news18
Updated: November 13, 2020, 12:39 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
- News18
- Last Updated:
November 13, 2020, 12:39 PM IST
పండుగ సీజన్ సందర్భంగా గృహ రుణాలపై ఆర్థిక సంస్థలు తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. ఈ రాయితీల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపులు వంటివి ఉన్నాయి. 15 సంవత్సరాల కనిష్టానికి వడ్డీ రేట్లు చేరుకోవడం విశేషం. కొత్తగా ఇల్లు కొనాలని చూస్తున్న వారికి, చెల్లించాల్సిన లోన్‌ను ఇతర సంస్థలకు బదిలీ చేయాలనుకునేవారికి ఇది మంచి తరుణం. కొన్ని సంస్థలు అందిస్తున్న ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లోన్ వంటి ఆప్షన్లతో వినియోగదారులకు మరింత లబ్ది చేకూరనుంది. పలు ప్రభుత్వ, ప్రయివేటు రంగ విత్త సంస్థలు వినియోగదారులకు ఆకట్టుకోవడానికి ఆఫర్లను ప్రకటించి మరీ రుణాలు అందజేస్తున్నాయి. వాటి వివరాలు కింది విధంగా...
ప్రభుత్వ రంగ బ్యాంకులు హోమ్‌లోన్ లపై అతి తక్కువ వడ్డీ రేట్లను ప్రకటించాయి. ఇతర ఆర్థిక సంస్థలకంటే ప్రభుత్వ బ్యాంకులే గృహ రుణాల విభాగంలో చవకైన లోన్లను అందిస్తుండటం విశేషం. గత వారం కొటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేటును 6.75 శాతానికి తగ్గించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వడ్డీ రేట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇతర బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇదే స్థాయిలో గృహ రుణాలపై వడ్డీ విధిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు హోమ్లోన్లపై విధించే వడ్డీ రేట్లు 6.85 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. Bankbazar.com డేటా ప్రకారం.. ఈ జాబితాలో ఉన్న మొదటి పది సంస్థల వడ్డీ రేట్లు ఏడు శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
పెద్ద బ్యాంకులు కూడా...
భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. రూ.75 లక్షలకు పైబడిన రుణాలకు 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు రాయితీని ఎస్బీఐ ప్రకటించింది. హౌసింగ్ లోన్ల విభాగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరొందిన హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీ రేట్లను 6.9 శాతానికి తగ్గించింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ల వడ్డీ రేట్లు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి.
షరతులు వర్తిస్తాయి...
గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఉన్నా, లోన్ తీసుకునేవారు క్రెడిట్ స్కోరు, లోన్ అమౌంట్, వృత్తిని బట్టి అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. జీతాలు తీసుకోని ఎస్బీఐ ఖాతాదారులు, నెలవారీ జీతాలు పొందే ఖాతాదారులతో పోలిస్తే 15 bps వరకు ఎక్కువగా చెల్లించాలి. 760 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న BOI రుణగ్రహీతలు గృహ రుణాల వడ్డీ రేట్లపై 15-20 bps రాయితీని పొందవచ్చు. అందువల్ల హోమ్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ రిస్క్, వడ్డీ రేట్లు తదితర అంశాల గురించి వినియోగదారులు బ్యాంకుల్లో ఆరా తీయాలి. ఖాతాదారుల క్రెడిట్ అసెస్మెంట్లో ఉండే మార్పులు వడ్డీ రేట్లపై ఏవిధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి.
Published by:
Srinivas Munigala
First published:
November 13, 2020, 12:37 PM IST