Fixed Deposits | బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో చెక్ చేసుకోవాలి. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవడం ఉత్తమం. ఇప్పుడు మనం 8 శాతానికి పైగా అందించే బ్యాంకులు (Bank) ఏవో ఒకసారి తెలుసుకుందాం. వీటిల్లో డబ్బులు దాచుకోవడం వల్ల అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు.
ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు 8.01 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. 2 ఏళ్ల నుంచి 30 నెలల వరకు టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు 8.05 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. 666 రోజుల టన్యూర్‌కు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.
మార్కెట్‌లోకి కొత్త కారు.. మైలేజ్ 26 కిలోమీటర్ల పైనే..
అలాగే డీసీబీ బ్యాంక్ కూడా అధిక వడ్డీ రేటు అందిస్తోంది. ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు ఏకంగా 8.35 శాతం వరకు వడ్డీని అందుబాటులో ఉంచింది. 700 రోజుల నుంచి 36 నెలల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. అలాగే ఈ బ్యాంక్ 18 నెలల నుంచి 700 రోజుల ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీని అందిస్తోంది.
వడ్డీ రేట్లు పెంచిన ప్రైవేట్ బ్యాంక్.. కస్టమర్లకు గుడ్ న్యూస్!
ఇంకా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా 8 శాతం వడ్డీని రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు ఈ వడ్డీ వర్తిస్తుంది. 18 నెలల నుంచి మూడేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. ఇంకా యస్ బ్యాంక్ కూడా 8 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. 25 నెలల టెన్యూర్‌లోని స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఈ వడ్డీ రేటు అందుబాటులో ఉంది. అలాగే 35 నెలల టెన్యూర్‌లోని ఎఫ్‌డీపై అయితే 8.25 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.
అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బులు దాచుకోవచ్చు. కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా వరుసపెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుకుంటూ వస్తున్నాయి. అంతేకాకుండా రానున్న కాలంలో కూడా రెపో రేటు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పైకి చేరుతాయని అంచనాకు రావొచ్చు. ఇదే జరిగితే డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. అలాగే లోన్ తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Money