హోమ్ /వార్తలు /బిజినెస్ /

Charging Time: ఇది మాములు విషయం కాదు భయ్యా.. 10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ ఫుల్ ఛార్జ్!

Charging Time: ఇది మాములు విషయం కాదు భయ్యా.. 10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ ఫుల్ ఛార్జ్!

(Pic: quantumscape.com)

(Pic: quantumscape.com)

Charging Time: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లను ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంటల పాటు వేచి చూడాల్సిందే. ఎలక్ట్రిక్ కార్లలో కూడా ఇదే సమస్య నెలకొంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు నడుంబిగించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈవీలలోని కొన్ని డిసడ్వాంటేజెస్ లేదా సమస్యలు వాహనదారులను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. వాటిలో సుదీర్ఘ ఛార్జింగ్ టైమ్‌ (Charging Time) ఒకటని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లను ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంటల పాటు వేచి చూడాల్సిందే. ఎలక్ట్రిక్ కార్లలో కూడా ఇదే సమస్య నెలకొంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు నడుంబిగించారు. అమెరికన్ కెమికల్ సొసైటీ (American Chemical Society)కి చెందిన శాస్త్రవేత్తలు (Scientists) ఈవీల ఛార్జింగ్ టైమ్‌ను 10 నిమిషాల కంటే తక్కువకు తగ్గించగల సరికొత్త సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ మెథడ్‌ను ACS ఫాల్ మీటింగ్‌ 2022లో ప్రదర్శించారు.

సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీలోని నెగటివ్, పాజిటివ్ నోడ్‌ల మధ్య లిథియం అయాన్లు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి బ్యాటరీలో ఛార్జింగ్ చాలా తక్కువ సమయంలో ఫాస్ట్‌గా ఎక్కేలాగా చేస్తే లిథియం అయాన్లు పేలవమైన సామర్థ్యంతో నోడ్‌ల మధ్య మారతాయి. ఫలితంగా బ్యాటరీ అనేది చాలా తొందరగా ఫెయిల్ అవుతుంది. అలానే ప్లాటింగ్ అనే సమస్య తలెత్తుతుంది. అంటే లిథియం మెటల్ అనేది బ్యాటరీలోని యానోడ్ చుట్టూ అధికంగా పెరిగిపోతుంది. దీనికితోడు కాథోడ్ క్రాకింగ్ ప్రాబ్లమ్‌ వస్తుంది.

పైన చెప్పినట్టుగా ఛార్జింగ్ టైమ్ బాగా తగ్గిస్తే.. బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం అవుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ఛార్జింగ్ టైమ్‌ తగ్గించడం ఒక సవాలేనని చెప్పవచ్చు. అయితే ఒక రీసెర్చ్‌లో ఆ సవాళ్లను అధిగమించినట్లు ఆ అధ్యయన ప్రధాన రచయిత ఎరిక్ డుఫెక్ పేర్కొన్నారు.

తక్కువ సమయంలో బ్యాటరీ సెల్‌లోకి వెళ్లగల శక్తి (Energy)ని అధికంగా పెంచామన్నారు. ప్రస్తుతం, తమ ఛార్జింగ్ పద్ధతి ద్వారా లిథియం ప్లాటింగ్ లేదా కాథోడ్ క్రాకింగ్ వంటి సమస్యలేవీ లేకుండా బ్యాటరీలు 10 నిమిషాల్లో 90 శాతానికి పైగా ఛార్జ్ అవుతున్నాయని అన్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన కొత్త పద్ధతిని ఆగస్టు 22న జరిగిన ACS ఫాల్ మీటింగ్‌లో ప్రదర్శించారు.

ఇది కూాడా చదవండి : గూగుల్ పే యూపీఐ పిన్ మార్చి సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండి ఇలా

బ్యాటరీ ఫెయిల్యూర్ లేదా డ్యామేజ్ సవాళ్లను అధిగమించడానికి రీసెర్చ్‌ టీమ్‌ మెంబర్స్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్‌లను వాడారు. అయితే ఛార్జింగ్, డిశ్చార్జింగ్ టైమ్‌లో బ్యాటరీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి డేటా అల్గారిథం లోడ్స్‌ను ఉపయోగించారు. ఈ డేటా బ్యాటరీ లైఫ్‌కు హాని కలిగించకుండా ఫాస్ట్‌గా ఛార్జ్ చేసే సరికొత్త బ్యాటరీ ప్రోటోకాల్స్‌ను రూపొందించే విశ్లేషణకు దారితీసింది.

అలానే ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ సెకన్‌కు 0.15 శాతం ఛార్జింగ్ స్పీడ్‌ని సాధించడంలో రీసెర్చర్లకు హెల్ప్ అయ్యింది. పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ అనాలసిస్ చాలా సార్లు పరిశీలించి ఏ పద్ధతిలో అయితే బ్యాటరీలు పాడుకావో ఆ పద్ధతిని కనిపెట్టి ఈ ఘనత సాధించారు. కేవలం పది నిమిషాల సమయంలో 90% ఛార్జ్ చేసుకునే టెక్నాలజీ కమర్షియల్‌గా అందరికీ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రెట్టింపవుతాయని అనడంలో సందేహం లేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: America, Auto, Electric Bikes, Electric cars, Electric Vehicles

ఉత్తమ కథలు