హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Alert: ఎల్​ఐసీ పాలసీదారులకు అలర్ట్​.. ల్యాప్స్​ అయిన పాలసీలు పునరుద్దరించుకునేందుకు మరో అవకాశం.. తుది గడువు ఎప్పుడంటే..?

LIC Alert: ఎల్​ఐసీ పాలసీదారులకు అలర్ట్​.. ల్యాప్స్​ అయిన పాలసీలు పునరుద్దరించుకునేందుకు మరో అవకాశం.. తుది గడువు ఎప్పుడంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పాలసీదారులకు ఎల్‌ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు చౌకగా పాలసీలను పునరుద్ధరించడానికి గడువు ఇచ్చింది

పాలసీదారులకు ఎల్‌ఐసీ (Life Insurance corporation) గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే (renew lapsed policies) అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు చౌకగా పాలసీలను (Polices) పునరుద్ధరించడానికి ఫిబ్రవరి 7 నుంచే స్పెషల్ క్యాంపెయిన్ (Special Campaign) ప్రారంభించింది. ఈ నెల 25తో ఈగడువు ముగుస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది. అనివార్య ప‌రిస్థితుల్లో ప్రీమియం చెల్లించ‌లేక‌పోయిన వారికి (Policy holders) ప్రయోజనం క‌ల్పించేందుకు ఈ పున‌రుద్ధరణ సౌక‌ర్యం అందుబాటులోకి తెచ్చింది. కరోనా వంటి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిరంతర రిస్క్ కవర్‌ను అందించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం రెండోసారి అవకాశాన్ని కల్పిస్తున్నామని ఎల్​ఐసీ ప్రకటించింది. ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయిన తేదీ నుంచి ఐదేళ్లలోపు కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి ఈ అవ‌కాశం క‌ల్పిస్తుంది.అర్హత ఉన్న ప్లాన్ల పాల‌సీల‌కు లేట్ ఫీజు (Late fee)తో ప్రీమియం చెల్లించడానికి ప్రత్యేక పునరుద్ధరణ క్యాంపెయిన్‌తో చోటు క‌ల్పించింది. అయితే ట‌ర్మ్ అస్సూరెన్స్ అండ్ మ‌ల్టీపుల్ రిస్క్ పాల‌సీల‌కు మాత్రం ఈ మినహాయింపులు వ‌ర్తించ‌వని ఎల్ఐసీ స్పష్టం చేసింది.

పాల‌సీదారుల‌ (Policy holders) రక్షణ కోసం ఈ వెసులుబాటు కొన‌సాగించాల‌ని ఎల్ఐసీ తాజా నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత క‌రోనా విపత్కర ప‌రిస్థితుల్లో పాల‌సీదారులు మ‌ర‌ణిస్తే, వారికి వారి కుటుంబాల‌కు రక్షణ క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎల్‌ఐసీ అభిప్రాయప‌డింది. కుటుంబాల‌కు ఆర్థిక భ‌ద్రత క‌ల్పించ‌డానికి లైఫ్ క‌వ‌రేజీ కొన‌సాగించ‌డానికి పాల‌సీదారులు (Policy holders) ల్యాప్స్ అయిన పాల‌సీలు పునరుద్ధరించుకోవచ్చు.

ఆలస్య రుసుములో 20 శాతం రాయితీ..

ఒకవేళ మీరు ల్యాప్స్ అయిన పాలసీకి (laps policy) రూ.లక్ష వరకు ప్రీమియం చెల్లించినట్లైతే ఆలస్య రుసుములో 20 శాతం వరకు రాయితీ ప్రకటించింది ఎల్ఐసీ. అయితే, రాయితీ గరిష్ఠ పరిమితి రూ.2000 మాత్రమే. అదే విధంగా, ఒకవేళ మీరు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ప్రీమియం (Premium) చెల్లించినట్లైతే ఆలస్య రుసుములో 25 శాతం వరకు రాయితీని పొందొచ్చు. దీని గరిష్ఠ పరిమితి రూ.2500. ఒకవేళ మీరు రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించినట్లైతే, ఆలస్య రుసుములో 30 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. దీని గరిష్ఠ రాయితీ పరిమితిని రూ. 3000గా నిర్ణయించింది ఎల్ఐసీ. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌ల పునరుద్ధరణకు ఆలస్య రుసుములో 100 శాతం రాయితీని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ అవకాశం మార్చి 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది.

దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. ప్రధానంగా పిల్లలు, సీనియర్ సిటిజన్స్, మహిళలు ఇలా అందరికీ అనుగుణమైన పాలసీలను తీసుకొస్తుంటుంది. ఇందులో మీకు నచ్చిన పాలసీ తీసుకోవచ్చు. మీరు తీసుకునే పాలసీ ఆధారంగా మీకు లభించే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.

ఎల్‌ఐసీ పాలసీ తీసుకొని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రీమియం చెల్లించలేకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి ఎల్‌ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను మళ్లీ రెగ్యులర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

First published:

Tags: LIC, Life Insurance, New policy

ఉత్తమ కథలు