Money | డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ (MF) కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్ గురించి తెలియని వారు ఉంటే.. వారు నేరుగా షేర్ మార్కెట్‌లో కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. ఫండ్ మేనేజర్లు మీ ఇన్వెస్ట్‌మెంట్లను పర్యవేక్షిస్తూ వస్తారు. అందువల్ల స్టాక్ మార్కెట్ (Stock Market) కన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రిస్క్ మాత్రం ఉంటుంది.
మనం ఇప్పుడు గత పదేళ్ల కాలంలో 23 శాతం వరకు రాబడిని ఇచ్చిన మూడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫండ్స్‌లో నెలకు రూ.10 వేలు సిప్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏకంగా రూ. 40 లక్షలకు చేరి ఉండేది. నిప్సాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత పదేళ్ల కాలంలో సగటున 23.13 శాతం మేర రాడిడిని ఇచ్చింది. అంటే నెలకు రూ. 10 వేలు సిప్ చేస్తూ వచ్చి ఉ:టే.. ఇప్పుడు ఏకంగా రూ. 40.72 లక్షలు వచ్చి ఉండేవి. ఈ స్కీమ్‌లో కనీసం రూ. 5 వేలు పెట్టి చేరొచ్చు. లేదంటే సిప్ రూ.1000 నుంచి ప్రారంభం అవుతోంది.
లోన్ తీసుకునే వారికి శుభవార్త.. ఈ బ్యాంకుల్లో రూపాయి కన్నా తక్కువ వడ్డీకే రుణాలు!
ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా పదేళ్ల కాలంలో 22.61 శాతం రాబడిని ఇచ్చింది. అంటే నెలకు రూ. 10 వేల చొప్పున డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇప్పుడు మీ చేతికి ఒకేసారి రూ. 39.59 లక్షలు వచ్చి ఉండేవి. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు కనీసం రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిప్ అయితే నెలకు రూ.1000 కడుతూ రావాలి.
షాకుల మీద షాకులు.. ఈరోజూ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే!
ఇంకా క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ కూడా సూపర్ రిటర్న్ ఇచ్చింది. ఈ ఫండ్ స్కీమ్ గత పదేళ్ల కాలంలో ఏకంగా 22.32 శాతం రాబడిని ఇచ్చింది. అంటే రూ. 10 వేలు సిప్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 38.97 లక్షలుగ మారి ఉండేది. ఈ స్కీమ్‌లో కూడా నెలకు రూ. 1000 సిప్‌తో చేరొచ్చు. కనీస ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 5 వేలుగా ఉంది. కాగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు మార్కెట్ రిస్క్‌కు లోబడే ఉంటాయి. అందువల్ల మీరు డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Mutual Funds, Sbi, SIP, State bank of india