చైనా వద్దు... ఇండియా ముద్దు... భారత్ నుంచీ మరిన్ని దిగుమతులకు ఆసక్తిగా అమెరికా

US vs China : చైనాతో వాణిజ్య యుద్ధంలో తలపడలేకపోతున్న అమెరికా... డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పాలని డిసైడైంది. అందులో భాగంగా... ఇకపై ఇండియా నుంచీ దిగుమతులు పెంచుకోవాలని భావిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 11:29 AM IST
చైనా వద్దు... ఇండియా ముద్దు... భారత్ నుంచీ మరిన్ని దిగుమతులకు ఆసక్తిగా అమెరికా
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 11:29 AM IST
తాను ఏం చెప్పినా ప్రపంచ దేశాలు వినాల్సిందే అనే ధోరణి అవలంబిస్తున్న చైనాకు చెక్ పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులకు చెక్ పెట్టాలంటే... చైనా నుంచీ దిగుమతులు తగ్గించి, భారత్ నుంచీ దిగుమతులు పెంచుకోవడమే సరైన మార్గమని భావిస్తోంది. మొత్తం ఏడు రంగాల్లో భారత్ నుంచీ ఉత్పత్తులు తెప్పించుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోందని తెలిసింది. ప్రస్తుతం చైనా నుంచీ అమెరికాకు క్రీడా వస్తువులు, బొమ్మలు, స్టేషనరీ, కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఎగుమతి అవుతున్నాయి. ఐతే... చైనా, అమెరికా రెండూ... తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఎక్సైజ్ సుంకాలు పెంచేసుకోవడంతో... ఇప్పుడు చైనా నుంచీ అమెరికాకు వస్తున్న వస్తువుల రేట్లు బాగా పెరిగాయి. అంత రేటు పెట్టి... బ్రాండ్ లేని యూజ్ అండ్ త్రో చైనా ఉత్పత్తులు కొనేబదులు... బ్రాండ్ ఉండే... ఎక్కువ కాలం మన్నే భారతీయ ఉత్పత్తులు కొనడం బెటరని అమెరికా భావిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే, వల్కనైజ్డ్ రబ్బర్, ఫుట్‌వేర్, కిచెన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారత్ నుంచీ చైనాకు ఎగుమతి అయ్యే అవకాశాలు మెరగవుతాయి.

ప్రస్తుతం చైనాలాగే... వియత్నాం, కాంబోడియా కూడా... అమెరికాకు తమ ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. ఇండియాతో అమెరికా కొత్త డీల్స్ కుదుర్చుకోవాలంటే... ఓ ఐదారు నెలలు పడుతుంది. ఈ లోపు వియత్నాం, కాంబోడియా... భారత్ ఎగుమతి చేయాలనుకునే వస్తువుల్ని అంతకంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ రెండు దేశాలూ ఇండియాకి పోటీగా నిలిచే పరిస్థితి ఉంది.

ఈ వస్తువులకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ భారత్... 1.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది. ఒక్క షూ విషయంలోనే... ఏడాదికి 10 లక్షల జతల షూలను అమెరికా డిమాండ్ చేస్తోంది. త్వరలో అమెరికా కోరినన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధమని భారత్ ప్రకటించింది. అదే జరిగితే... ఈ ఉత్పత్తుల్లో భారత్ ఎగుమతులు 25 శాతం పెరిగే అవకాశాలుంటాయి.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...