హోమ్ /వార్తలు /బిజినెస్ /

Banks: ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!

Banks: ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!

ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!

ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!

FD Rates | బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకుల్లో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ గడువు ఈ నెల చివరితో ముగియనుంది. అంటే వచ్చే నెల నుంచి ఈ స్కీమ్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Fixed Deposit| బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకంటే వచ్చే నెల నుంచి కొన్ని స్కీమ్స్ అందుబాటులో ఉండవు. కొన్ని బ్యాంకులు (Banks) ప్రత్యేక ఎఫ్‌డీ (FD) స్కీమ్స్‌ను క్లోజ్ చేయనున్నాయి. చాలా బ్యాంకులు కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) పథకాలను అందిస్తున్నాయి. వీటిల్లో కొన్ని బ్యాంకులకు చెందిన ఎఫ్‌డీ స్కీమ్స్ వచ్చే నెల నుంచి అందుబాటులో ఉండవు. ఏ ఏ బ్యాంకులకు చెందిన ఏ ఏ స్కీమ్స్ అందుబాటులో ఉండవో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

    ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , ఐడీబీఐ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చిన స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులో ఉండవు. బ్యాంకులు కోవిడ్ 19 వచ్చినప్పుడు ఈ స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. సీనియర్స్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ స్కీమ్స్ గడువు ముగియనుంది.

    ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఇలా చేస్తే రూ.549కే స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు!

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్‌ను తెచ్చింది. 2020 మే 18న దీన్ని లాంచ్ చేసింది. అలాగే ఐడీబీఐ బ్యాంక్ అయితే నమాన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ పేరుతో కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీన్ని 2020 ఏప్రిల్ 20న అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి అదనంగా 0.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉంది.

    రూ.37 వేల రియల్‌మి ఫాస్ట్ చార్జింగ్ ఫోన్‌ను రూ.5,099కే కొనండి!

    అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ కూడా 5 ఏళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌తో అందుబాటులో ఉంది. ఈ పథకంలో చేరే వారికి కూడా 0.75 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇకపోతే ఈ స్కీమ్‌లో చేరిన వారికి అన్ని బ్యాంకుల్లోని ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఏడాదిలో రూ. 50 వేలు దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. అలాగే ఐదేళ్ల కన్నా ముందు ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే వడ్డీ రేటు ఒక శాతం తగ్గుతుంది.

    కాగా మరోవైపు దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాత్రం తన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉండనుంది. ఇకపోతే ఎస్‌బీఐ తీసుకున్న గడువు పొడిగింపు నిర్ణయం నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఎఫ్‌డీ స్కీమ్స్ గడువును పొడిగించే అవకాశం ఉంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Banks, FD rates, Fixed deposits, HDFC bank, IDBI Bank, Money

    ఉత్తమ కథలు