THE MINISTRY OF ROAD TRANSPORT AND HIGHWAYS MORTH HAS SQUASHED RUMOURS OF ELECTRIC TWO WHEELER SALES BEING BANNED IN INDIA GH SK
EVs Ban: భారత్‌లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాల నిషేధంపై కేంద్రం కీలక ప్రకటన..
ప్రతీకాత్మక చిత్రం
EV Ban: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న వార్తలపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
EVs Ban: గత కొద్ది నెలలుగా వరుసగా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (Electric Two Wheelers) కాలిపోతూ వాహనదారుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఓలా సహా పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సదరు కంపెనీలు పలు స్కూటర్లు రీకాల్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇండియాలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అమ్మకాలను బ్యాన్ చేసిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways-MoRTH) స్పందించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసినట్లు వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది.
కొత్తగా ఎలాంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ లాంచ్ చేయకూడదని ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారులను భారత ప్రభుత్వం కోరినట్లు కొన్ని ఆన్లైన్ నివేదికలు పేర్కొన్నాయి. ఢిల్లీలో మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొన్ని రిపోర్ట్స్ రాసుకొచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల అగ్ని ప్రమాదాలపై దర్యాప్తు చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి మరింత సమయం కావాలని ప్రభుత్వం చెప్పినట్లుగా ఇవి పేర్కొన్నాయి. అగ్ని ప్రమాదాల పై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ లాంచ్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశించినట్లు కూడా ఇవి ఆరోపించాయి. అయితే ఇవన్నీ అబద్ధమని MoRTH మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది, ఈ వాదనలను నిరాధారమైనవి తప్పుదారి పట్టించేవని, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వస్తున్న పుకార్లను పటాపంచలు చేసింది. ఇది తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో “అగ్ని ప్రమాదం జరిగిన సందర్భాలను పరిశోధించే వరకు కొత్త వాహనాలను లాంచ్ చేయవద్దని MoRTH ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులను కోరినట్లు మీడియాకి చెందిన ఒక విభాగం నివేదించింది. అలాంటి ఆదేశాలు, సూచనలేవీ మంత్రిత్వ శాఖ చేయలేదు. ఇలాంటి నివేదికలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి, సత్యానికి దూరంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేయాలనుకుంటున్నది" అని పేర్కొంది.
ఇటీవల, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలు చాలా చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వాహన తయారీదారుల తప్పు ఉన్నట్లు తేలితే భారీ జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీకాల్‌లను జారీ చేసి, ఈలోగా తమ ఉత్పత్తులను పరిష్కరించుకోవచ్చని మంత్రి సూచించారు. "ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించడం జరుగుతుంది. లోపాలున్న వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశించడం జరుగుతుంది" అని గడ్కరీ చెప్పారు. ఒకినావా, ప్యూర్ఈవీ, ఓలా ఎలక్ట్రిక్ తదితర కంపెనీల బైక్స్ ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో ఈ కంపెనీలు తమ స్కూటర్లను మళ్ళీ చెక్ చేసేందుకు రీకాల్ చేశాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓకినావా ఆటోటెక్ ఈ నెల ప్రారంభంలో 3,215 వాహనాలను, హైదరాబాద్‌కు చెందిన పవర్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ (PURE) EV మరో 2,000 వాహనాలను రీకాల్ చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.