Mutual funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టారా...మీ డబ్బుపై కోవిడ్-19 ప్రభావం ఎంత..?

కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి డీమెటీరియలైజ్డ్ అకౌంట్‌ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ వాదనకు బలం చేకూరింది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా కాకుండా ఈక్విటీ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఇండియన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

news18-telugu
Updated: December 2, 2020, 3:11 PM IST
Mutual funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టారా...మీ డబ్బుపై కోవిడ్-19 ప్రభావం ఎంత..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా నాలుగు నెలలు నెట్ అవుట్‌ఫ్లోలను ఇచ్చాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు స్టెబిలైజ్ అయ్యాయి. కానీ అవి మార్చిలో కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఈ ధోరణికి ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక ఒత్తిడికి గురైన కొంతమంది ఇన్వెస్టర్లు తమ డబ్బును బయటకు తీసి SIPలను ఆపివేశారు. మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఫలితంగా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లకు ఎంతో సమయం లభించింది. దీంతో పెట్టుబడిదారులు స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి డీమెటీరియలైజ్డ్ అకౌంట్‌ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ వాదనకు బలం చేకూరింది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా కాకుండా ఈక్విటీ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఇండియన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు

ఈ కొత్త ధోరణి గురించి ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ప్రజలు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టారు. ఈ సంవత్సరం మార్చి నుంచి జూన్, జూలై మధ్య పెట్టుబడుల ధోరణి మారింది. నాలుగేళ్లు పెట్టుబడులు పెట్టినా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIP బ్రేస్ ఈవెన్ స్థాయిలోనే ఉంది. ఇది పెట్టుబడిదారులకు నిరాశను మిగిల్చే అంశం. అందువల్ల SIPలలో పెట్టుబడులు పెట్టి, ఆర్థిక క్రమశిక్షణ పాటించినంత మాత్రాన రాబడి వస్తుందని చెప్పలేం. గత మూడు నెలల్లో స్టాక్స్‌లో చేసిన పెట్టుబడులు 30శాతం నుంచి రెట్టింపు అయ్యాయి. అందువల్ల చాలామంది స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చవచ్చా?
చాలామంది పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈక్విటీలతో పోలుస్తుంటారు. ఎఫ్‌డీలు రాబడి హామీని ఇస్తాయి. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో హామీ లభించదు. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రాబడి.. ఎఫ్‌డి రాబడి కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందో లేదో సరిచూసుకొని పెట్టుబడులను ఎంచుకోవాలి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారులు వంద శాతం వడ్డీ హామీ లభించే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవాలి. ఇలాంటి లిక్విడ్‌ ఫండ్లను మెచూరిటీ వరకు కొనసాగించాలి.

రీ బ్రాండ్ చేయవచ్చు
చాలా వరకు మల్టీ-క్యాప్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ గా మారుతున్నాయి. అంతకుముందు ఉండే మల్టీ-క్యాప్ రూలింగ్లో 25 శాతం స్మాల్ క్యాప్, 25 శాతం మిడ్ క్యాప్, 25 శాతం లార్జ్ క్యాప్‌లకు కేటాయించాలి. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్ను ఎంచుకున్న వారు 25 శాతం మిడ్ క్యాప్ ఇండెక్స్, 25 శాతం స్మాల్ క్యాప్ ఇండెక్స్, 25 శాతం లార్జ్ క్యాప్ ఇండెక్స్, 25 శాతం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లను కొనడం మంచిది. కొత్త నిబంధనల ప్రకారం మల్టీ-క్యాప్ ఫండ్లలో కూడా రిస్క్ ఉంటుంది. చాలా వరకు ఫండ్ హౌస్‌లు తమ ఫండ్ మేనేజర్లకు పెట్టుబడుల పరంగా స్వేచ్ఛను కల్పిస్తాయి. మొత్తం క్యాప్ స్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడానికి వాటిని ఫ్లెక్సీ క్యాప్ గా రీబ్రాండ్ చేస్తారు.
Published by: Krishna Adithya
First published: December 2, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading