హోమ్ /వార్తలు /బిజినెస్ /

18 నెలల క్రితం లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుడు దాని విలువ అక్షరాల కోటి రూపాయలు.. 106 రెట్లు పెరిగిన షేర్ ధర

18 నెలల క్రితం లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుడు దాని విలువ అక్షరాల కోటి రూపాయలు.. 106 రెట్లు పెరిగిన షేర్ ధర

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Multibagger Penny Stocks: కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి. సింప్లెక్స్ పేపర్స్ అనే సంస్థ షేర్లు ఈ సంవత్సరంలో భారీ మార్జిన్ తో బెంచ్ మార్కును సృష్టించాయి. మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో సింప్లెక్స్ పేపర్స్ ఒకటి.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ లో మాత్రం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు షేర్ హోల్డర్లకు మంచి రాబడిని అందించాయి. ముఖ్యంగా కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి. సింప్లెక్స్ పేపర్స్ అనే సంస్థ షేర్లు ఈ సంవత్సరంలో భారీ మార్జిన్ తో బెంచ్ మార్కును సృష్టించాయి. మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో సింప్లెక్స్ పేపర్స్ ఒకటి. జులై 2020లో ఈ కంపెనీ ఒక్కో షేరు విలువ రూ.0.54 ఉండగా, ప్రస్తుతం ఇది రూ.57.35లకు పెరిగింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో 106 రెట్ల పెరుగుదలను నమోదు చేసింది.

ఈ కంపెనీ గత ఐదు ట్రేడ్ సెషన్లలో తన వాటాదారులకు 21.50 శాతం రాబడిని అందించింది. మొత్తం 5 సెషన్లలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకింది. గత నెల రోజుల కాలంలో ఒక్కో షేర్ విలువ రూ.22.30 నుంచి రూ.57.35కి పెరిగింది. ఈ వ్యవధిలో దాదాపు 155 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ విలువ రూ.2.87 రేంజ్ నుంచి రూ.57.35 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 1900 శాతం పెరుగుదల నమోదు చేసింది. అదే విధంగా గత సంవత్సరంలో ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ విలువ రూ. 0.84 నుంచి రూ.57.35 పెరిగింది. ఈ కాలంలో దాదాపు 6700 శాతం పెరిగింది.

* మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ అంటే..

నిర్దిష్ట వ్యవధిలో ఏదైనా స్టాక్ రెట్టింపు రాబడిని పొందితే దాన్ని మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ అని పిలుస్తారు. ఉదాహరణకు 5 రూపాయలు పెట్టుబడి పెడితే నిర్దిష్ట కాల వ్యవధిలో దాని విలువ రూ.10కి చేరితే టూ బ్యాగర్ స్టాక్ అని, రూ.15కు చేరితే త్రీ-బ్యాగర్ స్టాక్ అని అంటారు. అదే 100 శాతం, 200 శాతం లాభం వస్తే దాన్ని మల్టీబ్యాగర్ స్టాక్ అని పిలుస్తారు.

* పెట్టుబడిపై ప్రభావం..

సింప్లెక్స్ పేపర్స్ షేర్ హిస్టరీని గమనిస్తే వారం క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ విలువ 1.21 లక్షలకు చేరి ఉండేది. నెల క్రితం ఇన్వెస్ట్ చేసుంటే ఆ రాబడి 2.55 లక్షలకు మారింది. 6 నెలల క్రితం పెట్టుబడి పెట్టినట్లయితే రూ.20 లక్షలు రాబడి వచ్చేది. అదే విధంగా ఓ ఇన్వెస్టర్ ఏడాది క్రితం అల్ఫా స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం 68 లక్షలు వచ్చి ఉండేవి. అలాగే 16 నెలల క్రితం లక్ష ఇన్వెస్ట్ చేసుంటే రూ. 1.06 కోట్లకు చేరి ఉండేది.

* ఈ పీరియడ్‌లో నిఫ్టీ 50 రాబడి ఎలా ఉంది?

భారతదేశంలోని ఆల్ఫా స్టాక్‌లలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఒకటి. ఎందుకంటే ఇది ఈ కాలంలో భారీ మార్జిన్‌తో NSE నిఫ్టీ రాబడిని అధిగమించింది. అదే 18 నెలల వ్యవధిలో నిఫ్టీ 55 శాతం రాబడిని అందించగా, ఈ పెన్నీ స్టాక్ దాని వాటాదారులకు ఏకంగా 10,500 శాతం రాబడిని అందించింది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Stock Market

ఉత్తమ కథలు