• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • THESE 10 COUNTRIES WILL ALLOW YOU TO DRIVE USING AN INDIAN DRIVING LICENSE MK GH

Indian Driving License: ఇండియ‌న్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమ‌తించే దేశాలేవో తెలుసా?

ప్రతీకాత్మకచిత్రం

భార‌త‌దేశ‌పు డ్రైవింగ్ లైసెన్సు పది దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అక్కడి రోడ్ల‌పై భారతీయులు డ్రైవింగ్ చేయ‌వచ్చు. ఆ దేశాలేమిటో... మ‌న డ్రైవింగ్ లైసెన్సుకు అక్క‌డున్న ప‌రిమితులేమిటో తెలుసుకుందాం.

  • Share this:
కారులో షికారు చేయాల‌ని ఎవ‌రికుండ‌దు? డ్రైవింగ్ చేస్తూ చుట్టుపక్కల అందాలను ఆస్వాదించడాన్ని అందరూ ఇష్టపడతారు. అదే విదేశాల‌లో అయితే ఈ సంబ‌రం అంతా ఇంతా కాదు. ఇదంతా బానే ఉంది కానీ.. అక్క‌డ డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి క‌దా! ఏదో ఆట‌విడుపు కోసం అలా నాలుగుదేశాలు చుట్టి వద్దామ‌నుకునే వారికి ఈ లైసెన్స్‌ల గొడ‌వ చిరాకుగా ఉంటుంది. అయితే మ‌న భార‌త‌దేశ‌పు డ్రైవింగ్ లైసెన్సు పది దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. అక్కడి రోడ్ల‌పై భారతీయులు డ్రైవింగ్ చేయ‌వచ్చు. ఆ దేశాలేమిటో... మ‌న డ్రైవింగ్ లైసెన్సుకు అక్క‌డున్న ప‌రిమితులేమిటో తెలుసుకుందాం.

1. జ‌ర్మ‌నీ
జ‌ర్మ‌నీలో ఇండియ‌న్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహ‌నాలు న‌డిపేయొచ్చు. అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ఇంగ్లీషులో కానీ, జ‌ర్మ‌న్‌లో కానీ ఉంటే అక్క‌డి అధికారుల‌కు చాలా ఈజీగా ఉంటుంది. మీకూ ఏ గొడ‌వా ఉండ‌దు.

2. బ్రిటన్‌
బ్రిటన్‌లోనైతే ఏడాదిపాటు భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమ‌తిస్తారు. స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్‌,వేల్స్ దేశాల‌లో ఏడాదిపాటు భార‌త‌దేశ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహ‌నాలు న‌డుపుకోవచ్చు.

3. ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలోనూ ఇండియ‌న్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఆ దేశం అనుమ‌తిస్తుంది. అయితే చిన్న చిన్న ష‌ర‌తులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీషులో ఉండాలి. అయితే మూడునెల‌ల‌పాటు మాత్ర‌మే ఇక్క‌డ అనుమ‌తి ల‌భిస్తుంది. మ‌రో సంగ‌తేంటంటే మ‌న‌దేశంలోలానే ఆస్ట్రేలియాలో కూడా ఎడ‌మ‌చేతివైపే డ్రైవింగ్ చేయాలి.

4. న్యూజిలాండ్
అందాల‌దేశం న్యూజిలాండ్‌లో బ‌స‌చేసే విదేశీయులు త‌మ మాతృదేశ డ్రైవింగ్ లైసెన్స్‌తోనే ఏడాదిపాటు వాహ‌నాలు న‌డ‌పొచ్చు. అయితే మీకు ఏ వాహ‌నం న‌డ‌ప‌డానికి లైసెన్సు మంజూరు అయిందో ఆ వాహ‌నం మాత్ర‌మే న‌డ‌పాల్సి ఉంటుంది.

5. స్విట్జర్లాండ్
స్విజ్జ‌ర్లాండ్‌లో కూడా ఏడాదిపాటు మ‌న దేశపు డ్రైవింగ్ లైసెన్సుతో షికారు చేయ‌వచ్చు. ఇక్క‌డ మ‌న లైసెన్సుతో వాహ‌నాలు లీజుకు కూడా తీసుకునే స‌దుపాయం ఉంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ఇంగ్లీషులో ఉండాలి.

6. ద‌క్షిణాఫ్రికా
ద‌క్షిణాఫ్రికాలో కూడా భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమ‌తిస్తారు. కాక‌పోతే లైసెన్స్ ఇంగ్లీషులో ఉండాలి. అది ప్ర‌స్తుత కాలానికి చెందిన‌దై ఉండాలి. దానిపైన ఫోటో కూడా ఉండాలి దాంతోపాటు సంత‌క‌మూ త‌ప్ప‌నిస‌రి. ఇవ్వ‌న్నీ ఉంటే ద‌క్షిణాఫ్రికాలో మీ డ్రైవింగ్‌ను ఆపేవారే ఉండ‌రు.

7. స్వీడ‌న్
స్వీడ‌న్‌లో మీరు మీ సొంత కారు న‌డుపుకుంటూ గ‌మ్యం చేరాలంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీషులో కానీ, లేదా జ‌ర్మ‌న్‌, ఫ్రెంచ్‌, నార్వేనియ‌న్‌లో కానీ ఉండాలి.

8. సింగ‌పూర్
సింగ‌పూర్‌లో అంత‌ర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తే దేశ‌మంతా చుట్టేయ‌వచ్చు. భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్ ఈ దేశంలో ఒక ఏడాది పాటు ప‌నికొస్తుంది.

9. హాంగ్‌కాంగ్‌
హాంగ్ కాంగ్‌లోనూ ఏడాదిపాటు భార‌తీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు అనుమ‌తి ఉంది. ఎక్కువ రోజులు టూర్ ప్లాన్ చేసుకునే వారు ఈ దేశంలో వాహనాలను అద్దెకు తీసుకొని, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్సుతో యాత్రలకు వెళ్లవచ్చు.

10. మ‌లేసియా
మ‌లేసియా రోడ్ల‌పై వాహ‌నం న‌డ‌పాల‌నుకునే భార‌తీయుల‌కు వారి డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీషులో కానీ, మ‌లైలో కానీ ఉండాలి. దానిని మ‌లేసియాలోని ఇండియ‌న్ ఎంబ‌సీ గుర్తించాలి కూడా.
Published by:Krishna Adithya
First published: