నవంబర్ 29న సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (Sovereign Gold Bonds) 8వ సిరీస్ సబ్‌స్క్రిప్షన్ కోసం రానున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించింది. 5 రోజుల కాలవ్యవధి గల గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ VIII (2021-22) సబ్‌స్క్రిప్షన్ గడువు డిసెంబర్ 3న ముగుస్తుంది. ఈ బాండ్లు డిసెంబర్ 7గా జారీ అవుతాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ హామీ ఉన్న ఆర్‌బీఐ గోల్డ్ బాండ్ (RBI Gold bonds)లలో నష్టభయం లేకుండా పెట్టుబడి (Investment) పెట్టొచ్చని ఆర్థిక నిపుణులు (Financial experts) సూచిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ కాలం సమీపిస్తున్న వేళ గోల్డ్ బాండ్ స్కీమ్ (Gold bond scheme)కి గురించి ముఖ్య వివరాలు ఇప్పుడు చూద్దాం.
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ-SGB) అంటే ఏమిటి?
ఈ పసిడి బాండ్లు అనేవి గ్రాముల బంగారం (gold)తో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఈ డిజిటల్ గోల్డ్ కోసం పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచూరిటీ సమయంలో ఈ బాండ్లను నగదు రూపంలో రీడీమ్ (Redeem) చేయవచ్చు. భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్‌లను జారీ చేస్తుంది.
ఎస్‌జీబీలలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు అర్హులు?
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, (Foreign Exchange Management Act) 1999 ప్రకారం భారతదేశంలో నివసించే వ్యక్తి ఎస్‌జీబీలో పెట్టుబడి (Investment) పెట్టడానికి అర్హులు. అర్హులైన పెట్టుబడిదారులలో వ్యక్తులు, ట్రస్టులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. రెసిడెంట్ నుంచి నాన్-రెసిడెంట్‌గా రెసిడెన్షియల్ స్టేటస్‌లో మార్పులు ఉన్న పెట్టుబడిదారులు ముందస్తు రిడెంప్షన్/మెచూరిటీ వరకు ఎస్‌జీబీని కొనసాగించవచ్చు.
వడ్డీ రేటు ఎంత, వడ్డీ ఎలా చెల్లిస్తారు?
సావరిన్ బంగారు బాండ్ల (Sovereign Gold Bonds) తొలి పెట్టుబడి మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుడి బ్యాంక్ ఖాతాకు వడ్డీ జమవుతుంది. చివరి ఆరునెలల వడ్డీని మెచూరిటీ సమయంలో అసలు మనీతో సహా కలిపి చెల్లిస్తారు.
బాండ్లను ఏ ధరకు విక్రయిస్తారు?
సబ్‌స్క్రిప్షన్ కాలానికి ముందు వారంలోని చివరి 3 పనిదినాల్లో 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల సాధారణ సగటు లెక్కించి.. బాండ్ల ధరను నిర్ణయిస్తారు. ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం ముగింపు ధరలను పరిగణలోకి తీసుకుంటారు.
కాలపరిమితి ఏంటి?
ఈ బాండ్ల కాలవ్యవధి 8 సంవత్సరాలుగా ఉంటుంది. 5వ ఏళ్ల తర్వాత ఎగ్జిట్ ఎంపికతో బాండ్లు కొనుగోలు చేస్తే.. ఐదేళ్ల ఆరు నెలల తర్వాతఎగ్జిట్ అవ్వొచ్చు. ఆరేళ్ల ఎగ్జిట్ ఎంపికతో బాండ్లలో పెట్టుబడి పెట్టినా.. ఆరు సంవత్సరాల ఆరు నెలల తర్వాత అంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్ లో ప్రీ-మెచూర్ గా పథకంలో క్లోజ్ చేయొచ్చు.
కనిష్ట, గరిష్ట గోల్డ్ సైజ్ లిమిట్ ఎంత?
పెట్టుబడిదారులు కనీసం 1 గ్రాము బంగారం నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్టంగా ఓ వ్యక్తి 4 కేజీలు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. హెచ్యూఎఫ్ (HUF) 4 కేజీలు.. ట్రస్ట్‌ల లాంటి సంస్థలు ఓ ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) 20 కేజీలు గోల్డ్ లో ఇన్వెస్ట్ చెయవచ్చు. గరిష్ట, కనిష్ట పరిమితి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
భౌతిక బంగారం, ఆభరణాలతో పోలిస్తే బంగారు బాండ్లతో ప్రత్యేకప్రయోజనాలేంటి ?
బంగారం కోసం చెల్లించే డబ్బులో పెట్టుబడిదారుడు నష్టపోడు. ఎందుకంటే అతను మెచూరుటీ సమయంలో కొనసాగుతున్న మార్కెట్ ధరను అందుకుంటాడు. స్టోరేజ్ ఖర్చులు, భయాలు ఉండవు కాబట్టి భౌతిక రూపంలో ఉండే బంగారానికి ఈ పథకం అత్యుత్తమ ప్రత్యామ్నాయం అవుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. మెచూరుటీ, కాలానుగుణ వడ్డీ సమయంలో పెట్టుబడిదారులకు బంగారం మార్కెట్ విలువపై భరోసా ఉంటుంది. ఇందులో మేకింగ్ ఛార్జీలు, స్వచ్ఛత వంటి సమస్యల ఉండవు. ఈ బాండ్‌లు ఆర్‌బీఐ పుస్తకాలలో లేదా డీమ్యాట్ రూపంలో రికార్డు చేస్తారు కావున ఇవి డిలీట్ అయ్యే ఛాన్స్ లేదు.
ఎస్‌జీబీలలో పెట్టుబడితోఏమైనా రిస్క్ ఉంటుందా?
మార్కెట్‌లో బంగారం ధర తగ్గితే పెట్టుబడిదారులు తమ క్యాపిటల్ అమౌంట్ లో కొంతమేర నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే, పెట్టుబడిదారుడు తాను కొన్న బంగారంలో యూనిట్ల పరంగా కోల్పోడు.
గోల్డ్ బాండ్ల నుంచి వచ్చే రాబడిపై పన్ను వర్తిస్తుందా?
ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధన ప్రకారం బంగారు బాండ్లపై లభించే వడ్డీకి పన్ను వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. అయితే, మెచ్యూరిటీ సమయంలో మూలధన లాభాలపై పన్ను మినహాయిస్తారు.
ఎస్‌జీబీలను విక్రయించే ఆథరైజ్డ్ ఏజెన్సీలు ఏవి?
బాండ్లను జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, షెడ్యూల్డ్ విదేశీ బ్యాంకులు, నియమించిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), ఆథరైజ్డ్ స్టాక్ ఎక్స్ఛేంజీల కార్యాలయాలు లేదా శాఖల ద్వారా నేరుగా లేదా వారి ఏజెంట్ల ద్వారా విక్రయిస్తారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా ఒక గ్రాము బంగారంపై రూ.50 తగ్గింపు పొందవచ్చు.
ఎలా కొనుగోలు చేయాలి?
బాండ్ల కోసం గరిష్టంగా రూ.20,000 వరకు క్యాష్ పేమెంట్ చేయవచ్చు. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కు లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
నో యువర్-కస్టమర్ (KYC) నిబంధనలు ఏంటి?
ప్రతి అప్లికేషన్ తప్పనిసరిగా ‘పాన్ నంబర్’తో పాటు ఉండాల్సి ఉంటుంది. పాన్ ను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇన్వెస్టర్లకి జారీ చేసి ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold Prices, Investment Plans, Rbi, Sovereign Gold Bond Scheme