Home /News /business /

THE WEDDING SEASON IS STARTING AND WHAT IS THE REAL TIME TO BUY GOLD MK

Gold Price: మాఘమాసం వచ్చేస్తోంది, పెళ్లిళ్ల సీజన్ షురూ అవుతోంది...మరి బంగారం కొనేందుకు అసలైన టైం ఏది..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో కరోనా మూడో వేవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్ మరోసారి పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మార్కెట్ల ఊగిసలాటలో బంగారంపైనే పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    బంగారం ధరలు ప్రస్తుతం కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మాఘమాసం నుంచి పెళ్లిల్ల సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న తక్కవ ధరలోనే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటే, జేబు భారం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములు రూ.49,040 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అంచనాల ప్రకారం పసిడి ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు పెరిగాయి. అదే సమయంలో, ఢిల్లీలో బంగారం ధర మారలేదు. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46850కి చేరుకుంది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.49550కి చేరింది.  ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46750 మరియు 24 క్యారెట్ల బంగారం రూ. 49500 వద్ద కొనసాగుతోంది.

    బంగారంపై ఒమిక్రాన్ ప్రభావం..

    ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో కరోనా మూడో వేవ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్ మరోసారి పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మార్కెట్ల ఊగిసలాటలో బంగారంపైనే పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగే నేపథ్యంలో బంగారం మరోసారి పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కరోనా తొలి వేవ్ విజృంభించిన నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పసిడి తులం తొలిసారిగా రూ.50 వేల మార్కును అందుకుంది. అది కంటిన్యూ అవుతూ ఏకంగా రూ.56 వేల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని అందుకుంది. కాగా 2021లో కాస్త శాంతించినప్పటికీ, సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి పసిడి రికార్డు స్థాయిలో ఎగిసింది. అక్కడి నుంచి పసిడి కాస్త తగ్గినప్పటికీ, ప్రస్తుతం మూడో వేవ్ ఒమిక్రాన్ నేపథ్యంలో సైతం పసిడి కొత్త గరిష్టాలను తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు ప్రస్తుతం తక్కువగానే ఉన్న నేపథ్యంలో, స్పాట్ బంగారు ఆభరాణాలు కొనుగోలు చేసేవారు, ఇప్పుడే కొనుగోలు చేస్తే సరిపోతుందని, లేకపోతే భవిష్యత్తులో వీటి ధర మరింత పెరిగే చాన్స్ ఉందని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు.

    బంగారం ధరలు ఫిబ్రవరి, మార్చిలో నుతన గరిష్టాలను తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ఔన్సు ధర 2 వేల డాలర్ల సమీపానికి చేరే అవకాశం ఉందని (ఔన్సు బంగారం అంటే 31 గ్రాములు) ఇది కనుక జరిగితే బంగారం ధర త్వరలోనే తులం రూ.65 వేల నూతన గరిష్ట స్థాయిని తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తన్నారు. ఈ నేపథ్యంలో స్పాట్ బంగారం కొనుగోలు చేసే వారు ప్రస్తుతం ఉన్నటువంటి ధరల వద్ద కొనుగోలు చేస్తే జేబుకు చిల్లు పడే అవకాశం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Gold, Gold jewellery

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు