పెట్రోల్ లేకుండా నడిచే వాహనం... 9వ తరగతి విద్యార్థి ఆవిష్కరణ

సూర్యుడి నుంచి వెలువడే సౌరగాలులు, కాస్మిక్ రేస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే పరికరం అది. ఆ పరికరం వాహనాన్ని ముందుకు నడపడమే కాదు విద్యుత్తును కూడా తయారు చేస్తుంది.

news18-telugu
Updated: February 12, 2019, 1:01 PM IST
పెట్రోల్ లేకుండా నడిచే వాహనం... 9వ తరగతి విద్యార్థి ఆవిష్కరణ
పెట్రోల్ లేకుండా నడిచే వాహనం... 9వ తరగతి విద్యార్థి ఆవిష్కరణ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: February 12, 2019, 1:01 PM IST
బైకు ముందుకు కదలాలంటే పెట్రోల్ లేదా డీజిల్ కావాలి. లేదా బ్యాటరీ అన్నా ఉండాలి. కానీ... ఇవేమీ లేకుండా వాహనాన్ని నడిపించగలిగితే... పెద్దపల్లి జిల్లా రామగుండంలో 9వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి ఇలాంటి ఆలోచనే వచ్చింది. తన బుర్రలో పుట్టిన ఆలోచనకు పదును పెట్టింది. ప్రయత్నించింది. సక్సెస్ అయింది. తోటి విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులనూ ఆశ్చర్యపర్చింది.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

ఆ అమ్మాయి పేరు గిడ్ల రజని. రామగుండంలోని ఓ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. పెట్రోల్, డీజిల్ అవసరం లేని వాహనం తయారు చేయాలన్నది ఆమె లక్ష్యం. వాహనం ముందుకు కదలాలంటే శక్తి కావాలి. ఆ శక్తి కోసం ఓ పరికరం కావాలి. ఆ అమ్మాయి అలాంటి పరికరాన్నే తయారు చేసింది. ఆ పరికరం పేరు 'అయాన్ ప్రపల్షన్ ఇంజిన్ అండ్ అట్మాస్పిరిక్ అయాన్ హార్వెస్టింగ్'. సూర్యుడి నుంచి వెలువడే సౌరగాలులు, కాస్మిక్ రేస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే పరికరం అది. ఆ పరికరం వాహనాన్ని ముందుకు నడపడమే కాదు విద్యుత్తును కూడా తయారు చేస్తుంది.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చురజని ఆవిష్కరించిన పరికరం ఉపాధ్యాయుల్ని ఆశ్చర్యపర్చింది. అంతేకాదు... జాతీయ స్థాయిలో జరిగే ప్రదర్శనలో ఈ ఆవిష్కరణ ఎంపిక కావడం విశేషం. ఢిల్లీలో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరిగే నేషనల్ ఇన్‌స్పైర్-మానాక్ ఎగ్జిబిషన్‌లో రజని తయారు చేసిన పరికరాన్ని ప్రదర్శించనున్నారు. 9వ తరగతి చదువుతూనే ఇలాంటి గొప్ప ఆవిష్కరణ చేయడమంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తే ఈ అమ్మాయి ఇంకా ఎన్ని గొప్ప ఆవిష్కరణలు చేస్తుందో?

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు


ఇవి కూడా చదవండి:

TRAI rules: ఛానెళ్లు సెలెక్ట్ చేసుకున్నారా? మీ కేబుల్ బిల్ ఇలా మారుతుంది

Save Money: జీతం మొత్తం ఖర్చయిపోతుందా? డబ్బు ఆదా చేయడానికి 5 టిప్స్

IRCTC Ticket Booking: రిజర్వేషన్ సమయంలో ఈ 8 విషయాలు గుర్తుంచుకోండి
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...