• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • THACKERAY PUSHES FOR 8 DAY TOTAL LOCKDOWN IN MAHARASHTRA VS

లాక్‌డౌన్ : మహాలో లాక్‌డౌన్ పై కొనసాగతున్న కీలక సమావేశం.. 8 లేదా 15 రోజులు లాక్‌డౌన్ విధించే అవకాశం ?

లాక్‌డౌన్ : మహాలో లాక్‌డౌన్ పై కొనసాగతున్న కీలక సమావేశం.. 8 లేదా 15 రోజులు లాక్‌డౌన్ విధించే అవకాశం ?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే(ఫైల్ ఫొటో)

lockdown : మహారాష్ట్ర్ర్రాలో మరోసారి లాక్‌డౌన్ విధింపు తీవ్ర చర్చ జరుగుతోంది. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక సమావేశం జరుపుతున్నారు. 8 లేదా 15 రోజుల పాటు లాక్‌డౌన్ వచేందుకు సీఎం మొగ్గు చూపినట్టు సమాచారం

  • Share this:
మహారాష్ట్ర్రాలో కరోనా విస్తృత రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికి మహారాష్ట్ర్రా మరియు ఢిల్లి రాష్ట్ర్రాల్లో కోవిడ్ భాధితులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నరాష్ట్ర్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర్రా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రత్యేకంగా కోవిడ్ టాస్క్ బృందం తో కాసేపటి క్రితమే సమావేశం అయ్యారు. రాష్ట్ర్రంలో నెలకొ్న్న పరిస్థితులపై చర్చించిన అనంతంర పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించిచాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం కొవిడ్ టాస్క్ ఫోర్స్ బృందం కనీసం 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని భావిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాత్రం 8 రోజుల పాటు విధించేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. కాగా పూర్తి స్థాయి చర్చల తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

కాగా మహారాష్ట్ర్రాలో ఇప్పటికే వారంతంలో లాక్‌డౌన్ విధించడంతో పాటు రాత్రీపూట కర్ష్యూను కూడ విధించారు. మరోవైపు నేటి వరకు 33 లక్షల మందికిపైగా కోవిడ్ భాదితులు ఉన్నట్టు సమాచారం. ఇక మరణాల సంఖ్య కూడ 50వేలు దాటింది. దీంతో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కోసం మహారాష్ట్ర్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఢిల్లిలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడ ఇదే నిర్ణయం తో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు అందుబాటులో ఉన్నా.. కేసులు ఇంకా తీవ్రం అయితే మాత్రం లాక్‌డౌన్ తప్పదని ప్రకటించారు. గతంలో కంటే ప్రస్తుత వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని ,దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని సీఎం కేజ్రీవాల్ వెళ్లడించారు. కాగా ఢిల్లి ఆసుపత్రులన్ని కోవిడ్ రోగులు నిండిపోవడంతో పరిస్థితి ఇంకా లాక్‌డౌన్ తప్పదని ఆయన వెల్లడించారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే కోవిడ్ సంబంధించి కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు