ఆదాయ పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేయడానికి గడువు జులై 31న ముగుస్తుంది. ఈ సమయంలో కొందరు ఉద్యోగులు తమ ఎంప్లాయర్ నుంచి ఫారమ్ 16, ఫారం 16A తదితర టీడీఎస్(TDS) సర్టిఫికేట్‌లను అందుకోకపోయి ఉండవచ్చు. బ్యాంక్ లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థల కారణంగా ఐటీఆర్ ఫైల్ చేయడం కష్టంగా అనిపించవచ్చు. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్(AIS) ఆధారంగా ఐటీఆర్‌ను ఫైల్ చేయవచ్చు. ఫారమ్ 16, ఇతర టీడీఎస్ సర్టిఫికెట్లు లేకపోయినా ఐటీఆర్ ఎలా ఫైల్ చేయవచ్చో తెలుసుకోండి..
సెకండరీ సోర్సెస్ ద్వారా ఐటీఆర్ దాఖలు
ఒక వ్యక్తి ఫారం 26AS, AIS, ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల వివరాల ఆధారంగా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. టీడీఎస్ సర్టిఫికేట్‌లు ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి అవసరమైనవి కావు. పన్ను చెల్లింపుదారు తన ఆదాయాన్ని అలాగే సంవత్సరంలో డిడక్ట్ అయిన టీడీఎస్‌ని ధ్రువీకరించేందుకు సెకండరీ సోర్సెస్. ఫారమ్ 26AS అనేది ఆదాయం, చెల్లించిన ముందస్తు పన్నుపై డిడక్ట్ అయిన పన్ను వివరాలను తెలిసే సెల్ఫ్ పాస్‌బుక్. AIS అనేది ఫారమ్ 26AS పొడిగింపు. ఒక వ్యక్తి చేపట్టే ఆర్థిక లావాదేవీల వివరాలు ఇందులో ఉంటాయి.
పన్ను చెల్లింపుదారులు ఫారమ్ 16/ఫారం 16A, ఫారం 26AS, AIS వంటి టీడీఎస్ సర్టిఫికేట్‌లను క్రాస్ చెక్ చేయడం మంచిది. ఆదాయం నుంచి జమ చేసిన పన్ను, ప్రభుత్వం వద్ద కూడా జమ అయిందని నిర్ధారించుకోవడానికి ఇది పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుంది. టీడీఎస్ సర్టిఫికేట్లు లేనప్పుడు, బ్యాంక్ ఖాతా(Account)కు జమ అయిన నికర మొత్తంతో ఫారమ్ 26ASలో పేర్కొన్న పన్ను మొత్తాన్ని తనిఖీ చేయవచ్చు. రెండింటినీ సరిపోల్చినప్పుడు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న మొత్తానికి సరిపోలాలి. ఈ గణాంకాలు సరిపోలితే, ఐటీఆర్‌ని సులభంగా ఫైల్ చేయవచ్చు.
ఫారమ్ 26AS, AIS ఉపయోగించి ఐటీఆర్ ఇలా ఫైల్ చేయండి..
- కొత్త ఆదాయ పన్ను పోర్టల్ నుంచి ఫారం 26AS, AIS డౌన్‌లోడ్(Download) చేసుకోవాలి. ఈ పత్రాలు ట్యాక్స్ డిడక్ట్ అయిన ఆదాయ వివరాలను తెలియజేస్తాయి.
- ఐటీఆర్ ఫారమ్‌లో తప్పనిసరిగా శాలరీ ఇన్‌కం విభజనను తెలుసుకోవడానికి, కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌కి లాగిన్ చేసి, ITR-1 ఫారమ్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ఐటీఆర్ ఫారమ్‌లో పేర్కొనడానికి అవసరమైన వివరాలను పూరించడానికి ఫుల్ బ్రేక్-అప్ సహాయం చేస్తుంది.
- ఆస్తి విక్రయం, వడ్డీ ఆదాయం మొదలైన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను AIS నుంచి తీసుకోవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్(Savings) వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ కోసం ఇండెక్స్ చేసిన ఖర్చు, ఏదైనా ఇతర ఆదాయం మొదలైన సమాచారం AISలో ప్రతిబింబించకపోవచ్చు. అందువల్ల, బ్యాంక్ పాస్‌బుక్, ఫారమ్ 26AS నుంచి సమాచారాన్ని క్రాస్ చెక్ చేసి నిర్ధారించుకోవాలి.
గమనించాల్సిన ఇతర విషయాలు..
AIS అనేది కొత్త పత్రం అని గమనించడం ముఖ్యం. 2021 నవంబర్‌లో ప్రారంభమైంది. ఇది ఫారమ్ 26AS పొడిగింపు. AIS పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన వివిధ వనరుల ద్వారా ఆదాయ పన్ను శాఖకు అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తుంది.
ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను AIS డౌన్‌లోడ్ చేసి.. తనిఖీ చేసి, ఏవైనా లోపాలు ఉంటే తెలియజేయమని కోరింది. లోపాన్ని సరిదిద్దకపోతే, ఆదాయ పన్ను నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. చాలా మంది పన్ను నిపుణులు AISలో లోపాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అందువల్ల బ్యాంక్(Bank) పాస్‌బుక్‌లు, మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్‌లు, ఫారమ్ 26AS మొదలైన ఇతర పత్రాలతో AISలో ఆర్థిక లావాదేవీలను క్రాస్-చెక్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Financial Planning, Itr deadline, ITR Filing, Tax payers, Tds