హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ధర ఎంతో తెలిస్తే...పట్టపగలే చుక్కలు కనపడతాయి..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ధర ఎంతో తెలిస్తే...పట్టపగలే చుక్కలు కనపడతాయి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలుపై దృష్టిసారించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ లంబోర్గిణి యూరుస్‌ క్యాప్సూల్‌ ఎడిషన్‌ మోడల్స్‌ కొనుగోలు చేశారు. ఈ ఆల్ట్రా లగ్జరీ కారు ధర రూ.3.10 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది.

ఇంకా చదవండి ...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలుపై దృష్టిసారించారు. అత్యంత ఖరీదైన కారుగా పరిగణించే మెర్సిడిస్‌-మేబ్యాక్‌ జీఎల్‌ఎస్‌600 4మ్యాటిక్‌ను (Mercedes-Maybach GLS 600 4Matic) గడిచిన రెండు వారాల్లో ముగ్గురు హీరోలు కొనుగోలు చేశారు. ఒకే మోడల్ కారును టాప్ సెలబ్రిటీలు కొనుగోలు చేయడం ఇది మొదటిసారేం కాదు. బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌, కోలివుడ్‌లోనూ గతంలో చాలా మంది సెలబ్రిటీలు ఒకే తరహా వాహనాలు కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి సినీ ప్రముఖలంతా మెర్సిడిస్‌-మేబ్యాక్‌ జీఎల్‌ఎస్‌పై మోజు పడుతున్నారు.

రెండేళ్ల క్రితం వరకు సెలబ్రిటీలు, బిగ్‌ షాట్‌ స్టార్స్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌పై (Range Rover Vogue) మనస్సు పారేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో తయారైన ఆ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. రేంజ్‌ రోవర్‌ తర్వాత లంబోర్గిణి యూరుస్‌ సెలబ్రిటీలను బాగా ఆకట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీగా దీనికి పేరుంది.

రేంజ్‌ రోవర్‌ వోగ్‌

ఈ ఖరీదైన కారుకు బాలీవుడ్‌లో అనేక మంది తారలు ఫిదా అయిపోయారు. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆలియా భట్‌ దగ్గర ఈ కారు ఉంది. 2019లో సిద్ధార్థ్‌ మల్హోత్రా, కత్రినా ఖైఫ్‌, సంజయ్‌ దత్‌ ఈ కారు కొన్న తర్వాత ఒక్కసారిగా అందరూ కొనడం ప్రారంభించారు. ఈ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ కార్లు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో లభిస్తాయి. 3.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ధర రూ.2.11 కోట్లు అయితే 4.4 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ధర రూ.2.33 కోట్లు. 2019లో సినీ ప్రముఖులంతా రేంజ్‌ రోవర్‌ వోగ్‌ కారు కొనేందుకు పోటీపడ్డారు. లాక్‌డౌన్‌, కొవిడ్‌-19 కారణంగా 2020 దీనిపై మోజు తగ్గింది.

లంబోర్గిణి యూరుస్‌

ప్రపంచంలో అత్యంత వేగం కలిగిన ఎస్‌యూవీగా పేరుతెచ్చుకున్న లంబోర్గిణి యూరుస్‌ను ముందుగా కొనుగోలు చేసింది యువ హీరో కార్తిక్‌ ఆర్యన్‌. ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ లంబోర్గిణి యూరుస్‌ క్యాప్సూల్‌ ఎడిషన్‌ మోడల్స్‌ కొనుగోలు చేశారు. ఈ ఆల్ట్రా లగ్జరీ కారు ధర రూ.3.10 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది.

మెర్సిడిస్‌-మేబ్యాక్‌ జీఎల్‌ఎస్‌600 4మ్యాటిక్‌

బాలీవుడ్‌ తారలు అర్జున్‌ కపూర్‌, కృతి సనన్‌ తర్వాత ఈ కారును తెలుగు స్టార్‌ రామ్‌చరణ్‌ కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కారుగా దీన్ని పరిగణిస్తారు. దీని ప్రారంభ ధర రూ.2.43 కోట్లు. ఈ కారు తయారు చేసే కంపెనీ 50 కార్లను ప్రత్యేకంగా ఇండియన్‌ మార్కెట్‌ కోసం కేటాయించింది. ఇప్పటికే వాటిలో చాలా మటుకు అమ్ముడుపోయాయట. నెక్ట్స్ బ్యాచ్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో రావచ్చు. ఇంజిన్‌, స్పీడ్‌పరంగా ఎన్నో విశిష్ఠతలు కలిగిన ఈ కారులో 4 సీటర్‌ లేదా 5 సీటర్‌గా లేఔట్‌ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉండటం మరో ప్రత్యేకత.

First published:

Tags: Cars

ఉత్తమ కథలు