ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd (RIL) తాజాగా మరో ఘనత సాధించింది. భారతదేశంలో అత్యంత మార్కెట్ విలువ కలిగి ఉన్న ఈ సంస్థ బుధవారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalization)లో మొదటిసారిగా రూ.19 ట్రిలియన్ల(Trillions) (రూ.19 లక్షల కోట్ల) మార్క్‌ను దాటింది. అలానే ఆ స్థాయిలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించిన తొలి ఇండియన్ కంపెనీగా నిలిచింది. నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇంట్రాడేలో 1.7 శాతం పెరిగి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ.2,827.10 రికార్డును తాకింది. ఈ ప్రైస్ ఆల్ టైమ్ హైయ్యెస్ట్ కావడం విశేషం. ఏప్రిల్ 27 ఉదయం 10.24 గంటలకు, ఆర్ఐఎల్ (RIL) బీఎస్ఈలో రూ.2,817 వద్ద ట్రేడ్ అయింది.
ఇది మునుపటి ముగింపు (Previous Close)తో పోలిస్తే 1.5 శాతం పెరిగింది. గత ఏడు సెషన్లలో ఈ కంపెనీ షేర్లు 11 శాతం ర్యాలీ చేయడం లేదా పెరగడం విశేషం. టెక్నికల్ అనాలసిస్ ప్రకారం, షేరు ధర రూ.3000 మార్కు వైపు వెళ్లే అవకాశం ఉంది. రూ.2,500 వద్ద ఇమీడియట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఈ కంపెనీ స్టాక్ ఎనిమిది శాతం లాభపడగా, ఈ ఏడాది మొత్తంలో అది 19 శాతం పెరిగింది. మార్చి నుంచి ఇది ఏకంగా 25 శాతం లాభపడింది. ఐరోపా మార్కెట్లలో టైట్ నెస్ (Market Tightness) కారణంగా ఇటీవలి వారాల్లో సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు (GRMs) ర్యాలీ చేశాయి. ఇలా ఇవి పెరిగిన తర్వాత పెట్టుబడిదారులు రిలయన్స్ స్టాక్‌ను కొనుగోలు చేయడం కొనసాగించారు. సింపుల్‌గా చెప్పాలంటే సింగపూర్ GRM రికార్డు స్థాయిలో పెరగడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ ర్యాలీ జరిగింది. దీనితో ఇది రూ.19 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కు చేరుకుంది. సింగపూర్ GRMలో ఒక యూఎస్ డాలర్ పెరిగిన ప్రతిసారి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం దాదాపు రూ.4 పెరిగింది.
రిలయన్స్ వంటి పెద్ద పెట్రోకెమికల్ కంపెనీలకు GRM మార్జిన్ బెనిఫిట్‌ను అందిస్తుంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల జీఆర్ఏం పెరుగుతుంది. రిఫైనింగ్ మార్జిన్‌లు కొత్త శిఖరాలను తాకడం, ఎలివేటెడ్ లెవెల్స్‌లో సపోర్ట్ లభించే అవకాశం ఉండటంతో... ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఆదాయాల అప్‌గ్రేడ్‌లు, ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో స్పిల్-ఓవర్ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
"రిఫైనర్‌ల రియలైజడ్ మార్జిన్‌లు ఇంకా పెరిగే సూచనలు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. అధిక డీజిల్ దిగుబడి, అధిక సంక్లిష్టత (High Complexity), అధిక ఎగుమతి నిష్పత్తి కారణంగా, ప్రస్తుత వాతావరణంలో ఆర్ఐఎల్ (RIL) ఇప్పటికీ గణనీయమైన నికర లబ్ధిదారుగా ఉండే అవకాశముంది. మూడు భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీల (OMC-oil marketing companies) మెరుగైన రిఫైనింగ్ చేసినా రిటైల్ పాస్-త్రూ ఆలస్యం వల్ల ఏర్పడే వీకర్ మార్కెటింగ్‌కు అవి అంత లాభపడకపోవచ్చు. డొమెస్టిక్ కోణంలో చూస్తే ఇది ఆర్ఐఎల్ షేరు ధర పెరుగుదలకు కలిసొస్తుంది" అని సిటీ గ్రూప్ పేర్కొంది.
Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే
పెట్రోకెమ్ (Petrochem) బలహీనత కారణంగా రానున్న నాలుగో త్రైమాసిక ఫలితాలు O2Cలో పెద్దగా ప్రయోజనాలను చూడకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయినా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2023 మొదటి త్రైమాసికం నుంచి ఆదాయాలు ప్రస్తుతం ఉన్న రిఫైనింగ్ మార్జిన్ స్ట్రెంత్ ప్రయోజనాన్ని పొందడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఏదైనా స్టాక్ కరెక్షన్ మెరుగైన కొనుగోలు అవకాశాన్ని అందించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Market, Market values, Reliance, Reliance Industries, Reliance Trends