బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆర్థిక సర్వే(Economic Survey) ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్(Budget) సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి(President) ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ మరియు రాజ్యసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొవిడ్ -19పై సమరం తర్వాత మొదటి సారిగా.. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి.. డిజిటల్ బడ్జెట్ సమర్పణ నవశకానికి నాంది అని పేర్కొన్నారు. ఇక 2023-2024 బడ్జెట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతీ విషయాన్ని సమగ్రంగా.. న్యూస్ 18(News 18) పాఠకులు తెలుసుకోవచ్చు. దాని కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక గత రెండు సంవత్సరాల నుంచి కూడా.. పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న కేంద్రం.. ఈ సారి కూడా అదే విధంగా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క చివరి, పూర్తి స్థాయి 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ తొలుత లోక్‌సభలో ఆ తర్వాత రాజ్యసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీని తర్వాత గురువారం (ఫిబ్రవరి 02) రోజున రాష్ట్రపతికి ఉభయసభలు ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తాయి. ఈ చర్చకు సంబంధించి ప్రధాని మోదీ లోక్ సభ, రాజ్యసభల్లోనూ సమాధానాలు ఇవ్వనున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడతగా.. ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 10వరకు జరగుతుంది. మలి విడత మార్చి 12 నుంచి ఏప్రిల్ 06 వరకు కొనసాగనున్నాయి.
అయితే పేపర్ లెస్ బడ్జెట్ కారణంగా వెబ్ సైట్, యాప్ ద్వారా కూడా సామాన్యులకు ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ను డీఈఏ మార్గదర్శకత్వంలో ఎన్ఐసీ అభివృద్ధి చేసింది. వీటితో పాటు.. న్యూస్ 18 లో కూడా బడ్జెట్ వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. బడ్జెట్ ను ఇలా యాప్ రూపంలో అందించే విధానాన్ని కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2021 లో ప్రవేశపెట్టింది . ఈ యాప్ యూనియన్ బడ్జెట్ (యూబీ) పేరుతో ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా ఇలా.. డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అది డిజిటల్ ఇండియా పరంగా ఇదొక కీలక ముందడుగే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సారి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు ఉండనున్నాయి.. కుటుంబంలో ప్రతీ నెల ఒకటో తేదీన బడ్జెట్ వేసే సమయంలో ఎలాంటి ఆత్రుత ఉంటుందో.. దేశంలో ప్రతీ పౌరుడు కూడా అదే విధంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏ వస్తువుల రేట్లు పెరగబోతున్నాయి.. ఏ వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి..అని ఎదురు చూస్తున్నారు. పన్నులు, పెట్టుబడుల నిధులు ఎలా ఉండబోతున్నాయో.. రేపు బడ్జెట్ లో తెలియనున్నది. ప్రతీ సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కొందరికి సంతోషాన్ని ఇస్తే.. మరికొందరికి ఉసూరుమనిపిస్తుంటుంది. మరి ఈ సారి బడ్జెట్ దేనికి ఎంత కేటాయించనున్నారు.. అనే విషయాలు రేపు తెలవనున్నది. బడ్జెట్ ప్రసంగం నుంచి.. పూర్తయ్యే వరకు .. పూర్తి సమచారం.. లైవ్ గా మీరు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2022-23, Budget 2023, Nirmala sitharaman, Union Budget 2022