రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చే డబ్బులు, లేదా ఇతర సందర్భాల్లో భారీగా వచ్చే డబ్బుల్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లలో (Fixed Deposit Accounts) దాచుకొని వడ్డీ పొందడం చాలామందికి అలవాటు. వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (FD Interest Rates) పోల్చి చూసుకొని డబ్బులు బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు. కొన్ని బ్యాంకులు వడ్డీ ఎక్కువగా ఇస్తుంటాయి. మూడు నుంచి ఐదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఏఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయో ఆ వివరాలను BankBazaar.com సేకరించింది. మరి ఏ బ్యాంకులో మూడు నుంచి ఐదేళ్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో, ఎక్కువ వడ్డీ ఇస్తున్న టాప్ 10 బ్యాంకులు ఏవో తెలుసుకోండి.
బ్యాంకు | వడ్డీ |
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7.35 శాతం |
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7.2 శాతం |
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7 శాతం |
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 6.9 శాతం |
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 6.75 శాతం |
డీసీబీ బ్యాంక్ | 6.6 శాతం |
యెస్ బ్యాంక్ | 6.5 శాతం |
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ | 6.5 శాతం |
ఇండస్‌ఇండ్ బ్యాంక్ | 6.5 శాతం |
ఆర్‌బీఎల్ బ్యాంక్ | 6.3 శాతం |
బ్యాంక్ బజార్ సంస్థ ఈ డేటాను సేకరించింది. 2022 జూన్ 24 ప్రకారం ఆయా బ్యాంకులు ఇస్తున్న వడ్డీ ఇది. రూ.1 కోటి లోపు సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మూడు నుంచి ఐదేళ్ల కాలానికి లభించే వడ్డీ రేట్లు ఇవి.
Loan in 30 seconds: అర నిమిషంలో పర్సనల్ లోన్... వాట్సప్‌లో Hi అని టైప్ చేయండి చాలు
ఏ బ్యాంకులో అయినా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు వడ్డీ మాత్రమే చూడొద్దు. బ్యాంకుకు ఉన్న మంచి పేరు, ట్రాక్ రికార్డ్, బ్రాంచ్‌ల సంఖ్య లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FD rates, High interest rates, Interest rates, Personal Finance