Home /News /business /

THESE 4 PENNY STOCKS GAVE GREAT RETURNS DO YOU HAVE ANY IN YOUR PORTFOLIO MK

Penny Stocks: ఒకే రోజులో 20 శాతం లాభం అందించిన 4 పెన్నీ స్టాక్స్ ఇవే..మీరు ఓ లుక్కేయండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెన్నీ స్టాక్స్ లో సైతం ఫండమెంటల్స్ బలంగా ఉంటే, మంచి రాబడిని అందిస్తాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మాంద్యంలోనూ చాలా పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు 20 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. మంగళవారం మంచి లాభాలు అందించిన నాలుగు పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం.

ఇంకా చదవండి ...
    స్టాక్ మార్కెట్‌లో కుదుపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం మార్కెట్‌లో భారీగా పతనమైంది. మార్కెట్‌లో పతనాల పర్వం కొనసాగుతున్నా, కొన్ని చిన్న కంపెనీల షేర్లు నిలకడగా మంచి రాబడులను ఇస్తున్నాయి. అయితే సాధారణంగా మార్కెట్లో పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్ అని భావిస్తారు. కానీ పెన్నీ స్టాక్స్ లో సైతం ఫండమెంటల్స్ బలంగా ఉంటే, మంచి రాబడిని అందిస్తాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మాంద్యంలోనూ చాలా పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు 20 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. మంగళవారం మంచి లాభాలు అందించిన నాలుగు పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం.

    Vanta Bio Science:

    Vanta Bio Science Ltd. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఈ స్మాల్ క్యాప్ కంపెనీ ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్, మెడికల్ డివైజ్ , అగ్రి-ఫుడ్ పరిశ్రమలకు టాక్సికాలజీ రంగాల్లో సేవలను అందిస్తుంది. Vanta Bioscience స్టాక్ జనవరి 25న రూ.121.00 వద్ద ప్రారంభమైంది, అయితే చివరకు రూ.145.20 వద్ద ముగిసింది. అంటే ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 20 శాతం రాబడిని ఇచ్చింది.

    Ambica agarbathies:

    అంబికా అగర్బతీస్ అరోమా సెక్టార్ కు చెందిన ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు తయారీ యూనిట్లు ఉన్నాయి. అగర్బత్తి సుగంధ పరిశ్రమలో ఈ సంస్థఖు మంచి పేరుంది. అంబికా అగర్బత్తి స్టాక్ మంగళవారం రూ.28.75 వద్ద ప్రారంభమై, చివరకు రూ.34.35 స్థాయిలో ముగిసింది. తద్వారా ఈ స్టాక్ 19.90 శాతం రాబడిని ఇచ్చింది.

    Punjab Alkalies and Chemicals Ltd.

    పుంజ్ ఆల్కలీస్ (పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) షేర్ మంగళవారం తన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించింది. రూ.293.10 స్థాయిలో ప్రారంభమై చివరకు రూ.346.15 స్థాయి వద్ద ముగిసింది. ఈ స్టాక్ 18.10 శాతం రాబడిని ఇచ్చింది.

    Salona Cotspin Ltd:

    Salona Cotspin Ltd. స్టాక్ జనవరి 25న రూ. 275.90 స్థాయిలో ప్రారంభమై చివరకు బీఎస్ఈలో రూ.331.05 వద్ద ముగిసింది. తద్వారా ఈ స్టాక్ 19.99 శాతం రాబడిని అందించింది. సలోనా కాటన్‌స్పిన్ టెక్స్‌టైల్ సెక్టార్‌కి చెందిన ఈ కంపెనీ కాటన్ నూలు, అల్లిన బట్టలు , గార్మెంట్‌లను తయారు చేసి, విక్రయిస్తుంది. కంపెనీ ఉత్పత్తులు దేశీయ, విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Multibagger stock, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు