THE PRICE OF 10 GRAMS OF GOLD ROSE BY MORE THAN RS 900 ON SATURDAY AND SILVER IS MOVING IN THE SAME DIRECTION PRV
Gold price today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధరలు కూడా.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రతీకాత్మక చిత్రం
తాజాగా శనివారం 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.350కి పైగా పెరిగింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
పండుగ సీజన్ (festival season) కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో (gold prices) ఈ రోజు భారీ మార్పులు (big changes) చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు (gold prices) అమాంతం పెరిగాయి. మార్కెట్ డిమాండ్ (market demand), అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు (Ups and downs) కారణం అయింది. ఇక తాజాగా శనివారం 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.350కు పైగా పెరిగింది. ఇక వెండి (silver) కూడా అదే దారిలో పయనిస్తోంది. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350 ఉంది.
ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది. చెన్నై (Chennai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (gold) ధర (price) రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
బంగారం బాటలోనే వెండి (silver) కూడా పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.63,700 ఉండగా, విజయవాడలో రూ. 63,700 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.59,500 ఉండగా, చెన్నైలో రూ.63,700 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.59,500 ఉండగా, కోల్కతాలో రూ.59,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.59,500 ఉండగా, కేరళలో రూ.63,700 ఉంది.
బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.