హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Premiums Hike: డిసెంబర్ 2021 నుంచి 40% వరకు పెరగనున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం.. ఎందుకంటే..

Insurance Premiums Hike: డిసెంబర్ 2021 నుంచి 40% వరకు పెరగనున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం.. ఎందుకంటే..

ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, బీమా ప్రీమియం చెల్లించలేక ఇబ్బందులు పడతారు. జీవిత బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు, బీమా గడువు ముగిసే వరకు కంపెనీకి ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తంలో ప్రీమియం చెల్లించాలి. ఏదైనా కారణంతో ప్రీమియం చెల్లించడం మానేస్తే, సంస్థ మీ పాలసీని రద్దు చేస్తుంది.

ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, బీమా ప్రీమియం చెల్లించలేక ఇబ్బందులు పడతారు. జీవిత బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు, బీమా గడువు ముగిసే వరకు కంపెనీకి ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తంలో ప్రీమియం చెల్లించాలి. ఏదైనా కారణంతో ప్రీమియం చెల్లించడం మానేస్తే, సంస్థ మీ పాలసీని రద్దు చేస్తుంది.

కోవిడ్-19 నేపథ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థలు పూచీకత్తు నిబంధనలను కఠినతరం చేశాయి. అలాగే రీ ఇన్సూరెన్స్ రేట్లను పెంచేశాయి. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలు 25 నుంచి 40 శాతం వరకు పెరగనున్నాయి.

కరోనా సమయంలో ఆరోగ్య బీమా, జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసొచ్చింది. మహమ్మారి విజృంభన తర్వాత చాలామంది ప్రజలు టర్మ్ పాలసీ, సాధారణ బీమా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. క్లెయిమ్‌లు కూడా విపరీతంగా పెరుగుతున్న క్రమంలో బీమా సంస్థలకే బీమా కల్పించే రీఇన్సూరెన్స్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థలు పూచీకత్తు నిబంధన (underwriting norms)లను కఠినతరం చేశాయి. అలాగే రీ ఇన్సూరెన్స్ రేట్లను పెంచేశాయి. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలు 25 నుంచి 40 శాతం వరకు పెరగనున్నాయి. అయితే, ప్రీమియం పెంపు పరిధి ఒక బీమా సంస్థ నుంచి మరొక బీమా సంస్థకి మారుతూ ఉంటుందనేది పాలసీ కొనుగోలుదారులు గమనించాలి. ఈ కొత్త రేట్లు డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి.

మొదటి త్రైమాసికం (Q1-FY22)లో చేసిన కోవిడ్-19 డెత్ క్లెయిమ్‌లు అనేవి మొత్తం 2021 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ అయిన అన్ని క్లెయిమ్‌ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఓ నివేదిక ప్రకారం, కరోనా సెకండ్ వేవ్ తరువాత కోవిడ్ సంబంధిత డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి జీవిత బీమా సంస్థలు ఇప్పటివరకు రూ. 11,060.5 కోట్లను వెచ్చించాయి.

అక్టోబర్ 21 నాటికి జీవిత బీమా సంస్థలు 130,000 కోవిడ్-19 సంబంధిత డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించాయి. ఇప్పటివరకు 140,000 పైగా కోవిడ్ సంబంధిత క్లెయిమ్‌లు చేయగా.. వీటి విలువ మొత్తం రూ.12,948.98 కోట్లు అని ఓ నివేదిక వెల్లడించింది. వీటిలో వాల్యూమ్ ప్రకారం 93.57 శాతం.. వాల్యూ ప్రకారం 85.42 శాతం పరిష్కరించాయి బీమా సంస్థలు. క్లెయిమ్‌ల భారాన్ని తట్టుకునేందుకు భారతీయ బీమా మార్కెట్‌కు అతిపెద్ద రీఇన్స్యూరర్ అయిన మ్యూనిచ్ రీ(Munich Re), ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్‌ల అండర్‌రైటింగ్ పోర్ట్‌ఫోలియోల కోసం తన రేట్లను 40 శాతం వరకు పెంచడానికి సిద్ధమైంది. కరోనా సమయంలో రీఇన్స్యూరర్లు పెరిగిన మరణాల కారణంగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీమియం పెంచడమే ఉత్తమ మార్గంగా భావిస్తున్నాయి.

* కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత క్లెయిమ్‌ల పెరుగుదల ప్రభావం

కరోనా కారణంగా దేశంలోని జీవిత బీమా సంస్థలకు మరణాల మెరుగుదల నష్టాలను తెచ్చిపెడుతోంది. దాంతో రీఇన్సూరర్లు టర్మ్ ప్లాన్‌లపై ప్రీమియం ధరలను పెంచాలని బీమా సంస్థలకు సూచిస్తున్నాయి. ఇప్పటికే మ్యూనిచ్ రీ తాను కవరేజ్ అందించే బీమా కంపెనీలకు ధరల పెంపు గురించి తెలియజేసింది. పెంపు గురించి దాదాపు 8-10 బీమా కంపెనీలకు సమాచారం అందించినట్లు సమాచారం. రీ ఇన్సూరెన్స్ రేట్లు 40% వరకు పెరిగాయి కాబట్టి వ్యక్తి వయస్సు, హామీ మొత్తం, జీవిత నాణ్యత ఆధారంగా ప్రీమియంలు 30% పెరిగే అవకాశం ఉంది.

“మ్యూనిచ్ రీ ఇన్సూరర్ వివిధ కంపెనీలలో టర్మ్ పాలసీల రేట్లు 30 నుంచి 40 శాతం వరకు పెంచింది. దీంతో ప్రీమియం రేట్లు 25-30 శాతం మేర పెరిగే అవకాశం ఉంద"ని ఒక అధికారి తెలిపారు ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

YS Sharmila: ఊహించని విధంగా వైఎస్ షర్మిలను ఇరికించిన వైసీపీ

మ్యూనిచ్ రీ బీమా కంపెనీ రీ ఇన్సూరెన్స్ రేట్లను పెంచడమే కాకుండా, అండర్ రైటింగ్ ప్రమాణాలను కూడా కఠినతరం చేసింది. ఈ జులై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో రీ ఇన్సూరెన్స్ రేట్లు పెంచడం ఇది రెండోసారి. మార్చిలో రేట్లు 4-5 శాతం పెరిగాయి. గతేడాది జూన్‌లో 20-25 శాతం భారీగా పెరిగాయి. భారతదేశంలోని జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే FY 2021లో కోవిడ్-సంబంధిత మరణాల క్లెయిమ్‌లను నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా పొందాయి. దీని ఫలితంగా వారికి భారీ నష్టాలు వచ్చాయి. దాంతో బీమా సంస్థలు పెంపు మొత్తంపై రీఇన్స్యూరర్‌తో చర్చలు జరుపుతున్నాయి.

First published:

Tags: Life Insurance

ఉత్తమ కథలు