Home /News /business /

THE BEAST US PRESIDENTS POWERFUL CAR ROCKET LAUNCHER AND CHEMICAL WEAPON HAVE NO EFFECT ON THIS MK

The Beast: అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ విశేషాలు ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్

అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్

అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన నేతగా అభిర్ణిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు విహరించేందుకు ప్రత్యేక బోయింగ్ విమానం, అలాగే ఆయన ప్రయాణించేందుకు ప్రత్యేకమైన 'ది బీస్ట్' కారు ఉంటాయి. మరి దీని ఫీచర్లు ఏంటో తెలుసుకోవాల్సిందే.

ఇంకా చదవండి ...
  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడు ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఇంటి బాట పట్టే వీలుంది. అయితే అమెరికా అధ్యక్షుడిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన నేతగా అభిర్ణిస్తుంటారు. ఆయన కనుసన్నల్లోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం, ఆర్థిక వ్యవస్థ నడుస్తుంటాయి. మరి అమెరికా అధ్యక్షుడు విహరించేందుకు ప్రత్యేక బోయింగ్ విమానం, అలాగే ఆయన ప్రయాణించేందుకు ప్రత్యేకమైన 'ది బీస్ట్' కారు ఉంటాయి. అయితే ఈ కారు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. మరి దీని ఫీచర్లు ఏంటో తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు The Beast. దీన్ని "కాడిలాక్ వన్," ఫస్ట్ కార్" అని కూడా పిలుస్తుంటారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత ఆ దేశ అధ్యక్షుడి కారును భద్రత పెంచాలని అమెరికా ప్రభుత్వం భావించి. ఈ మోడల్ ను ఎంపిక చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ వాడుతున్న కాడిలాక్‌ కారు మోడల్‌ 2018 సెప్టెంబర్‌ 24న ఆ‍యన కాన్వాయ్ లో చేరింది. అధునాతన సౌకర్యాలతో, భద్రతా ప్రమాణాలతో కారును తయారు చేశారు.అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించిన ఈ కారు తప్పని సరిగా తీసుకువెళ్తారు.  బాంబులు పేలినా చెక్కు చెదరదు...
  కారు ఎక్స్ టీరియర్ బలమైన అబేధ్యమైన బాడీ కలిగి ఉంది. దీన్ని ఐదు అంగుళాల మందంతో ఉక్కు, టైటానియం, అల్యూమినియం, సిరామిక్ మిశ్రమంతో తయారు చేశారు. ఈ కారు కిటికీ తయారీలో ఉపయోగించిన గాజు విషయానికి వస్తే, ఇది ఐదు పొరల గాజు పాలికార్బోనేట్లతో తయారు చేయబడింది. బుల్లెట్లు, గ్రెనేడ్ల దాడులను కూడా ఈ అద్దాలు ఎదుర్కోగలవు. బీస్ట్‌కు కారుకు సమీపంలో శక్తివంతమైన బాంబులు పేలినా లోపల ఉన్న ప్రెసిడెంట్ ఏమీ కాదు. అదే సమయంలో, ఈ కారు టైర్ల యొక్క యోగ్యత గురించి మాట్లాడితే, మీరు ఆశ్చర్యపోతారు. ఈ కారు టైర్లు పగిలినా, ఈ కారు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా కిలోమీటర్లు ప్రయాణించగలదు.  కారు అద్దాలపై క్షిపణులు దాడిచేసిన పగలవు...
  బీస్ట్ కారు తలుపులు 8 అంగుళాల మందంతో ఉక్కుతో తయారు చేయబడ్డాయి. ఇవి చాలా బరువుగా ఉంటాయి. బోయింగ్‌ 757 విమానానికుండే డోర్లు ద బీస్ట్‌ కారుకు ఉంటాయి. ఈ కారు డోరు మూసివేస్తే ఈ కారు 100 శాతం సీలు వేసినట్లే. రసాయన ఆయుధాలు కూడా దీనిపై ప్రభావం చూపవు. ఈ కారు నుంచే గన్ ఫైర్ చేయవచ్చు.

  కారు కాదు కదిలే పుష్పక విమానం...
  బీస్ట్ కారులో నైట్ విజన్ కెమెరా ఉంది, తద్వారా రాత్రి సమయంలో కూడా శత్రువులను చూడవచ్చు. టైర్లు పగిలిపోవు పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా.. లోపల స్టీల్ రిమ్ లతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇందులో గ్రెనేడ్ అటాక్ ఎంపిక కూడా ఉంది. ఇదిఈ కారు ముందు నిలబడి ఉన్న ఏ లక్ష్యాన్ని అయినా గ్రెనేడ్ దాడితో క్షణాల్లో నాశనం చేస్తుంది. ఈ కారులోని జామర్లు చుట్టూ 150 మీటర్ల వరకు ఉంటాయి. ఎమర్జెన్సీ పరిస్థితిలో కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో చర్చించేదుకు వీలుగా శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కారు డ్రైవర్ వద్ద డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. సెల్ టవర్ కూడా కారులో ఉంది. మొత్తం ఇలాంటి కార్లు 12 ట్రంప్ కాన్వాయ్ లో ఉన్నాయి.

  డీజిల్‌ ట్యాంక్‌ ఏ పరిస్థితుల్లోనూ పేలకుండా ఉండేలా ప్రత్యేకమైన రక్షణ కవచం ఉంటుంది. అధ్యక్షుని సీటు వద్దే శాటిలైట్‌ ఫోన్‌, అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. ఇక వెనుక భాగంలో అధ్యక్షుడితో పాటు మరో నలుగురు కూడా కూర్చోవచ్చు. లోపలి భాగం గాజుతో వేరుచేసి ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది. ది బీస్ట్ డ్రైవింగ్ చేసే డ్రైవర్‌కు యుఎస్ సీక్రెట్ సర్వీస్ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈ డ్రైవర్ ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా కారు నడపగలడు. ఈ కారు లోపల, బ్లడ్ బ్యాంక్ నుండి ఆక్సిజన్ సరఫరా వరకు సౌకర్యాలు కల్పించారు.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business, Cars

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు