హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment Mistakes: ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు చేసే పెద్ద తప్పులు ఏంటి..? వీటిని ఎలా సరిదిద్దుకోవాలి..?

Investment Mistakes: ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు చేసే పెద్ద తప్పులు ఏంటి..? వీటిని ఎలా సరిదిద్దుకోవాలి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది వ్యక్తులు తమ సంపద సృష్టించే ప్రయాణంలో తీవ్రంగా ఆటంకం కలిగించే సాధారణ, ప్రాథమిక తప్పులు చేస్తుంటారు.ఇలాంటి తప్పులు ఏవి, వాటిని ఎలా సరిదిద్దాలో తెలుసుకోండి.

ఇటీవల ఓ సంస్థ కార్పొరేట్‌(Corporate) ఉద్యోగులకు పెట్టుబడులపై అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి హాజరైన చాలా మంది వారి వ్యక్తిగత ఆర్థిక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా చాలా మంది వ్యక్తులు తమ సంపద సృష్టించే ప్రయాణంలో తీవ్రంగా ఆటంకం కలిగించే సాధారణ, ప్రాథమిక తప్పులు(Mistakes) చేసినట్లు తేలింది. ఇలాంటి తప్పులు ఏవి, వాటిని ఎలా సరిదిద్దాలో తెలుసుకోండి.  ద్రవ్యోల్బణాన్ని(Inflation) తక్కువగా అంచనా వేయడందాదాపు ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలంలో ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనే ఆసక్తి కనబరుస్తారు. కానీ వారు తమ ఖర్చులపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేయలేరు. 7 శాతం ద్రవ్యోల్బణం వద్ద, ఖర్చులు ప్రతి 10 సంవత్సరాలకు దాదాపు రెట్టింపు అవుతాయి. ద్రవ్యోల్బణం(Inflation) ప్రభావాల మరొక పతనం మనీ-బ్యాక్(Money Back), ఎండోమెంట్ ఇన్సూరెన్స్(Insurance) వంటి ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం. వీటిల్లో 10 లేదా 15 లేదా 20 సంవత్సరాల చివరిలో నిర్ణీత మొత్తాన్ని తిరిగి పొందుతారు.

మీరు స్వీకరించే డబ్బు వాస్తవ విలువ 10 సంవత్సరాలలో సగం, 20 సంవత్సరాలలో నాలుగో వంతు ఉంటుంది. ఈ రోజు చెల్లింపు గణనీయంగా ఉన్నట్లు, కొనుగోలు అర్ధవంతంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ,  ద్రవ్యోల్బణ కోణాన్ని జోడించినప్పుడు, ఈ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం ద్వారా లభించే భద్రత, మనశ్శాంతి స్వల్పకాలికంగా ఉంటుంది.

IPPB Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా పోస్ట్‌లో 650 జాబ్స్... 3 రోజుల్లో అప్లై చేయండి ఇలా

పూర్తిగా శ్రద్ధ చూపకపోవడం ఎక్కువ మంది తమ పొదుపులో ఎంత శాతం పెట్టుబడి పెట్టాలి, ఎటువంటి వృత్తిపరమైన సహాయం లేకుండా వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేదానిపై నిర్ణయాలు తీసుకొంటారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో దొరుకుతున్న సమాచారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వారిలో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రైమరీ ప్రొడక్ట్స్ గురించి మాత్రమే తెలుసు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర దేశాల ప్రొడక్ట్స్‌ గురించి కూడా వారికి మంచి ఆలోచన ఉంది. అయినప్పటికీ వారికి లేనిది నమ్మకం. పెట్టుబడుల విషయానికి వస్తే సమయం చాలా ముఖ్యమైనదని గ్రహించాలి.

షార్ట్‌టర్మ్‌(Short Term) ఫలితాలపై దృష్టి షార్ట్‌టర్మ్‌ గోల్స్‌పై ఎక్కువ మంది అనవసరమైన శ్రద్ధ చూపుతున్నారు. టాప్‌ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలని ఎక్కువగా చూస్తుంటారు. బాగా పర్ఫార్మ్‌ చేసే కంపెనీలు కూడా దురదృష్టవశాత్తూ, వివిధ కారణాల ద్వారా తిరోగమనంలో పయనించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నష్టాలను మూటగట్టుకొనే ప్రమాదం ఉంది. పెట్టుబడులపై నమ్మకం ఉన్నప్పుడు దీర్ఘకాలం కొనసాగించడం ద్వారానే ఫలితాలు అందుతాయి.

ఎంచుకొన్న వాటికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వడంగత రెండేళ్లుగా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. చాలా మంది ఈక్విటీలో రాబడిని చూశామని కార్యక్రమంలో తెలిపారు. మొత్తం మార్కెట్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఫలితాలు ఆకట్టుకొంటాయి. ఆ సమయంలో పెట్టుబడులు పెట్టేందుకు FDలు, RDల వంటి వాటిని ఉపయోగించడం మేలు. మార్కెట్‌లో నెగెటివిటీ మొదలైనప్పుడు వచ్చిన లాభాలు ఆవిరైపోయే అవకాశం ఉంది. తిరోగమనానికి గల కారణాలపై స్పష్టత లేకుండా, కరెక్షన్ ద్వారా కూడా మీ పెట్టుబడి బాగానే ఉంటుందన్న విశ్వాసం లేకుండా అస్థిర మార్కెట్‌లలో పట్టు సాధించడం చాలా కష్టం.

ప్రణాళిక లేకుండా పెట్టుబడి పెడుతున్నారుప్రణాళిక లేకుండా ఉంటే నిర్ణయాలు తాత్కాలికంగా ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో ఎంచుకొన్న కంపెనీలు పరిస్థితికి లేదా లక్ష్యానికి తగినవి కాకపోవచ్చు. ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను పెట్టాలి. ఇలాంటి అంశాల్లో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

First published:

Tags: Fixed deposits, Investments, Money, Stock Market

ఉత్తమ కథలు