భారతీయులకు (Indians) బంగారంపై (Gold) ఉన్న మోజు అంతా ఇంతా కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొందరు ఏటా ఎంతో కొంత డబ్బు జమ చేసి బంగారు ఆభరణాలు (Jewelry) కొనుగోలు చేస్తుంటారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో బంగారం అమ్మాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తరుగు పేరుతో కోతలు కూడా వేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds) ద్వారా ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంగారు ఆభరణాల మాదిరిగా సావరిన్ గోల్డ్ బాండ్లను పెళ్లిళ్లలో బహుమతిగా ఇవ్వవచ్చు. పిల్లల పెళ్లిళ్ల కోసం ఈ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అవసరమైనప్పుడు దాన్ని ఫిజికల్ గోల్డ్‌గా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. పైగా బంగారం ఆభరణాల మాదిరి మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
సావరిన్ గోల్డ్ బాండ్స్ మెచూర్ అయ్యేవరకు ఉంటే మూలధన లాభాలపై పన్నులు ఉండవు. వీటిని ఐదేళ్ల లాకిన్ పీరియడ్, ఎనిదేళ్ల మెచూరిటీతో ప్రారంభించారు. మెచూరిటీ పీరియడ్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటే, లాక్ ఇన్ పీరియడ్ లేకుండా సెకండరీ మార్కెట్ నుంచి కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు.
Sovereign Gold Bonds: 8వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభం.. ధర, డిస్కౌంట్ వివరాలివే..
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం సావరిన్ గోల్డ్ బాండ్స్ విడుదల చేస్తోంది. ఇందులో పెట్టుబడులపై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సావరిన్ గోల్డ్ బాండ్స్ 8వ సిరీస్ సబ్‌స్క్రిప్షన్‌లు తాజాగా ప్రారంభమయ్యాయి. డిజిటల్ మార్గంలో కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపుతో ఇష్యూ ధరను గ్రాముకు రూ.4,791గా నిర్ణయించారు. ఒక గ్రాము బంగారం ఒక యూనిట్ గోల్డ్ బాండుతో సమానం. గత శుక్రవారం అహ్మదాబాద్ మార్కెట్లో గ్రాము బంగారం ధర రూ.4,972 పలికింది. ఈ ధర ఆధారంగా సావరిన్ గోల్డ్ బాండ్ ధరను నిర్ణయించారు.
* సెకండరీ మార్కెట్లో గోల్డ్ బాండ్స్
సావరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (Bombay Stock Exchange) ల్లో క్యాష్ విభాగంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. వీటితో అనేక ప్రయోజనాలు ఉంటాయి.
CoinDCX : IPO కోసం సిద్ధమవుతున్న తొలి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ సంస్థ...ఇదే జరిగితే అద్భుతమే..?
* లిక్విడిటీ ఫ్యాక్టర్
సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం వల్ల, ఎప్పుడు నగదు అవసరమైనా బాండ్లను లిక్విడిటీలోకి అంటే నగదుగా మార్చుకోవచ్చు.
* వడ్డీ వివరాలు
సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds)సంవత్సరానికి రెండు సార్లు కొనుగోలు చేసినా ఆ పెట్టుబడులపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేసిన ధరపై కాకుండా నిర్ధిష్ఠ ఇష్యూ ధరపై వడ్డీ చెల్లిస్తారు. సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు తక్కువ ట్రేడింగ్ ధరకు వెళ్లవద్దు. ఇష్యూ ధరను పరిశీలించి కొనుగోలు ధర, ఇష్యూ ధర కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సెకండరీ మార్కెట్లో లిక్విడ్ సిరీస్ ప్రమాణాలు ఉన్న గోల్డ్ బాండ్స్ ఎంచుకోవడం ద్వారా అవసరమైనప్పుడు నగదుగా మార్చుకోవచ్చు.
Earn money: జస్ట్ 15 వేల పెట్టుబడితో, 3 నెలల్లో రూ.3 లక్షల సంపాదన కావాలా..ఇలా చేయండి..
* పన్ను రాయితీలు
సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసినా పన్ను ప్రయోజనాలు అందిస్తున్నారు. మెచూరిటీ తరువాత.. అంటే ఎనిమిదేళ్ల అనంతరం విక్రయిస్తే మూలధన లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మెచూరిటీ తరువాత సావరిన్ గోల్డ్ బాండ్స్ రిడీమ్ చేసుకుంటే మూలధన లాభాలపై ఎలాంటి పన్ను లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.
సెకండరీ మార్కెట్లో ఒక యూనిట్ సిరీస్ కొనుగోలు చేస్తే అది రెండేళ్ల తరువాత మెచూర్ అవుతుంది. వాటి మూలధన లాభాలపై ఎలాంటి పన్ను లేదు. భౌతికంగా బంగారం తీసుకుంటే మాత్రం స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుల్లో కేవలం 20 శాతం విధిస్తారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.