TERM LIFE INSURANCE POLICY SET TO GET COSTLIER HOW TO GET A POLICY THAT BEST SUITS YOUR POCKET MK GH
Term Life Insurance: భారం కానున్న టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలు.. తక్కువ ధరకే పాలసీని పొందడం ఎలా?
(ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవలి కాలంలో చాలా మంది టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ట్రేడిషనల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలతో పోల్చితే వీటి ప్రీమియం తక్కువగా ఉండటం, బీమా మొత్తం ఎక్కువ ఉండటంతో చాలా మంది, ముఖ్యంగా యూత్ వీటికి మొగ్గుచూపుతున్నారు.
ఇటీవలి కాలంలో చాలా మంది టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ట్రేడిషనల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలతో పోల్చితే వీటి ప్రీమియం తక్కువగా ఉండటం, బీమా మొత్తం ఎక్కువ ఉండటంతో చాలా మంది, ముఖ్యంగా యూత్ వీటికి మొగ్గుచూపుతున్నారు. ప్రతీ వ్యక్తి టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా యుక్తవయస్సులో టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఆ వయస్సు వారికి రేట్లు తక్కువుంటాయి. బీమా రక్షణ, కుటుంబానికి ఆర్థిక సంరక్షణ అందించాలని భావించే వారికి ఈ పాలసీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాని, గడిచిన ఏడాది కాలంగా చాలా బీమా కంపెనీలు టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియం విషయంలో కొంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అండర్ రైటింగ్ విషయంలో కఠినమైన మార్గదర్శకాలను రీఇన్సురెన్స్ కంపెనీలు అనుసరిస్తుండటం, పెరుగుతున్న క్లెయిములు. వీటిని దృష్టిలో ఉంచుకొని రీఇన్సురెన్స్ కంపెనీలు 2021 ప్రథమార్థంలో తమ మొత్తాలను పెంచాయని బీమారంగ వర్గాలు చెప్తున్నాయి.
ఈమధ్య కాలంలో డెత్ క్లెయిమ్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసి డెత్ క్లెయిములురూ.7355.45 కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో డెత్ క్లెయిమ్స్ మొత్తం రూ.3,151.87 కోట్లు మాత్రమే. ప్రైవేట్ బీమా కంపెనీల్లోనూ డెత్ క్లెయిమ్స్ సంఖ్య ఎక్కువే కనిపిస్తోంది. క్లెయిమ్స్ సంఖ్య పెరుగుతుండటంతో రీఇన్సురెన్స్ కంపెనీలు అండర్ రైటింగ్ మార్గదర్శకాలను కఠినంగా మార్చుతున్నాయి. పాలసీదారులకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని మరింత కోరుతున్నాయి. ఆరు నెలల పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు పెద్ద మొత్తంలో బీమా చేయించుకుంటున్నట్టు అయితే మరిన్ని వైద్య పరీక్షలను కోరుతున్నాయి.
తక్కువ ధరకేపాలసీని పొందడం ఎలా?
దాదాపు సంవత్సర కాలంగా అనేక ఇన్సురెన్స్ కంపెనీలు టర్మ్ లైఫ్ పాలసీల ప్రీమియం పెంచుతున్నాయి.రీఇనుర్సెన్స్ ప్రీమియం మొత్తాలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకోదలిచిన వారు తమ అవసరాలకు సరిపోయేది, గరిష్ఠ ప్రయోజనాలు అందించే బీమా పాలసీ ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీమియం భారాన్ని కొంత తగ్గించుకునేందుకు మంత్లీ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం మేలని వివరిస్తున్నారు. టర్మ్ పాలసీలు తీసుకోదలిచిన వ్యక్తులు ఇప్పుడు కొత్త రేట్లు అమల్లోకి రాకముందే తీసుకోవడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.