Share Market Today: అమెరికా, యూరప్ స్టాక్ ఫ్యూచర్ల పతనం మధ్య భారత స్టాక్ మార్కెట్ కు కూడా ఈరోజు బ్రేక్ పడింది. గురువారం నిఫ్టీ 219.80 పాయింట్లు లేదా 1.24 శాతం పతనంతో 17560.20 వద్ద ముగియగా, సెన్సెక్స్ 770.31 పాయింట్లు లేదా 1.29 శాతం క్షీణించి 58788.02 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 39010 వద్ద ముగిసింది. 320.50 పాయింట్లు అంటే 0.81 శాతం క్షీణించింది. ఆటో స్టాక్‌లు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఐటీ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1-2 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం నష్టపోగా, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయింది.
నిఫ్టీ 50లో టాప్ 5 గెయినర్లు
హీరో మోటోకార్ప్ +2.93 %
బజాజ్ ఆటో +2.44 %
దివిస్ ల్యాబ్ +1.01 %
ITC Ltd. +.99 %
మారుతీ సుజుకి (మారుతి సుజుకి ఇండియా) +.92 %
నిఫ్టీ 50లో టాప్ 5 లూజర్లు..
HDFC -3.26%
NTPC -3.19 %
SBI లైఫ్ ఇన్సూరెన్స్ -2.86%
ఇన్ఫోసిస్ -2.72 %
గ్రాసిమ్ ఇండ్స్ -2.55 %
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share price, Stock Market