Home /News /business /

Term Insurance Plan తీసుకుంటున్నారా..? మీ పాలసీ కవరేజీ, వ్యవధిని ఇలా నిర్ణయించుకోండి

Term Insurance Plan తీసుకుంటున్నారా..? మీ పాలసీ కవరేజీ, వ్యవధిని ఇలా నిర్ణయించుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో ప్రాణాలను దక్కించుకోవాలంటే ఆర్థికంగా సిద్దంగా ఉండాల్సిందేనని అందరికీ తెలిసొచ్చింది. దీంతో, ప్రతి ఒక్కరికి Insurance ప్రాముఖ్యత తెలిసొచ్చింది. ఇందుకు నిదర్శనమే గత ఎనిమిది నెలల నుండి బీమా రంగంలో Term Insurance పథకాలకు డిమాండ్ బాగా పెరగడం.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మన జీవన శైలిని సమూలంగా మార్చేసింది. కరోనా చికిత్సకు లక్షల కొద్ది ఖర్చు అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా, ప్రాణాలను దక్కించుకోవాలంటే ఆర్థికంగా సిద్దంగా ఉండాల్సిందే. దీంతో, ప్రతి ఒక్కరికి ఇన్యూరెన్స్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. ఇందుకు నిదర్శనమే గత ఎనిమిది నెలల నుండి భీమా రంగంలో టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలకు డిమాండ్ బాగా పెరగడం. దీనికి అనుగుణంగానే అక్టోబర్ నెలలో ప్రైవేట్ బీమా సంస్థల మొదటి సంవత్సరం ప్రీమియం 23.56% పెరిగి రూ .7,227 కోట్లకు, ఎల్ఐసి ప్రీమియం 36% పెరిగి రూ .15,548 కోట్లకు చేరుకుంది.

అయితే, ఇటీవల ఫైజర్- బయోఎంటెక్, మోడెర్నా, స్పుత్నిక్ వీ చేసిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో 90% పైగా సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రతి ఒక్కరికీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక ప్రాథమిక అవసరమని గుర్తు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇది విపత్కర పరిస్థితుల్లో వ్యక్తికి రక్షణగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు.

కుటుంబంలో ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి?

కుటుంబంలోని సంపాదన సభ్యుడు అనగా కుటుంబాన్ని పోషించే వ్యక్తి తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను కలిగి ఉండాలి. ఒక వేళ ఆ వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే అతని కుంటుంబానికి టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీ కొంతమేర ఆర్థిక భరోసానిస్తుంది. కాగా పాలసీ మొత్తాన్ని, వ్యవధిని అతని కుటుంబ ఆర్థిక అవసరాల మేరకు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ పాలసీదారుడు ఏదైనా కారణం చేత మరణిస్తే పాలసీ డబ్బులు నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. పాలసీదారుడు పాలసీ టర్మ్ ముగిసే నాటికి జీవించి ఉంటే మాత్రం అతనికి ఎలాంటి డబ్బులు రావు. అందువల్ల, ఈ పాలసీలకు ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Term insurance, insurance plan, cover, insurance, cost, term plan, premium, Covid-19, education, children టర్మ్ ఇన్సూరెన్స్, కవరేజీ, కరోనా మహమ్మారి, జీవన శైలి
ప్రతీకాత్మక చిత్రం


ఇన్సూరెన్స్ కవరేజీ ఎంత ఉండాలి?

టర్మ్ ప్లాన్ మీ అన్ని కుటుంబ బాధ్యతలు, ప్రధాన భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. పిల్లల ఉన్నత విద్య, వివాహం, జీవించడానికి అయ్యే ఖర్చులు, ఇతర అవసరాలకు సరిపోయేలా భీమా కవరేజీ ఉండేలా చూసుకోండి. కాగా, భీమా ఎంత తీసుకోవాలి అనే విషయంలో ఒక సాధారణ సూత్రం ఉంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ట మేర బీమా తీసుకోవాలని గుర్తించుకోండి. ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.6 లక్షలుగా ఉంటే, దానికి పదిరెట్లు అనగా రూ.60 లక్షలకు బీమా కవరేజీని తీసుకోవడం అవసరం. అయితే సంబంధిత వ్యక్తి పేరిట ఉన్న లోన్లు, కుటుంబ జీవన శైలి, బాధ్యతల ఆధారంగా ఈ మొత్తం మారుతుంది. మీకు ఏవైనా లోన్లు ఉంటే వాటిని చెల్లించడానికి అదనంగా బీమా కవరేజీ అవసరం అని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి Savings Account Deposits: పొదుపు ఖాతాల డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ చెల్లించే బ్యాంకులివే..

పాలసీ వ్యవధి ఎలా నిర్ణయించుకోవాలి?

మీ పాలసీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలంటే సరైన పాలసీ వ్యవధిని ఎంచుకోవడం అత్యంత కీలకం. మీ పిల్లలు వారి విద్యను పూర్తి చేసి స్వతంత్రంగా మారే వరకు పాలసీ వ్యవధి ఉండేలా ప్రణాళిక చేసుకోండి. మీకు 60 ఏళ్లు వచ్చే నాటికి మీ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుందని భావిస్తే 60 ఏళ్ళు దాటి టర్మ్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలసీ కాల వ్యవధిని నిర్ణయించే ముందు ఎంత కాలం పాటు మీరు ఇంకా పనిచేయగలరన్నది కీలకంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబానికి సంబంధిత వ్యక్తి సంపాధన అవసరమైనంత కాలం మేర భీమా రక్షణ ఉండటం కీలకం.

మీ కవరేజీని ఇలా నిర్ణయించండి..

ఉదాహరణకు ప్రస్తుతం మీరు 35 ఏళ్లు ఉన్నారని అనుకుందాం. మీకు 75 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రూ .1.5 కోట్ల కవరేజీ ఉండాలని కోరుకుంటే రాబోయే 40 సంవత్సరానికి సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను సిద్ధం చేసుకోండి. దీనికి గాను మీకు సంవత్సరానికి సుమారు రూ. 21,000 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మిగతా 40 ఏళ్లలో మీరు ప్రీమియం కింద మొత్తం రూ .8.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Srinivas Munigala
First published:

Tags: Banks, Health Insurance, Insurance

తదుపరి వార్తలు