Home /News /business /

THE IMPACT OF INFLATION ON THOSE WHO WANT TO BUY A NEW HOME HERE ARE THE WAYS TO GET OUT OF IT GH VB

Inflation: కొత్త ఇల్లు కొనాలనుకునే వారిపై ద్రవ్యోల్బణం ప్రభావం.. దీని నుంచి బయటపడే మార్గాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధిక ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2018 తర్వాత మొదటిసారి వడ్డీ రేట్లను పెంచింది. 2022 నాటికి మరిన్ని రేట్ల పెంపుదల ఉండవచ్చు. ప్రతి పెంపుతో రుణ రేట్లు కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసిన వారిపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఇంకా చదవండి ...
ద్రవ్యోల్బణం(Inflation) కారణంగా హోమ్ లోన్ వడ్డీ(Home Loan Interest) పెరిగిందనే వార్తలు ఇంటి యజమానులు తెలుసుకునే ఉంటారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 2018 తర్వాత మొదటిసారి వడ్డీ రేట్లను పెంచింది. 2022 నాటికి మరిన్ని రేట్ల పెంపుదల ఉండవచ్చు. ప్రతి పెంపుతో రుణ రేట్లు కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితి కొత్తగా ఇల్లు(House) కొనుగోలు చేసిన వారిపై నెగిటివ్ ఎఫెక్ట్(Negative Effect) చూపిస్తుంది. ఇటీవల సంవత్సరాలలో వడ్డీ రేట్లు(Interest Rates) తక్కువగా ఉన్న సమయాల్లో రుణాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందారు. రుణ చెల్లింపులను ఒక నిర్దిష్ట మార్గంలో ప్లాన్(Plan) చేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు పదవీ విరమణ కోసం పొదుపు వంటి వారి ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయి.

* కొత్తగా రుణాలు, గతంలో రుణాలు తీసుకొన్నవారిపై ప్రభావం ఏంటి?
వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు రుణాలు తీసుకున్న వారికి ప్రస్తుత పరిస్థితి మరింత కఠినంగా ఉంటుంది. వారి రుణ కాలపరిమితి పెరగనుంది. రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉంటే, లోన్ రీపేమెంట్ పీరియడ్‌ నెలల సంఖ్య పెరుగుతుంది.

* ఇప్పుడు ఏం జరుగుతుంది?
రేట్లు పెరిగితే అదనపు ఖర్చులు పెరుగుతాయి. వచ్చే రెండేళ్లలో 200 బేసిస్ పాయింట్ల మేరకు రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు మారినప్పుడు, గృహ రుణాలకు సంబంధించిన రీపేమెంట్ టెన్యూర్ మారుతుంది. ఏదో ఒక సమయంలో EMI కూడా పెరగవలసి ఉంటుంది. రుణదాత తిరిగి చెల్లించే సమయాన్ని ఎప్పటికీ పెంచుతూ ఉండరు. రుణ విమోచన షెడ్యూల్ రుణదాత నిర్ణయించిన వయో పరిమితి వరకు మాత్రమే సాగుతుంది.

Explained: శ్రీలంకలో కొనసాగుతున్న ప్రజల నిరసనలు.. లంక ఆర్థికంగా పతనం కావడానికి కారణాలు ఏంటి?


* హోమ్ లోన్‌ను క్రమపద్ధతిలో ముందస్తుగా చెల్లించాలి
100 బేసిస్ పాయింట్ల లోపల రేట్ల పెంపుదల ఉంటే కొత్త రుణగ్రహీతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోన్ నుంచి త్వరగా బయటపడేందుకు వారికి సరళమైన విధానం ఉంది. దీన్ని 5 శాతం తగ్గించే బ్యాలెన్స్ పద్ధతిగా నిపుణులు చెబుతారు. స్థిరమైన సగటు వడ్డీ రేటును ఊహిస్తే, ప్రతి రుణ సంవత్సరానికి ఒకసారి లోన్ బ్యాలెన్స్‌లో 5 శాతం ముందస్తుగా చెల్లించడం ద్వారా దాదాపు 12 సంవత్సరాలలో 20 సంవత్సరాల రుణాన్ని చెల్లించవచ్చు. కేవలం 5 శాతాన్ని ముందస్తుగా చెల్లించడం వల్ల పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది.

* అదనపు EMIలు చెల్లించండి
ముందస్తుగా ఈఎంఐలు చెల్లించడం కూడా మంచి మార్గం. సాధారణ EMI కంటే ఎక్కువ చెల్లించే EMI ముందస్తు చెల్లింపుగా పనిచేస్తుంది. ఉదాహరణకు EMI రూ.25,000 ఉంటే రూ. 35,000 చెల్లించాలని నిర్ణయించుకుంటారు, అదనపు రూ.10,000 ప్రిన్సిపల్‌ అమౌంట్‌లో సర్దుబాటు అవుతుంది. ఇది ప్రతి నెలా లోన్ చెల్లింపును వేగవంతం చేస్తుంది. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఇలా తిరిగి చెల్లించే మొత్తాన్ని పెంచుకోవచ్చు.

* రీఫైనాన్సింగ్ పని చేస్తుందా?
అర్హత పొందగల మార్కెట్ రేట్ల కంటే గణనీయంగా ఎక్కువ రేటును చెల్లిస్తున్నట్లయితే, రీఫైనాన్స్ చేయడానికి సమయం. ఇలా చేయమని సొంత రుణదాతను అడగవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. రుణదాత ఆకర్షణీయమైన ఒప్పందాన్ని అందించకపోతే, బ్యాలెన్స్ బదిలీని పరిగణించండి. ఇది అధిక ఖర్చులు, పేపర్‌ వర్క్‌ని కలిగి ఉంటుంది. ప్రస్తుత ధర కంటే 50 బేసిస్ పాయింట్ల కంటే తక్కువ రేటును పొందినట్లయితే, రీఫైనాన్సింగ్‌ విలువైనదే కావచ్చు. లోన్ సగానికి పైగా మిగిలిపోయినప్పుడు ఇది చాలా అర్థవంతమైన పని అవుతుంది.

* సర్జికల్ స్ట్రైక్: వ్యూహాత్మక ముందస్తు చెల్లింపులు
ద్రవ్యోల్బణం పైకి పెరిగితే, క్రమబద్ధమైన ముందస్తు చెల్లింపు పద్ధతి పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రుణాన్ని నెమ్మదిగా తగ్గించడంలో సహాయపడే పద్ధతులే కాకుండా, వడ్డీని పెంచకుండా ఉంచడానికి సర్జికల్ స్ట్రైక్ పద్ధతి పాటించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Car loans, EMI, Inflation, Repayment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు