హోమ్ /వార్తలు /బిజినెస్ /

Own House: సొంత ఇల్లు కొంటున్నారా..? అయితే ఇది చదవండి.. ఈ అంశాలను ఓసారి క్లారిఫై చేసుకోండి

Own House: సొంత ఇల్లు కొంటున్నారా..? అయితే ఇది చదవండి.. ఈ అంశాలను ఓసారి క్లారిఫై చేసుకోండి

కొత్త ఇల్లు కొంటున్నారా..? వీటి గురించి తెలుసుకోండి

కొత్త ఇల్లు కొంటున్నారా..? వీటి గురించి తెలుసుకోండి

సొంతిళ్లు చాలా మందికి ఉండే కల. ఇల్లు లేదా ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేయడానికి వర్షాకాలం అనువైన సమయంగా పరిగణించరు. ప్రస్తుత సీజన్‌లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.  

సొంతిళ్లు చాలా మందికి ఉండే కల. దీన్ని సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తుంటారు. సాధారణంగా ఇల్లు లేదా ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేయడానికి వర్షాకాలం అనువైన సమయంగా పరిగణించరు. మరోపక్క గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో వర్షాకాలంలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

* ఇంటిని పరిశీలించడం

వర్షాకాలంలో భారీగా వానలు పడతాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. దీంతో వ్యాపార కార్యకలాపాలకు చాలా తక్కువ ఉంటుంది. అయితే వాస్తవానికి మరోపక్క వర్షాలు గృహ కొనుగోలుదారులకు మేలు చేస్తాయి.

భవనాల్లో లీకేజీ, వాటర్ లాంగింగ్ సమస్యలు ఉంటే వానలు వాటిని బహిర్గతం చేస్తాయి. దీంతో ప్రస్తుతం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. వినియోగంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు తనిఖీ అనేది కీలక అంశం అవుతుంది. వర్షాకాలంలో ఇంటిని పరిశీలించడం వల్ల కొనుగోలు విషయంలో మరింత కచ్చితత్వంతో నిర్ణయం తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఇదీ భారతీయ విద్యార్థుల సత్తా.. ఆస్ట్రేలియా టాప్ యూనివర్సిటీకి ఎంపిక.. స్కాలర్‌షిప్ తెలిస్తే నోరెళ్లబెడతారు..!

* ఇంటి ధరలపై అవగాహన

ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతోపాటు లేబర్ ఖర్చులు పెరగడంతో డెవలపర్ల మార్జిన్‌లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో వారు ఇంటి అమ్మకాల విషయంలో ఎలాంటి డిస్కౌంట్లు ఆఫర్ చేయడం లేదు.

డెవలపర్లు డిస్కౌంట్ ఇవ్వకపోయినా, ఈ సమయాల్లో విక్రయాలు సాధారణంగా నెమ్మదిగా ఉంటాయి. దీంతో వారు ఫ్రీబీలను ప్రకటించవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, డౌన్ పేమెంట్ చేయడానికి సరిపోయే బ్యాంక్ బ్యాలెన్స్ వంటి అంశాల ఆధారంగా ఇంటిని కొనుగోలు చేయడంలో మీరు ఎంత తీవ్రంగా ఉన్నారో డెవలపర్ అంచనా వేస్తారు.


వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ స్థోమత ఒత్తిడికి లోనవుతుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఆర్థిక స్థోమత సూచిక మధ్య-సంవత్సర సమీక్ష ప్రకారం.. మే- జూన్‌లలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో 90 బేసిస్ పాయింట్ల పెంచడంతో మార్కెట్‌లలో సగటున 2 శాతం గృహ కొనుగోలు స్థోమత తగ్గగా, ఈఎంఐ లోడ్‌ను 6.97 శాతానికి పెరిగింది.

* సరైన రుణ ఎంపిక

అధిక ధరల దృష్ట్యా గృహ కొనుగోళ్లకు రుణాలు తీసుకోవడం అనివార్యమైంది. అయితే జాగ్రత్తగా అంచనా వేసిన రుణ ఎంపిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

పలు బ్యాంకులు గృహ రుణాలను మెరుగు పర్చుకునేందుకు ఛార్జీల మాఫీ, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆగస్టు 2021లో మాన్‌సూన్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. హోమ్ లోన్‌ల ప్రాసెసింగ్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలుదారులు బ్యాంకులు ఇచ్చే ఆఫర్‌లను సరిపోల్చవచ్చు. ఇందుకోసం అనేక బ్యాంకులను సంప్రదించవచ్చు.

పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా, రుణాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఈఎంఐ రూపంలో చెల్లించాల్సిన మొత్తం, మీ నికర టేక్-హోమ్ ఆదాయంలో 40 నుంచి 50 శాతానికి మించకూడదు. వడ్డీ రేట్లలో పెరుగుదల, ఈఎంఐ మొత్తాలలో పెరుగుదల లేదా కొన్ని సంవత్సరాల పాటు హోమ్ లోన్ పొడిగింపు కోసం ప్రత్యేకంగా ఖాతాలను ఓపెన్ చేసుకోవడం ఉత్తమం. హోమ్ లోన్‌లను త్వరగా చెల్లించడానికి బోనస్ లేదా జీతం పెంపు వంటి మిగులు డబ్బును ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణాలు బాధ్యతతో కూడుకున్నవి. వీటిని చాలా కాలం పాటు చెల్లించవలసి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా మంది ఇంటిని అమ్ముతుంటారు. కాబట్టి, అటువంటి పరిస్థితిని నివారించడానికి అన్ని అంశాలు కవర్‌ అయ్యేటట్లు తగిన టర్మ్ జీవిత బీమాను కొనుగోలు చేయడం ఉత్తమం.

Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, House, House loan, Interest rates

ఉత్తమ కథలు