హోమ్ /వార్తలు /బిజినెస్ /

Redmi Note 11T 5G: నెలాఖరులో రెడ్ మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న నోట్‌ 11T 5G

Redmi Note 11T 5G: నెలాఖరులో రెడ్ మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న నోట్‌ 11T 5G

redmi note 11t 5g

redmi note 11t 5g

రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Note 11T 5G) ఇండియాలో ఈనెల 30న అధికారికంగా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని షియోమీ ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించింది.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) సరికొత్త ఫోన్‌ (phone)ను లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన తేదీ కూడా ఖరారైపోయింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల (smart phones) తయారీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న రెడ్ మీ... ఇప్పుడు 5జీ ఫోన్‌తో మన ముందుకు రాబోతోంది. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Note 11T 5G) ఇండియాలో ఈనెల 30న అధికారికంగా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని షియోమీ (Xiomi) ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించింది.

గత నెలలో చైనాలో లాంచ్..

ఈ ఫోన్ పై ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి. గత నెలలో రీబ్రాండెడ్ రెడ్ మీ నోట్ 11 టీ 5జీ చైనాలో లాంచ్ (launch) అయింది. ఇందుకు సంబంధించిన పలు రివ్యూలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ కంపెనీకి చెందిన మొదటి 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (Primary camera)తో వచ్చిన రెడ్ మీ నోట్ 10 సిరీస్ మంచి విజయం సాధించింది. దీంతో కొత్తగా లాంచ్ కాబోతున్న రెడ్ మీ నోట్ 11టీ 5జీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా పేర్కొన్నట్లు ఈ డివైజ్‌ను నవంబర్ 30న (November 30) అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

* అదిరిపోయే ఫీచర్లు..

ఈ స్మార్ట్ ఫోన్ కూడా చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ (Redmi note) 11 5జీ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి హెచ్ డీ డిస్‌ప్లే ఉండనుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్‌ఓసీ ద్వారా 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ (Internal storage) కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్(MP) ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా (Dual Rear camera) సెటప్ ఈ డివైజ్‌లో ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కలిగి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.

* అందుబాటులో ధరలోనే విడుదల

రెడ్ మీ నోట్ 11 5జీ.. 4జీబీ ర్యామ్+128 స్టోరేజ్ వేరియంట్ ధర (Storage variant Price) చైనా కరెన్సీలో 1,199 యువాన్లుగా ఉంది. ఇండియాలో దీని రేటు (price) సుమారు రూ.14,000 వరకు ఉంది. 6జీబీ+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర చైనా కరెన్సీలో 1,299 ఉండగా... ఇండియాలో ఇది సుమారుగా 16,400 రూపాయలుగా ఉండనుంది. 8జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర చైనీస్ ధర 1,499 ఉంటే ఇండియాలో సుమారు 17,500 రూపాయలుగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మాట్టే బ్లాక్, స్టార్ డస్ట్, వైట్, ఆక్వామారిన్ బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.

First published:

Tags: 5G Smartphone, Redmi, Smartphone

ఉత్తమ కథలు