Multibagger Stocks | స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలని చూస్తున్నారా? అయితే ఏ ఏ స్టాక్స్ ఈ కొత్త ఏడాదిలో పరుగులు పెడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ 2023 ఏడాదికి గానూ పలు స్టాక్స్‌ను (Stocks) సిఫార్సు చేసింది. వీటిల్లో డబ్బులు (Money) పెడితే అదిరే రాబడి పొందొచ్చని పేర్కొంటోంది. షేర ఖాన్ సిఫార్సు చేసిన స్టాక్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
కోఫోర్జ్ షేరు పరుగులు పెట్టొచ్చని షేర్ ఖాన్ పేర్కొంటోంది. ఈ షేరు టార్గెట్ ప్రైస్‌ను రూ. 4680గా నిర్దేశించింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 4 వేల మార్క్ కిందకే ఉంది. అంటే ఒక్కో షేరు ఇన్వెస్టర్లకు రూ.600కు పైగా రాబడిని అందించనుంది. అలాగే సన్ ఫార్మా స్టాక్ కూడా దుమ్ముదులిపే ఛాన్స్ ఉందని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. ఈ షేరుకు రూ. 1300 టార్గెట్ ప్రైస్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 1020 సమీపంలో ఉంది. అంటే షేరు ధర మరో 28 శాతం మేర పైకి చేరనుంది.
మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? క్షణాల్లో రూ.3 లక్షల లోన్ పొందండిలా!
ఇంకా కోల్ ఇండియా షేరు కూడా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించొచ్చని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. అందుకే ఈ షేరును కొనొచ్చని సిఫార్సు చేస్తోంది. ఈ షేరుకు షేర్ ఖాన్ రూ. 280 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ఈరోజు ఈ షేరు ధర రూ. 218 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఇన్వెస్టర్లకు 28 శాతం వరకు రాబడి రావొచ్చు. అలాగే మరో షేరు కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ కొనొచ్చని షేర్ ఖాన్ తెలియజేస్తోంది. ఈ షేరకు బై రేటింగ్ ఇచ్చింది. ఈ స్టాక్ రూ. 2,250 వరకు చేరొచ్చని పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 1830 వద్ద ఉంది. అంటే ఒక్కో షేరుకు రూ. 420 మేర రాబడి రావొచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.15,000 డిస్కౌంట్, నెలకు రూ.1,800 కడితే చాలు!
ఇకపోతే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. షేర్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుందని గుర్తించాలి. దీనికి సిద్ధపడిన వారే మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఉత్తమం. లేదంటే పెట్టిన డబ్బులు కూడా తిరిగి వెనక్కి రాకపోవచ్చు. అందుకే మార్కెట్‌లో డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. పైన పేర్కొన్న స్టాక్ సిఫార్సులు సంబంధిత బ్రోకరేజ్ సంస్థలకు చెందినవి. వీటితో న్యూస్18 తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే డబ్బులు పెట్టడానికి ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks