Multibagger Return | బ్యాంక్ షేర్లు దుమురేపుతున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన పలు బ్యాంకులు, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులు (Banks) కూడా ఇన్వెస్టర్ల పంట పండిస్తున్నాయి. డబ్బులు (Money) పెట్టిన వారికి కాసుల వర్షం కురిపించాయి. కళ్లు చెదిరే రాడిని అందించాయి. కేవలం ఆరు నెలల కాలంలోనే భారీ రాబడిని ఇచ్చాయి. డబ్బును రెట్టింపు చేశాయి. ఏ ఏ షేర్లు అదరగొట్టాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
కర్నాటక బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ వంటి షేర్లు మల్టీబ్యాటర్ రిటర్న్ అందించాయి. ఆరు నెలల కాలంలోనే భారీ లాభాలు పంచి పెట్టాయి. యూకో బ్యాంక్ షేరు గత ఆరు నెలల కాలంలో ఏకంగా 115 శాతం రాబడిని ఇచ్చింది. షేరు ధర రూ. 11 నుంచి రూ. 25కు చేరింది. అంటే ఆరు నెలల కిందట రూ. లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ. 2 లక్షలకు పైగా వచ్చేవి. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్నాటక బ్యాంక్ వంటివి కూడా దాదాపు ఇదే రకమైన రాబడిని ఇచ్చాయి.
కస్టమర్లకు షాకిచ్చిన 2 బ్యాంకులు.. కీలక ప్రకటన, ఈరోజు నుంచి..
అంటే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ స్టాక్స్‌లో డబ్బులు పెట్టిన వారికి అదిరే రాబడి లభించిందని చెప్పుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు ఒక విషయం తెలుసుకోవాలి. భారీ లాభాలతో పాటుగా నష్టాలు కూడా ఉంటాయి. అందువల్ల మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లాభాలు అందిచ్చాయని డబ్బులు పెడితే నష్టాలు రావొచ్చు.
రూ.5 లక్షల కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి. వెళ్లొచ్చు!
అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరో చెప్పారని మాత్రం ఇన్వెస్ట్ చేయవద్దు. పెట్టిన డబ్బులు కూడా రాకుండా పోవచ్చు.
ఇకపోతే సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు ధర రూ. 16 వద్ద ఉంది. అదే సమయంలో కర్నాటక బ్యాంక్ షేరు ధర రూ. 137 వద్ద కదలాడుతోంది. కాగా ఈ రోజు స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 928 పాయింట్లు కుప్పకూలింది. 59,744 వద్ద ముగిసింది. అలాతే నిఫ్టీ విషయానికి వస్తే.. 272 పాయింట్లు నష్టపోయింది. 17,554 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో చాలా వరకు షేర్లు నష్టాల్లోనే ఉండిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks