Home /News /business /

THE BENGALURU POSTAL DEPARTMENT STARTS DOOR STEP DOORSTEP DELIVERY OF IDLI DOSA BATTER AND INSTANT COOK EAT PRODUCTS SRD

Indian Post Food Delivery: పోస్టల్ శాఖ కొత్త రకం సేవలు.. ఇంటి వద్దకే ఇడ్లీ, దోసె పిండి.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian Post Food Delivery: భారత తపాలాశాఖ మరో కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇది పూర్తిగా కొత్త రకం సేవ. అసలు ఏంటీ.. ఆ వినూత్న ప్రయోగం..? అది ఎక్కడ ప్రారంభమైంది..?

    ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ (Indian Postal Department) కొత్త రకం సేవలకు శ్రీకారం చుట్టింది. ఇది ఇంతకు ముందు నిర్వహించని కొత్త సేవ. పూర్తిగా సాంప్రదాయేతర నయా వెంచర్‌లోకి ప్రవేశించింది. ఇడ్లీ మరియు దోస పిండితో సహా తక్షణ ఆహార తయారీ కోసం అవసరమైన పదార్ధాల్ని ఇంటి వద్దకే తెచ్చే ఇండియన్ పోస్ట్ ఫుడ్ డెలివరీ (Indian Post Food Delivery) సేవ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం బెంగళూరులో ప్రారంభమైంది. పోస్టల్ శాఖ బెంగళూరులోని కొన్ని ఇళ్లకు మొదటి బ్యాచ్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. ఈ వ్యాపారాన్ని కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తే భవిష్యత్తులో డిపార్ట్‌మెంట్ (Post Office Services) భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుందని నిపుణులు అంటున్నారు.

    దోస పిండితో పాటు బిస్బేలే బాత్, ఖరాబాత్, కుంకుమపువ్వు బాత్ మిశ్రమాలు, నెయ్యి పొంగల్ రెడీ టు ఈట్ మిక్స్‌లు, చట్నీ పౌడర్, ఇడ్లీ పిండిలు ఇప్పటివరకు పంపిణీ చేయబడ్డాయి. సోమవారం వరకు బుక్ చేసుకున్న 22 పార్శిళ్లలో ఒకటి మాత్రమే కస్టమర్ అందుబాటులో లేకపోవడంతో డెలివరీ కాలేదు. మిగిలిన పార్శిళ్లను తూర్పు బెంగళూరు, దక్షిణ బెంగళూరు, పశ్చిమ బెంగళూరు ఇళ్లలో అందజేశారు.



    ఒక ఆచరణాత్మక ప్రారంభం

    ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో కర్ణాటక సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (CPMG) ఎస్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీతో టై అప్ అయి ప్రయోగాత్మకంగా ఉత్పత్తుల పంపిణీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

    వివిధ సంస్థలకు ఆహ్వానం

    ఆహార వ్యాపారంలో వివిధ సంస్థల నుండి భారీ ఆర్డర్‌లను స్వీకరించడానికి రెడీ ఉన్నట్టు రాజేంద్ర కుమార్ తెలిపారు. ఈ వ్యాపారం పోస్టల్ శాఖకు కూడా అద్భుతమైన ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని కర్ణాటక సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అభిప్రాయపడ్డారు.

    ఇది కూడా చదవండి :ఈ స్కీమ్ లో చేరితే.. నెలకు రూ.210తో రూ. 5వేల పెన్షన్‌ ... పూర్తి వివరాలివే..

    విపరీతమైన ప్రజాదరణ

    తపాలా శాఖ బెంగళూరులో చిన్న ఫాస్ట్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ఇప్పటికే ప్రారంభించింది. రానున్న రోజుల్లో విపరీతమైన ఆదరణ పొందే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

    ఎవరు బట్వాడా చేస్తారు?

    ప్రస్తుతం ఈ సేవను రెగ్యులర్ పోస్టల్ డెలివరీ సిబ్బంది అందిస్తున్నారు. భవిష్యత్తులో దీనికి ప్రజల నుంచి మంచి డిమాండ్‌ ఉంటే ఆహార పంపిణీకి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఎస్‌ రాజేంద్రకుమార్‌ తెలిపారు.

    ఇది పూర్తి భిన్నం..

    'రెస్టారెంట్‌ల నుండి రెడీమేడ్ ఫుడ్‌ను డెలివరీ చేసే ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరిగా కాకుండా, మా డిపార్ట్‌మెంట్ ఆహారాన్ని సిద్ధం చేయడానికి అవసరమైన పదార్థాలను మాత్రమే సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఆహార పదార్ధాల్ని టెట్రా ప్యాక్‌లలో ప్యాక్ చేయగలిగితే.. అవి పాడవ్వకుండా తాజాగా ఉంటాయి. ఈ పద్ధతిలో దేశవ్యాప్తంగా, విదేశాలకు కూడా తరలించే అవకాశం ఉంది. ' అని రాజేంద్రనాథ్ తెలిపారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangalore, Indian postal, Karnataka, Postal delivery, Postal department

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు