హోమ్ /వార్తలు /బిజినెస్ /

PF for Home Loan: ఇంటి కొనుగోలుకు, నిర్మాణానికి పీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకోవచ్చా..? అలా చేస్తే లాభమా.. నష్టమా..

PF for Home Loan: ఇంటి కొనుగోలుకు, నిర్మాణానికి పీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకోవచ్చా..? అలా చేస్తే లాభమా.. నష్టమా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కలగంటారు. ఈ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు కొనుగోలుదారుల వద్ద పెద్ద మొత్తంలో నిధులు తప్పకుండా ఉండాలి. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకున్నా.. అది దీర్ఘకాలంతో ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా పలు అంశాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఉద్యోగులకు వారి భవిష్య నిధి(EPF) ఖాతా నుంచి నిధులు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. దీని వల్ల లాభమా.. నష్టమా తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కలగంటారు. ఈ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు కొనుగోలుదారుల వద్ద పెద్ద మొత్తంలో నిధులు తప్పకుండా ఉండాలి. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకున్నా.. అది దీర్ఘకాలంతో ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా పలు అంశాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఉద్యోగులకు వారి భవిష్య నిధి(EPF) ఖాతా నుంచి నిధులు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. ఇల్లు కొనుగోలు చేయడం లేదా ఇంటిని నిర్మించుకోవడానికి, లోన్ పై డౌన్ పేమెంట్ చెల్లించడానికి ప్రావిడెండ్ ఫండ్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు కొన్ని విషయాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం-1952(EPF Scheme) ప్రకారం ఎవరైనా ఉద్యోగి నిర్దేశిత షరతులకు లోబడి ఇల్లు కొనుగోలు లేదా గృహ నిర్మాణం కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణం కోసం ప్లాట్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటే.. ఉద్యోగి 24 నెలల బేసిక్ జీతం, డీయర్ నెస్ అలవెన్స్(DA) సరిపడిన మొత్తానికి విత్ డ్రా పరిమితి ఉంటుంది. ఇల్లు మారడానికి లేదా నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లయితే పైన పేర్కొన్న 24 నెలల పరిమితి 36 నెలలతో రీప్లేస్ అవుతుంది. అయితే ఏ సందర్భంలోనైనా ఈపీఎఫ్ ఖాతా నుంచి విత్ డ్రా.. 90 శాతానికి పరిమితమవుతుంది. అంతేకాకుండా కనీసం 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశముంటుంది. ఇంటి ప్రాపర్టీ.. ఉద్యోగి లేదా అతని జీవిత భాగస్వామి పేరు మీద ఉండాలి. ఇలాంటి సమయంలో విత్ డ్రాలను వాయిదాల రూపంలో చేయవచ్చు.

సహకార సంఘం సభ్యుడి ద్వారా ఇంటి నిర్మాణం..

ఈపీఎఫ్ పథకంలోని సెక్షన్ 68బీసీ ప్రకారం కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడు లేదా రిజిస్టర్డ్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు కూడా ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం భవిష్య నిధి ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసే ప్లాట్‌కు కూడా ఈ విత్ డ్రా అనుమతి ఉంటుంది. అయితే ఈ విత్ డ్రా మొత్తం బ్యాలెన్స్ లేదా ప్రాపర్టీ వాస్తవిక ధరలో 90 శాతానికి పరిమితమై ఉంటుంది. ఉద్యోగులు కనీసం 5 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి.

హౌస్ లోన్ రీపేమెంట్..

ఈపీఎఫ్ పథకంలోని సెక్షన్ 68-బీబీ ప్రకారం హౌస్ లోన్ రీపేమెంట్‌కు కూడా భవిష్య నిధి ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి లేదా వారి జీవిత భాగస్వామికి ఈ అవకాశముంటుంది. ఈ విధంగా ఓ ఉద్యోగి ఏదైనా ఇంటి కోసం రుణం పొందినట్లయితే ఆ ఇంటి డౌన్ పేమెంట్ కోసం కూడా పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. అయితే ఆ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ, స్టేట్ హౌసింగ్ బోర్డ్, జాతీయం చేసిన బ్యాంకులు, పబ్లిక్ ఆర్థిక సంస్థలు, మున్సిపల్ కార్పోరేషన్ లేదా దిల్లీ డెవలప్మెంట్ అథారిటీ.. తదితర సంస్థల నుంచి పొంది ఉండాలి. ఉద్యోగి 36 నెలల ప్రాథమిక వేతనంతో పాటు డీఏకి ఈ విత్ డ్రా పరిమితమై ఉంటుంది. ఈ సందర్భంలో ఉద్యోగి కనీసం 10 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి.

పీఎఫ్ విత్ డ్రా వల్ల లాభాలు, నష్టాలు..

డౌన్ పేమెంట్ లేదా హోంలోన్ రీపేమెంట్ నిధుల కోసం పీఎఫ్ విత్ డ్రా చేసుకుంటే కొన్ని ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. స్థిరాస్తుల సముపార్జన లేదా నిర్మాణం ద్వారా పెట్టుబడిదారుడికి దీర్ఘకాలిక భద్రత లభిస్తుంది. అలాగే ఈపీఎఫ్ ద్వారా వచ్చే రాబడులతో పోలిస్తే ప్రాపర్టీ ధరల పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటే ఆస్తిని కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. అయితే ఫ్లిప్ సైడ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఇతర పెట్టుబడి విధానాలతో పోలిస్తే ఈపీఎఫ్ రాబడి ఎక్కువగా ఉంటే.. ఇతర మార్గాల ద్వారా డౌన్ పేమెంట్‌కు నిధులు సమకూర్చుకోవడం ఉత్తమం.

ట్యాక్స్ వర్తిస్తుందా?

ఉద్యోగి 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ నిరంతర సర్వీసు పూర్తి చేసి సొమ్ము మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటే.. అతడికి 1961 ఆదాయపు పన్ను చట్టంలోని 10(12) ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్‌పై వడ్డీకి సంబంధించి ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.2,50,000 దాటితే.. అతనికి ఇతర వనరుల నుంచి ఆదాయం వస్తుందని గణించి పన్ను విధిస్తారు. ఈ పరిమితి రూ.5 లక్షల వరకు ఉంటుంది. అయితే పీఎఫ్ సొమ్ముపై వడ్డీ రేట్లు.. హోంలోన్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇల్లు కొనుగోలు చేసేందుకు పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోవడం అనే ఆప్షన్‌ను ఆఖరి ప్రయత్నంగా పరిగణించడం మంచిది.

First published:

Tags: EPFO, Home loan, PF account

ఉత్తమ కథలు