Home /News /business /

THERE WILL BE POWER OUTAGE IN 13 STATES FROM AUGUST 19 THE GOVERNMENT TOOK THIS DECISION DUE TO THE ACCUMULATION OF ELECTRICITY ARREARS VB

13 States Barred From Power Exchange: 13 రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం.. ఏపీ, తెలంగాణలో కూడా.. 

13 States Barred From Power Exchange: 13 రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం.. ఏపీ, తెలంగాణలో కూడా.. 

13 States Barred From Power Exchange: 13 రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం.. ఏపీ, తెలంగాణలో కూడా.. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, తమిళనాడుతో సహా దాదాపు 13 రాష్ట్రాలలో విద్యుత్తు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే.. విద్యుత్ ప్లాంట్లకు పేరుకుపోయిన బకాయిలు చెల్లింకపోవడంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), మధ్యప్రదేశ్(Madhya Pradesh) , రాజస్థాన్, తమిళనాడుతో సహా దాదాపు 13 రాష్ట్రాలలో విద్యుత్తు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే.. విద్యుత్ ప్లాంట్లకు పేరుకుపోయిన బకాయిలు చెల్లించనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. వాటిని చెల్లించే వరకు విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు , అమ్మకాలు(Buying and Selling) నిషేధించబడ్డాయి. డిస్కమ్‌లు(DISCOMS), జెన్‌కోలు(GENCOS) బకాయిలు చెల్లించనందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనల ఫలితంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యల కారణంగా ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ లో(Trading) మార్పులు చోటుచేసుకున్నాయి. పవర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ స్టాక్(Power Trading Platform Stock) గురువారం బిఎస్‌ఇలో(BSE) దాదాపు 3.6 శాతం క్షీణించి ఒక్కొక్కటి రూ.166.35 వద్ద ముగిసింది.

UPI Transaction Charges: ఇక నుంచి ఫోన్ పే, Google Pay, పేటీఎం లావాదేవీలపై చార్జీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..


కొత్త లేట్ పేమెంట్ సర్‌ఛార్జ్ (LPS) నిబంధనల ప్రకారం ఈ చర్య ఆగస్టు 19 నుండి వర్తించనుంది. జెన్‌కోలకు రాష్ట్ర డిస్కమ్‌ల పెండింగ్ బకాయిల మొత్తం రూ.5,085 కోట్లుగా ఉంది. అయితే ఈ చర్యలు తీసుకునే ముందు కూడా ఆయా రాష్ట్రాలను తాము చాలా సార్లు హెచ్చరించామని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఒకేసారి ఎక్స్ఛేంజీలలో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు నిరోధించడం మొదటిసారి. అంతక ముందు కేవలం ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి నిషేధం విధించాయి. తర్వాత బకాయిలు చెల్లించడంతో.. వెంటనే తొలగించారు. అయితే ఈ సారి మాత్రం దానికి భిన్నంగా ఒకే సారి 13 రాష్ట్రాలపై ఇలాంటి నిషేధాన్ని విధించింది. LPS నియమాల ప్రకారం.. ఏడు నెలలకు పైగా జెన్‌కోలకు పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే పవర్ ఎక్స్ఛేంజీల నుండి డిస్కమ్‌లు నిషేధించబడతాయి.

Apple iPhone 14 Phone Launch: ఆ రోజున iPhone 14 సిరీస్ లాంచ్..! ధర ఎంతో తెలుసా..


ఇప్పుడు ఈ 13 రాష్ట్రాలకు చెందిన డిస్కమ్‌లు కొత్త విద్యుత్ (లేట్ పేమెంట్ సర్‌ఛార్జ్) నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు పవర్ ఎక్స్ఛేంజీలలో కొనుగోళ్లు, అమ్మకాల ట్రేడింగ్ ను గురువారం రెండు గంటల పాటు పొడిగించారు.

Telangana High Court Jobs Update: సెప్టెంబర్ లో ఆ తేదీ నుంచి పరీక్షలు.. పూర్తి వివరాలిలా..


నిషేధం విధించిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ & కాశ్మీర్, బీహార్, జార్ఖండ్, మణిపూర్ , మిజోరం, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణలు ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: India, India states, Power cuts

తదుపరి వార్తలు