ్యాంక్‌లో (Banks) తక్కువ వడ్డీకే రుణం వస్తుందో చెక్ చేసుకోవాలి.

మార్కెట్‌లో ప్రస్తుతం చాలా బ్యాంకులు హోమ్ లోన్స్ అందిస్తూ వస్తున్నాయి. అలాగే బ్యాంకులు కూడా ఇటీవల రుణ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉంది? ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు? వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా లోన్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న ఐదు బ్యాంకులు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

శుభవార్త.. రూ.2 వేలు పతనమైన బంగారం ధర.. నెల రోజుల్లోనే భారీగా దిగొచ్చిన గోల్డ్!

కరూర్ వైశ్యా బ్యాంక్ చౌక వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 9 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. గరిష్ట వడ్డీ రేటు 10.35 శాతం. అంటే కస్టమర్లు ఈ వడ్డీ రేట్లకు మధ్యలో హోమ్ లోన్స్ పొందొచ్చు.

వచ్చే వారంలో బ్యాంకులు 3 రోజులు పని చేయవు.. ఎప్పుడెప్పుడంటే?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా చౌక వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.1 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 8.05 శాతం. గరిష్ట వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. ఇక కర్నాటక బ్యాంక్‌లో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 7.95 శాతంగా కొనసాగుతోంది. కనీస వడ్డీ రేటు 8.24 శాతంగా ఉంది. గరిష్ట వడ్డీ రేటు 9.59 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు.

ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.7 శాతంగా ఉంది. కనీస వడ్డీ రేటు 8.25 శాతం. ఇక గరిష్ట వడ్డీ రేటు 10.1 శాతంగా కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో రెపో లింక్డ్ లెండింగ్ రేటు 8.7 శాతంగా ఉంది. కనిష్ట వడ్డీ రేటు 8.3 శాతంగా, గరిష్ట వడ్డీ రేటు 9.7 శాతంగా ఉంది. కాగా హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోవాలని భావించే వారు రెగ్యులర్‌గా ప్రిమెంట్ చేయడం, తక్కువ కాలం ఈఎంఐ ఎంచుకోవడం, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వీటి ద్వారా హోమ్ లోన్ రేట్లను తగ్గించుకోవచ్చు.

First published:

Tags: Banks, Home loans, Interest rates, Personal Finance

ఉత్తమ కథలు