ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ రీచ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. యూజర్ల సంఖ్య పెరగడంతో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం చాలా పెరిగింది. ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో చేసే అడ్వెర్టైజ్‌మెంట్లు, అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ ద్వారా వినియోగదారులు తప్పుదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు సంబంధించి కేంద్రం ఎండార్స్‌మెంట్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్ లేదా బ్రాండ్ ఆర్థిక లేదా వస్తుపరమైన ప్రయోజనాలను ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా బహిర్గతం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు పాటించకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాలు వినియోగదారుల రక్షణ చట్టం, 2019కి అనుగుణంగా ఉన్నాయి. వినియోగదారులను అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, మోసపూరిత ప్రకటనల నుంచి రక్షించడానికి వీటిని రూపొందించారు.
* మార్గదర్శకాలు ఇవే
కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ శుక్రవారం ‘ఎండార్స్‌మెంట్ నో-హౌస్’ టైటిల్‌తో గైడ్‌లైన్స్ విడుదల చేసింది. కంపెనీల నుంచి ఇన్‌ఫ్లెయెన్సర్లు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా ఆర్థిక లేదా ఇతర పరిహారాలు పొందుతున్నా తెలపాలని పేర్కొంది.
పర్యటనలు లేదా హోటల్ బసలు, మీడియా బార్టర్‌లు, కవరేజ్, అవార్డులు, షరతులతో లేదా లేకుండా ఉచిత ప్రొడక్టులు, డిస్కౌంట్లు, బహుమతులు, వ్యక్తిగతంగా లేదా కుటుంబం పరంగా ఉద్యోగ సంబంధం ఉన్నా బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. అడ్వెర్టైజ్‌మెంట్లు చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఏ రూపంలో అయినా స్పష్టంగా డిస్‌ప్లే చేయాలని తెలిపింది. ఏదైనా రూపంలో, ఫార్మాట్‌లో లేదా మాధ్యమంలో తప్పుదారి పట్టించే ప్రకటనలు చట్టవిరుద్ధమని పేర్కొంది.
* ఆ ప్రకటనలకు వ్యతిరేకంగా చర్యలు
వినియోగదారుల వ్యవహారాల విభాగం.. గైడ్‌లైన్స్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ మిస్‌లీడింగ్ అడ్వెర్టైజ్‌మెంట్స్ అండ్ ఎండార్స్‌మెంట్స్ ఫర్ మిస్ లీడింగ్ అడ్వెర్టైజ్‌మెంట్స్, 2022 ప్రచురించింది. ప్రొడక్టులు లేదా సేవలను ఎండార్సింగ్ చేసేటప్పుడు తమ ఫాలోవర్స్‌ను, ఇతరులను తప్పుదారి పట్టించరని, వారు వినియోగదారుల రక్షణ చట్టం, ఏదైనా అనుబంధ నియమాలు లేదా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించడం ఈ గైడ్ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి : కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ ఎప్పుడు, ఎలా భాగమైంది..? ఆసక్తికరమైన విషయాలు
ఈ మార్గదర్శకాలు చెల్లుబాటు అయ్యే ప్రకటనల కోసం ప్రమాణాలు, తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనదారులు, ప్రకటనల ఏజెన్సీల బాధ్యతలను వివరిస్తాయి. ఎండార్స్‌మెంట్స్ తప్పనిసరిగా సరళమైన, స్పష్టమైన భాషలో తయారు చేయాలని, అడ్వెర్టైజ్‌మెంట్, స్పాన్సర్డ్, పెయిడ్ ప్రమోషన్ వంటి పదాలను ఉపయోగించవచ్చని పేర్కొంది. తగిన శ్రద్ధ చూపని, వ్యక్తిగతంగా అనుభవించని, ఎక్స్‌పీరియన్స్ చేయని ఏ ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను ఎండార్స్ చేయకూడదని తెలిపింది. తాజా నిబంధనలను పాటించకపోతే, ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
* ఎండార్స్‌మెంట్ అంటే ఏంటి?
ఎండార్స్‌మెంట్ అనేది ప్రజలలో ఉన్నత స్థాయి గుర్తింపు, విశ్వాసం, గౌరవం లేదా అవగాహన ఉన్న ప్రముఖ వ్యక్తులు లేదా ప్రముఖులతో రూపొందించే అడ్వెర్టైజ్‌మెంట్లు. అడ్వెర్టైజర్లు, క్లయింట్లు అటువంటి ప్రముఖుల అప్రూవల్ లేదా ఎండార్స్‌మెంట్ కొనుగోలుదారులను అనుకూలంగా ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నారు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ మోటార్‌సైకిళ్లు, బిస్కెట్‌లను ఎండార్స్ చేయడం అనేది, అతన్ని రోల్ మోడల్‌గా భావించే యువకులను, పిల్లలను ప్రభావితం చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook, Instagram, Social Media, Twitter, Youtube