హోమ్ /వార్తలు /బిజినెస్ /

Flight Tickets: దీపావళి టైంలో ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్.. బాదుడే బాదుడు!

Flight Tickets: దీపావళి టైంలో ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్.. బాదుడే బాదుడు!

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Flight Tickets: దీపావళి సందర్భంగా వీకెండ్ జర్నీ ప్లాన్ చేసుకుంటే.. మీరు చాలా ఎక్కువగా డబ్బులు చెల్లించక తప్పదు. విమాన టిక్కెట్ ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. ఆ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై లిమిట్స్ తీసివేస్తునట్లు ప్రకటించింది. ఈ కారణంగానే విమానయాన సంస్థలు డిమాండ్‌కు అనుగుణంగా ఛార్జీలను నిర్ణయిస్తున్నాయి. అయితే దీపావళి (Diwali) వీకెండ్‌ టైమ్‌లో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగినట్లుగా ఎయిర్‌లైన్ సంస్థలు విమాన టికెట్ల (Flight Tickets) ధరలను విపరీతంగా పెంచాయి. ముఖ్యంగా ముంబై (Mumbai) నుంచి బయలుదేరే విమానాల టికెట్ల ధరలు మరింత ప్రియంగా మారాయి.

దీనర్థం కొన్ని వారాల తర్వాత వచ్చే దీపావళి సందర్భంగా వీకెండ్ జర్నీ ప్లాన్ చేసుకుంటే.. మీరు చాలా ఎక్కువగా డబ్బులు చెల్లించక తప్పదు. శ్రీనగర్, కొచ్చి, కోల్‌కతా మొదలైన అనేక డెస్టినేషన్లకు విమాన టిక్కెట్ ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. ఆ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

* ముంబై నుంచి ఇతర డెస్టినేషన్లకు..

ముంబై నుంచి వివిధ నాన్-మెట్రో సిటీలకు నాన్-స్టాప్ టు-అండ్-ఫ్రొ ఫ్లైట్‌ల ఛార్జీలు రూ.20,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. అక్టోబరు 21, 22, 23 తేదీల్లో ముంబై-కొచ్చి విమాన ఛార్జీలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి.

ముంబై నుంచి అలహాబాద్‌కి రూ.27,300, ముంబై నుంచి శ్రీనగర్‌కి రూ.29,000, ముంబై నుంచి రాంచీకి రూ.27,000, ముంబై నుంచి లక్నోకి రూ.26,300, ముంబై నుంచి జైపూర్‌కి రూ.25,400, ముంబై నుంచి కోల్‌కతాకి రూ.24,300, ముంబై నుంచి డెహ్రాడూన్‌కి రూ.23,800, ముంబై నుంచి జోధ్‌పూర్‌కి రూ.28,600, ముంబై నుంచి రాయ్‌పూర్‌కి రూ.27,800, ముంబై టు కొచ్చికి రూ.27,600 గా ధరలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : తొలిసారి 82 రూపాయలు దాటిన డాలర్... మీకెలా నష్టమంటే

మరోవైపు ఢిల్లీ-కొచ్చి నాన్ స్టాప్ ఫ్లైట్ ధర రూ.18,300గా ఉంది. ఢిల్లీ నుంచి రూ.20,000 కంటే ఎక్కువ ధర ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ తిరువనంతపురానికి ఉంది. ఈ ఫ్లైట్ టికెట్ ధర రూ.22,300గా ఉంది. 2021తో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో బుకింగ్ ఎంక్వయిరీ 50-60% పెరిగాయని విమానయాన సంస్థల యజమానులు చెబుతున్నారు. వారి ప్రకారం, దేశీయంగా ఢిల్లీ-పాట్నా, ముంబై-జైపూర్ వంటి టైర్ 1 నుంచి టైర్ 2 నగరాల మన ప్రయాణాల ఫార్వార్డ్ బుకింగ్‌లకు కూడా అధిక డిమాండ్‌ నమోదవుతోంది.

* ఫెస్టివల్ సీజన్‌లో డిమాండ్

ఈ దీపావళి పాజిటివ్ ట్రావెల్ సెంటిమెంట్‌ ఉంటుందని ఆయా కంపెనీల యజమానులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ ఫ్లైట్ బుకింగ్ సైట్స్ ప్రకారం దేశీయ గమ్యస్థానాలలో వెకేషన్ టైమ్‌లో బుకింగ్స్‌లో స్థిరమైన, బలమైన వృద్ధి నమోదయింది. ఇండస్ట్రీ డేటా ప్రకారం, దేశీయ విమాన ప్రయాణంలో రికవరీ ప్రీ-పాండమిక్ స్థాయితో పోలిస్తే దాదాపు 90% ఉంది. దీనికి పండుగ సీజన్ ప్రయాణాలు తోడైతే ఇండస్ట్రీ టాప్ గేర్‌తో దూసుకెళ్లనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Diwali, Flight, Flight tickets, Personal Finance

ఉత్తమ కథలు