అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...

Gennaro Pelliccia : ప్రపంచంలోని వింత మనుషుల్లో అతనూ ఒకడని అనుకోవాలేమో.

Krishna Kumar N | news18-telugu
Updated: July 18, 2020, 2:51 PM IST
అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...
జెన్నారో పెల్లీక్కియా (Image : Twitter)
  • Share this:
కొంతమంది సెలబ్రిటీలు తమ బాడీ పార్ట్స్‌కి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు కదా. జెన్నారో పెల్లీక్కియా కూడా తన నాలికకు 2009లో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. అతని నాలిక విలువను రూ.92 కోట్లుగా డిసైడ్ చేసింది అతను పనిచేస్తున్న కంపెనీ. అంత రేటు ఎందుకూ... అంటే... అతను తన నాలికతో ప్రపంచంలోని బెస్ట్ కాఫీ బ్రాండ్లలో ఒకటైన కోస్టా కాఫీని టేస్ట్ చూస్తూ ఉంటాడు. బెస్ట్ కాఫీ ఎలా తయారుచెయ్యాలో, ప్రతీ కప్పూ ఒకే రకమైన టేస్ట్ ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అతను మాత్రమే ఆ పనిని పర్ఫెక్టుగా చెయ్యగలుగుతుండటం విశేషం.

లండన్‌లోని లాంబెర్త్ రోస్టరీలో పనిచేస్తున్నాడు జెన్నారో. అక్కడకు ప్రపంచంలోని హైక్లాస్ సెలబ్రిటీలు వస్తుంటారు. వాళ్లకు కోస్టా కాఫీని వంద శాతం పర్ఫెక్టుగా తయారుచేసి ఇవ్వడం జెన్నారో పని. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా రోస్టరీకి చెడ్డపేరు వస్తుంది. అందుకే జెన్నారో తన నాలికను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అది రోస్టరీకి అత్యంత ముఖ్యమైనది కావడంతో దాని కోసం ప్రత్యేకంగా 10 లక్షల పౌండ్లను ఇన్సూరెన్స్ ప్రీమియంగా చెల్లించింది రోస్టరీ.

ప్రపంచంలో మనుషుల బాడీ పార్ట్‌లకు ఇన్సూరెన్స్ కల్పించే ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ లండన్‌ లోని లాయిడ్. కోస్టా సోదరులు... 1971లో మోచా ఇటాలియా కాఫీ బ్లెండ్ తయారుచేశారు. దాన్ని బ్రిటన్‌లోని బ్రాండ్ కోస్టా కాఫీ షాప్‌లో అమ్మారు. ప్రస్తుతం ఆ కాఫీ పొడి జెన్నారో దగ్గరకు వస్తుంది. అతని టీం కాఫీలను తయారుచేస్తుంది. ప్రతీ కాఫీనీ సెలబ్రిటీలకు ఇచ్చే ముందు... జెన్నారో టేస్ట్ చూస్తాడు. టేస్ట్ ఏమాత్రం తేడా వచ్చినా... వెనక్కి పంపించేస్తాడు. రాజీ పడడు.



జెన్నారో తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అరబ్ దేశాలు, థాయ్‌ల్యాండ్, సింగపూర్, చైనాల్లో తన టాలెంట్‌పై ప్రదర్శనలు ఇచ్చాడు. చాలా దేశాల్లో కాఫీ తయారీదారులకు క్లాసులు చెప్పాడు. ఎందుకంటే ప్రపంచంలో ఏయే దేశాల్లో ఏయే కాఫీ గింజలు పండుతాయో అతనికి తెలుసు. ఏయే గింజల్ని రోస్ట్ చేస్తే, తయారయ్యే కాఫీ ఎలా ఉంటుందో అతనికి తెలుసు.

టాలెంట్ ఎలా వచ్చిందంటే : ఇటలీలోని నేపుల్స్‌లో పుట్టాడు జెన్నారో. అక్కడ పిల్లలకు పాలు మాత్రమే ఇస్తారు. కానీ జెన్నారో తల్లి... పాలలో కాస్త కాఫీ కూడా కలిపి ఇచ్చేది. అలా చిన్నప్పటి నుంచే కాఫీకి అలవాటు పడ్డాడు. చదువుకునే రోజుల్లో డబ్బు కోసం బరిస్టా కాఫీ షాప్‌లో చేరాడు.


కోస్టా సోదరుల ఫ్యామిలీతో జెన్నారో ఫ్యామిలీకి సంబంధాలు ఉండటంతో... మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక... కోస్టా కాఫీ కంపెనీలో చేరిపోయాడు. 18 ఏళ్లు గడిచాక... ఆ జాబ్ వదిలేసి... రోస్టరీలో చేరాడు. మొత్తంగా 25 ఏళ్లుగా కాఫీ టేస్ట్ చూస్తూనే ఉన్నాడు.

బ్రిటన్‌లో కోస్టా కాఫీ బ్రాండ్‌కి వెయ్యి షాపులున్నాయి. 30 దేశాల్లో మరో వెయ్యి షాపులున్నాయి. అంతలా ప్రపంచ గుర్తింపు పొందింది ఈ బ్రాండ్. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే, కోస్టా కాఫీని మీరూ టేస్ట్ చూడండి మరి.
Published by: Krishna Kumar N
First published: July 18, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading