హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank News: ఈ 5 బ్యాంకులతో భారీ లాభాలు పొందండి.. డబ్బులు పెట్టినోళ్ల పంట పండినట్లే!

Bank News: ఈ 5 బ్యాంకులతో భారీ లాభాలు పొందండి.. డబ్బులు పెట్టినోళ్ల పంట పండినట్లే!

ఈ 5 బ్యాంకులతో భారీ లాభాలు పొందండి.. డబ్బులు పెట్టినోళ్ల పంట పండినట్లే!

ఈ 5 బ్యాంకులతో భారీ లాభాలు పొందండి.. డబ్బులు పెట్టినోళ్ల పంట పండినట్లే!

Bank Stocks | అదిరే లాభం పొందాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? బ్యాంకులు అదిరే రాబడి అందించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న కాలంలో కళ్లుచెదిరే లాభం సొంతం చేసుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Banks | బ్యాంకింగ్ స్టాక్స్ అదిరిపోయే రాబడిని ఇచ్చాయి. ఇటీవల కాలంలో బాగా ర్యాలీ చేశాయి. అయినా కూడా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ మాత్రం ఇంకా బ్యాంక్ (Bank) స్టాక్స్‌పై బుల్లిష్‌గానే ఉంది. బ్యాంకింగ్ రంగంలోని స్టాక్స్ వాల్యుయేషన్ ఎక్కువగా లేదని అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల స్టాక్స్ (Stocks) వాటి దీర్ఘకాల యావరేజ్‌లకు దగ్గరగా ఉన్నాయని లేదంటే కొంచెం పై స్థాయిలో నిలిచాయని వివరించింది.

  ప్రభుత్వ రంగ బ్యాంకుల అసెట్ క్వాలిటీ రేషియో బాగా మెరుగుపడిందని, అయినా కూడా ఈ బ్యాంకుల షేర్లు మాత్రం కోవిడ్ స్థాయి కన్నా ముందటి స్థాయిలోనే ఉన్నాయని వివరించింది. ప్రైవేట్ బ్యాంకుల వాల్యూయేషన్‌ మాత్రం చాలా నెమ్మదిగా ఉందని పేర్కొంది. టైర్ 2 ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కోవిడ్ కన్నా ముందు చాలా ఇబ్బందులు పడేవని, కానీ ఇప్పుడు గత రెండుత్రైమాసికాలుగా అసెట్ క్వాలిటీ మెరుగుపడుతూ వస్తోందని వివరించింది. రానున్న కాలంలో ఈ బ్యాంకులు ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయని అంచనా వేసింది.

  ఎస్‌బీఐ, పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరితే రూ.10 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

  కోటక్ ఇన్‌స్టిట్యూషన్ ఈక్విటీస్ ఏ ఏ స్టాక్స్‌ను సిఫార్సు చేస్తోందో ఒకసారి తెలుసుకుందాం.

  ఎస్‌బీఐ – స్టేట్ బ్యాంక్ షేరు ధర రానున్న కాలంలో రూ. 700కు చేరొచ్చని అంచనా వేస్తోంది. అంటే స్టాక్ ధర దాదాపు 27 శాతం మేర పైపైకి చేరనుంది.

  యాక్సిస్ బ్యాంక్ – ఈ బ్యాంక్ షేరు ధర రూ. 960కు చేరొచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ అంచనా వేస్తోంది. అంటే ఈ బ్యాంక్ షేరు ఇంకా 25 శాతం పైకి కదలొచ్చు.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 21 శాతం పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. షేరు ధర రూ. 1750కు ర్యాలీ చేయొచ్చు.

  బంగారం, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా పడిపోయిన ధరలు!

  ఐసీఐసీఐ బ్యాంక్ – బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ షేరు రూ. 1070కు చేరొచ్చని భావిస్తోంది. అంటే 21 శాతం ర్యాలీ ఉండొచ్చని పేర్కొంటోంది.

  డీసీబీ బ్యాంక్ – కోటక్ సెక్యూరటీస్ ఈ షేరు ధర రూ. 145కు చేరొచ్చని పేర్కొంటోంది. అంటే షేరు ధర 34 శాతం పరుగులు పెట్టనుంది.

  ఇకపోతే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. అందువల్ల ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా మేరకు షేర్లలో డబ్బులు పెట్టడం ఉత్తమం. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఈ సిఫార్సులు కేవలం అవగాహనకు మాత్రమే ఇచ్చాం. దీని ఆధారంగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Axis bank, HDFC bank, Icici bank, Sbi, State bank of india

  ఉత్తమ కథలు