హోమ్ /వార్తలు /బిజినెస్ /

Homebuyers: ప్రధాన నగరాల్లో 2BHK, 3BHKలకు డిమాండ్‌.. కొనుగోలుదారులు ఎక్కువగా సెర్చ్‌ చేసింది వీటి కోసమే..

Homebuyers: ప్రధాన నగరాల్లో 2BHK, 3BHKలకు డిమాండ్‌.. కొనుగోలుదారులు ఎక్కువగా సెర్చ్‌ చేసింది వీటి కోసమే..

Homebuyers: ప్రధాన నగరాల్లో 2BHK, 3BHKలకు డిమాండ్‌.. కొనుగోలుదారులు ఎక్కువగా సెర్చ్‌ చేసింది వీటి కోసమే..

Homebuyers: ప్రధాన నగరాల్లో 2BHK, 3BHKలకు డిమాండ్‌.. కొనుగోలుదారులు ఎక్కువగా సెర్చ్‌ చేసింది వీటి కోసమే..

Homebuyers: ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి బాటలో ప్రయాణిస్తోంది. ప్రజలు తమ అవసరాలకు తగ్గట్టు వివిధ రకాల ప్రాపర్టీల గురించి ఆరా తీస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియాలో రియల్ ఎస్టేట్ (Realestate) రంగం వృద్ధి బాటలో ప్రయాణిస్తోంది. ప్రజలు తమ అవసరాలకు తగ్గట్టు వివిధ రకాల ప్రాపర్టీల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో మిడ్‌ రేంజ్‌, ప్రీమియం ఇళ్ల (Homes)కు డిమాండ్‌ కనిపిస్తోందని తాజాగా వెల్లడైంది. ఎక్కువ మంది మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్లో ఇళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారని స్క్వేర్ యార్డ్స్ అనే రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. గతేడాది మార్కెట్‌ వాటాలతో పోలిస్తే ఈ ఏడాది గృహ నిర్మాణం రంగం వేగవంతమైన అభివృద్దిని కనబరచింది. అయితే ప్రస్తుతం కొంత కాలంపాటు రుణాల వడ్డీల ప్రభావం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

గృహనిర్మాణ రంగం అభివృద్ధి 2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఊపందుకుంది. ఆ ఏడాది మొదటి త్రైమాసికం డిమాండ్‌ను కూడా అధిగమించింది. స్క్వేర్ యార్డ్స్ నివేదిక ప్రకారం.. కొత్త రెసిడెన్షియల్ లాంచ్‌లు 2022 రెండో త్రైమాసికంలో ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 170 శాతం పెరిగాయి.

ఇండియాలోని మొదటి ఆరు నగరాల్లో దాదాపు 79,000 కొత్త హౌసింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌, పూణే, గురుగ్రామ్‌లలో 2021 రెండో త్రైమాసికంతో పోలిస్తే 2022లో అదే సమయానికి కొత్త లాంచ్‌లు 250 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా కొత్త లాంచ్‌లు 80 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

* మిడ్-సెగ్మెంట్ గృహాలకు డిమాండ్

2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆన్‌లైన్లో 38 శాతం మంది ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో గృహాల కోసం సెర్చ్‌ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ 22 శాతంతో ఉంది. 2022 రెండో త్రైమాసికంలో రూ.30- రూ.60 లక్షలు, రూ.60-రూ.100 లక్షల బడ్జెట్‌లోని ప్రాపర్టీల కోసం గృహ కొనుగోలుదారులు ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు నివేదిక తెలిపింది.

* ప్రాపర్టీ రేట్లు, రుణాల వడ్డీల ప్రభావం

ప్రాపర్టీ ధరలు పెరగడం, రుణ రేట్ల పెంపు కారణంగా, హౌసింగ్ యూనిట్ల కొత్త లాంచ్‌లు 2022 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రెండు శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌, గురుగ్రామ్‌లో మాత్రమే క్వార్టర్-ఆన్-క్వార్టర్‌లో వరుసగా 16 శాతం, 12 శాతం పెరుగుదల కనిపించింది. అయితే ఇతర ప్రధాన నగరాల్లో కొత్త లాంచ్‌లు ఆ స్థాయిలో జరగలేదని నివేదిక తెలిపింది.

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో కొత్త ప్రాజెక్టులు అత్యధికంగా 38 శాతం పెరిగాయి. ఆ తర్వాత పూణె 21 శాతం, బెంగళూరు 14 శాతం, హైదరాబాద్ 20 శాతం వాటాను నమోదు చేశాయి.

ఇది కూడా చదవండి : 3 నెలల్లోనే డబ్బు రెట్టింపు.. వీళ్ల లక్ మామూలుగా లేదు!

* బెంగళూరులో 3BHKలకు డిమాండ్

2022 రెండో త్రైమాసికంలో బెంగళూరు, గురుగ్రామ్‌లలో 43 శాతం కంటే ఎక్కువ 3BHK ఇల్లు అమ్ముడుపోయాయి. ప్రధాన ఆరు నగరాల్లో సెర్చ్‌ చేసిన ప్రాపర్టీస్‌లో ప్లాట్లు 24 శాతం ఉన్నాయి. గురుగ్రామ్, నోయిడా, పూణే వంటి నగరాలు ప్లాట్ల కోసం ఎక్కువగా సెర్చ్‌ చేశారు. మొత్తానికి 2022 రెండో త్రైమాసికంలో మిడ్-సెగ్మెంట్ ప్రాపర్టీలకు డిమాండ్‌ పెరిగింది. ఈ కేటగిరీలోని ఇళ్లకు డిమాండ్ 57 శాతం పెరిగింది. అయితే రూ.1కోటి కంటే ఎక్కువ విలువైన ప్రీమియం కేటగిరీ రెసిడెన్షియల్ యూనిట్ల వాటా కూడా మొదటి త్రైమాసికంతో పోలిస్తే 10శాతానికి పైగా పెరిగింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: House, India, Personal Finance, Real estate

ఉత్తమ కథలు