హోమ్ /వార్తలు /బిజినెస్ /

Term Insurance: టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ అంటే ఏంటి.. 50 ఏళ్ల తర్వాత ఎంచుకోవచ్చా...

Term Insurance: టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ అంటే ఏంటి.. 50 ఏళ్ల తర్వాత ఎంచుకోవచ్చా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టర్మ్ ఇన్సురెన్స్ కొనుగోలు చేయాలనుకునేవారు రిటైర్మెంట్ వయస్సు లోపు కవర్ అయ్యేలా వాటిని ఎంచుకోవాలి. టర్మ్ ప్లాన్ ఆలస్యమైతే అంటే 50 ఏళ్లకు దగ్గరలో ఉన్నప్పుడు కొనుగోలు చేసుకోవచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తవచ్చు.

ప్రస్తుత కాలంలో జీవిత బీమా పాలసీ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో విషాదానికి గురైతే ఆర్థిక భరోసానిచ్చేందుకు ఈ బీమా పాలసీలను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిలో టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ టర్మ్ ప్లాన్స్ ద్వారా కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడమే కాకుండా పదవీ విరమణ తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు కూడా ఉపయోగపడతాయి.

రెండు రకాలుగా ప్రయోజనం..

టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలు చౌకైనవే కాకుండా అధిక మొత్తం క్లెయిమ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. అందుకే టర్మ్ ప్రణాళికలను అత్యుత్తమ ఇన్సురెన్స్ ప్లాన్స్ గా చెబుతారు. ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు వారిపై ఆధారపడినవారికి లేదా కుటుంబ సభ్యుల ఆర్థిక సంక్షోభాలను నివారించడానికి సాధారణంగా ప్రజలు జీవిత బీమాను ఎంచుకుంటారు. అయితే టర్మ్ ప్లాన్స్ ఎంచుకుంటే కుటుంబ సభ్యులకు ఆర్థిక మద్దతుతో పాటు ఆదాయ భర్తీ కవచంలాగా ఉపయోగపడుతుంది. ఈ జీవిత బీమా పథకాలను ఎంచుకున్న పాలసీదారు మరణిస్తే నెలవారీ వాయిదాల్లో లేదా మొత్తంగా ఒకేసారి ఇలా రెండు రకాల ఆప్షన్ల ద్వారా డబ్బు తిరిగి పొందే వీలుంటుంది. పాలసీదారుడు ప్లాన్ కొనుగోలు చేసినప్పుడు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం బెనిఫిట్ అందజేయబడుతుంది.

50 ఏళ్ల వయసులో టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చా..

టర్మ్ ఇన్సురెన్స్ కొనుగోలు చేయాలనుకునేవారు రిటైర్మెంట్ వయస్సు లోపు కవర్ అయ్యేలా వాటిని ఎంచుకోవాలి. టర్మ్ ప్లాన్ ఆలస్యమైతే అంటే 50 ఏళ్లకు దగ్గరలో ఉన్నప్పుడు కొనుగోలు చేసుకోవచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఎవరైనా ఐదు పదుల వయసులో ఉంటే వారికి ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేసే అవకాశముంది. కాబట్టి వాళ్లు తప్పకుండా ఈ టర్మ్ ప్లాన్ ను తమ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఇప్పుడు మీరు టర్మ్ ప్లాన్ కొనుగోలు చేస్తే అది మీ కుటుంబానికే కాకుండా మీ పదవీ విరమణ తర్వాత ఆదాయంగా మారుతుంది.

60 ఏళ్ల తర్వాత ఆదాయ మార్గం..

ఉదాహరణకు సర్వైవల్ బెనిఫిట్స్ తో టర్మ్ ప్లాన్స్ తీసుకోవడం వల్ల 60 ఏళ్ల తర్వాత నెలవారీ ఆదాయాన్ని పొందడం ద్వారా పాలసీదారుడు తన జీవితకాలంలో ఆ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్స్ పాలసీ వ్యవధిలోనే కొనసాగుతాయి. కుటుంబంలో విషాదం జరిగితే నామినీ పేరుమీద మిగిలిన మొత్తం చెల్లించబడుతుంది. ఆదాయానికి అవసరమైన పాలసీ హోల్డింగును ఒకే ప్లాన్ లో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా పూర్తి జీవిత బీమాగా పనిచేస్తుంది. ఒకవేళ ఓ ప్లాన్ మీకిష్టమైనవారికి వారసత్వంగా వదిలేస్తే.. మరోకటి రిటైర్మెంట్ ఆదాయంగా పనిచేస్తుందని భావించవచ్చు. ఈ ప్లాన్స్ ద్వారా 100 ఏళ్ల వరకు పాలసీదారుడికి కవరేజిని అందిస్తాయి. అంతేకాకుండా భవిష్యత్తు తరాల కోసం తగినంత మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఈ టర్మ్ ప్లాన్స్ సంపూర్ణ ప్రణాళికలు . ఇవి మీ బాధ్యతను తగ్గించి, మీకిష్టమైన వారికి ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. పదవీ విరమణ, వారసత్వ లక్ష్యాలకు మద్దతు ఇస్తాయి. టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలు అకాల మరణానికి రక్షణ కల్పిస్తున్నప్పటికీ బీమా సంస్థలు ఇలాంటి మరణాలను వివిధ వర్గాలుగా వర్గీకరిచాయి. వీటి ఆధారంగా మీ మరణం కవర్ చేయబడుతుందా లేదా అనేది నిర్ణయిస్తారు. అంతేకాకుండా పాలసీదారుడికి బీమా కంపెనీలు మరణ ప్రయోజనాన్ని చెల్లించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.





కాబట్టి పాలసీని కొనుగోలు చేసే ముందే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

First published:

Tags: Business, Insurance

ఉత్తమ కథలు