• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • TERM INSURANCE PREMIUM GOOD NEWS TERM INSURANCE PREMIUM RATE HIKE POSTPONED MK GH

Term insurance premium: గుడ్ న్యూస్...టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ల పెంపు వాయిదా..

Term insurance premium: గుడ్ న్యూస్...టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ల పెంపు వాయిదా..

(ప్రతీకాత్మక చిత్రం)

టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు గతంలో కంపెనీలు ప్రకటించాయి. రీ ఇన్సూరెన్స్ కంపెనీలకు తాము చెల్లించాల్సిన ప్రీమియం పెరగడంతో పాలసీదారులపై భారం మోపక తప్పట్లేదని సంస్థలు వెల్లడించాయి.

  • Share this:
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల పెరుగుదల 10-15 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రీఇన్సూరర్ ఒప్పందాలు రెన్యువల్ చేసే దశలో కంపెనీలు ఉన్నాయి. కొన్ని బీమా సంస్థలకు సంబంధించిన కొత్త పాలసీలు ఇంకా ఆమోదం పొందలేదు. ఈ ప్రక్రియలు పూర్తయిన తరువాతే ప్రీమియం పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి మరో పదిహేను రోజుల సమయం పడుతుండడంతో కొత్త ధరలు మే 1 నుంచి అమల్లోకి రావచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు గతంలో కంపెనీలు ప్రకటించాయి. రీ ఇన్సూరెన్స్ కంపెనీలకు తాము చెల్లించాల్సిన ప్రీమియం పెరగడంతో పాలసీదారులపై భారం మోపక తప్పట్లేదని సంస్థలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వాయిదా పడింది. ఈ నెల చివర్లో పాలసీ ప్రీమియం ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

మరణాల రేటు పెరగడం, రీ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం ధరలను పెంచిన నేపథ్యంలో, ఆ భారం పాలసీదారులపై పడుతోంది. 2021లో టర్మ్ పాలసీ ప్రీమియం ధరలను 20 శాతం వరకు పెంచుతామని కంపెనీలు గతంలో ప్రకటించాయి.

నష్టపోతున్న కంపెనీలు
సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను వయసు, మరణాల రేటు ఆధారంగా నిర్ణయిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంను తమ పాలసీదారుల డేటా ద్వారా నిర్ణయిస్తాయి. భారత్‌లో మాత్రం డెత్ రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. టర్మ్ పాలసీ తీసుకున్న వ్యక్తులు చనిపోతేనే నామినీకి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. లేదంటే ప్రీమియం తిరిగి రాదు. ఇలా పాలసీదారులు చెల్లించిన ప్రీమియం నుంచే చనిపోయిన లబ్ధిదారులకు కంపెనీలు డెత్ బెనిఫిట్ చెల్లిస్తాయి.

ఈ ప్రీమియం ఫండ్‌లో కొంత భాగాన్ని కంపెనీలు మళ్లీ రీఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి. అంటే పాలసీదారులకు కల్పించిన ఇన్సూరెన్స్ రిస్క్‌ను కంపెనీలు వేరే కంపెనీకి (రీ ఇన్సూరర్ కంపెనీ) బదిలీ చేస్తాయి. దీన్ని రీఇన్సూరెన్స్ అంటారు. గత కొంత కాలంగా రీఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, మరణాల సంఖ్య పెరగడం వల్ల కంపెనీలు నష్టపోతున్నాయి. ఫలితంగా ప్రీమియం ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. ప్రస్తుతానికి కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడింది.
First published:

అగ్ర కథనాలు