Home /News /business /

TEN THINGS TO KNOW BEFORE FILING ITR FOR FY 2021 22 UMG GH

Income Tax Return (ITR): ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..? అయితే, మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఇది తెలుసుకోండి

ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఇది తెలుసుకోండి

పన్ను చెల్లింపుదారులకు (Taxpayers) అలర్ట్..! 2021-22 ఫైనాన్షియల్ ఇయర్‌ (Financial Year)కు, 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ (ITR) ఫైలింగ్ గడువు తేదీ సమీపిస్తోంది. పన్ను చెల్లించే ముందు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి మీరు.

ఇంకా చదవండి ...
పన్ను చెల్లింపుదారులకు (Taxpayers) అలర్ట్..! 2021-22 ఫైనాన్షియల్ ఇయర్‌కు, 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీ సమీపిస్తోంది. జీతం పొందే వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు (Income Tax Returns) దాఖలు చేసేందుకు జులై 31 వరకే అవకాశం ఉంది. అంటే ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఐటీఆర్ (ITR) ఫైల్ చేయడం ప్రారంభించాలి. వేతన జీవులు (Salaried Employees And Individuals) చివరి నిమిషం వరకు ఆలస్యం చేస్తే తప్పులు దొర్లే అవకాశం ఎక్కువ. అందుకే నిపుణులు ఐటీఆర్‌ను గడువుకు ముందే ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీ డిపార్ట్‌మెంట్ ముందుగా నింపిన ఓ పన్ను రిటర్న్‌ల ఫారాన్ని అందిస్తుంది. అయితే ట్యాక్స్ పేయర్లు రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి. అలానే ఫారంలో ముందుగా ఫిల్ చేసిన ప్రతి ఫీల్డ్‌ను క్రాస్ చెక్ చేసుకోవాలి. మొదటి సారి ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నవారైతే ఈ కింది విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

* సరైన ఐటీఆర్ ఫారం ఎంపిక
ఐటీఆర్‌ని సరిగ్గా ఫైల్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులు తమ నివాస స్థితి, వివిధ మార్గాల నుంచి సంపాదించిన ఆదాయాన్ని బట్టి సరైన ఐటీఆర్ ఫారాన్ని పెంచుకోవాలి. ఫైలింగ్ సమయంలో తప్పు ఐటీ రిటర్న్ ఫారాన్ని ఉపయోగిస్తే, రిటర్న్ ప్రాసెస్ అవ్వదు. అలాగే మీరు ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక డిటెక్టివ్ రిటర్న్ నోటీసును అందుకుంటారు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి... కస్టమర్లు వెంటనే ఇలా చేయాలి


* కొత్త పన్ను విధానమా, పాత పన్ను విధానమా? అనేది ఎంచుకోవాలి
ఆర్థిక చట్టం, 2020 ద్వారా ఐటీ శాఖ ఇంతకుముందు ఉన్న మినహాయింపులు, తగ్గింపులకు బదులుగా, సవరించిన పన్ను స్లాబ్‌లు, పన్ను రేట్లతో కొత్త ఆప్షనల్ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పాత, కొత్త పన్ను విధానాల నుంచి ఒకదాన్ని ఎంచుకునే అవకాశం చెల్లింపుదారులకు ఉంది. జీతం, ఇల్లు, ఆస్తి నుంచి ఆదాయం పొందే వ్యక్తులు ప్రతియేటా కొత్త, పాత విధానాలకు మార్చవచ్చు.

* ముందుగా నింపిన ఐటీఆర్ ఫారాలు
2021 ఆర్థిక సంవత్సరం కోసం పన్ను రిటర్న్ ఫారాలను ప్రీ-ఫిల్లింగ్ కోసం ఐటీ శాఖ JSON అనే కొత్త యుటిలిటీని ప్రవేశపెట్టింది. ఈ ప్రీ-ఫిల్లింగ్ ఫారాలు ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి డేటాను ఇంపోర్ట్ చేసుకుని ప్రీ-ఫిల్ అవుతాయి. ముందుగా ఫిల్ చేసిన డేటాలో వ్యక్తిగత వివరాలు, జీతం, డివిడెండ్ ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలతో సహా ఫారం 26ASలో అందుబాటులో ఉన్న మొత్తం సమాచారం ఉంటాయి. ఈ ఫారం ట్యాక్స్ పేయర్లకు ఐటీఆర్‌ను సులభంగా ఫైల్ చేయడంలో సహాయపడుతుంది. ఒకవేళ ఫారంలో సమాచారం తప్పుగా ఉంటే... త్రైమాసిక టీడీఎస్ రిటర్న్‌లు/ఇతర ఫైలింగ్‌లలోని డేటాను సరిచేయడానికి బ్యాంక్/ఆదాయ చెల్లింపుదారుని సంప్రదించడం మంచిది. తద్వారా కచ్చితమైన సమాచారం మీ ఫారం నంబర్ 26ASలో ఫిల్ చేయడం సాధ్యమవుతుంది.

* ప్రీపెయిడ్ ట్యాక్స్‌ల వెరిఫికేషన్
పన్ను చెల్లింపుదారులు తమ ప్రీపెయిడ్ ట్యాక్స్‌లతో పాటు టీడీఎస్, అడ్వాన్స్‌డ్‌ ట్యాక్స్‌, సెల్ఫ్-అసెస్‌మెంట్ ట్యాక్స్‌ను ఫారం 26ASతో వెరిఫై చేయడం కూడా చాలా ముఖ్యం. ఏదైనా తేడా కనిపిస్తే.. అవసరమైన సవరణల కోసం జీతం ఆదాయం విషయంలో యజమానికి లేదా ఇతర ఆదాయాల విషయంలో ఇతర చెల్లింపుదారులకు లేదా ముందస్తు పన్ను/ సెల్ఫ్-అసెస్‌మెంట్ పన్ను చెల్లింపుల కోసం బ్యాంకులకు తెలియజేయాలి.* బ్యాలెన్స్ ట్యాక్స్‌ల పేమెంట్
ట్యాక్స్ పేయర్లు పన్ను విధించదగిన మొత్తం ఆదాయాన్ని నిర్ణయించిన తర్వాత, అన్ని సెక్షన్ల/హెడ్‌ల క్రింద వచ్చే ఆదాయంతో సహా చట్టంలోని చాప్టర్ VI-A కింద అవసరమైన మినహాయింపులను క్లెయిమ్ చేయాలి. ఆ తర్వాత పన్ను చెల్లించే మొత్తం బాధ్యతను లెక్కించడానికి వర్తించే పన్ను రేట్లు వర్తింపజేయాలి. అయితే, ప్రీపెయిడ్ పన్నుల క్రెడిట్‌ను క్లెయిమ్ చేసిన తర్వాత పన్ను రిటర్న్‌పై ఏవైనా పన్నులు ఉంటే.. ఆ పన్నులను ఐటీ రిటర్న్‌ను ఫైల్ చేసే ముందు వర్తింపు వడ్డీతో సహా చెల్లించాలి. ఎలాంటి తప్పులు లేకుండా పన్ను బాధ్యతను ముందుగానే అంచనా వేయకపోతే ఆలస్యమైన పన్ను చెల్లింపులపై వర్తింపు వడ్డీ చెల్లించక తప్పదు.

* అవసరమైన సమాచారమంతా బహిర్గతం చేయాలి
ఐటీఆర్ ఫైలింగ్‌లో వివిధ ఆస్తులు, ఆర్థిక పెట్టుబడుల గురించి తెలియజేయడం చాలా ముఖ్యం. అన్ని భారతీయ బ్యాంకు ఖాతాల వివరాలు, జాబితా చేయని ఈక్విటీ షేర్ల వివరాలు, భారతీయ లేదా విదేశీ కంపెనీలలో ఉన్న డైరెక్టర్‌షిప్ వివరాలను చెల్లింపుదారులు తప్పకుండా తెలియపరచాలి.

* మినహాయింపు ఆదాయాన్ని నివేదించడం
షెడ్యూల్ EI కింద వ్యవసాయ ఆదాయం, మైనర్ పిల్లల మినహాయింపు ఆదాయం (Exempt Income), డబుల్ టాక్సేషన్ ఎగవేత ఒప్పందం ప్రకారం పన్ను వర్తించని ఆదాయం వంటి మినహాయింపు ఆదాయాన్ని కూడా నివేదించాలి.

* ఉద్యోగం మారడం
పన్ను చెల్లింపుదారులు మునుపటి యజమాని(ల) నుంచి సంపాదించిన జీతం, ఆదాయ వివరాలను ప్రస్తుత యజమానికి అందిస్తే.. ప్రస్తుత యజమాని ఆధారంగా ఐటీఆర్ దాఖలు చేయగల ఒక కన్సాలిడేటెడ్ ఫారం 16, 12BA అందుకోవచ్చు.

* ఐటీఆర్‌ను గడువులోగా ఫైల్ చేయకపోవడం
సంబంధిత డాక్యుమెంట్స్‌/సమాచారం అందుబాటులో లేకపోవడం, లేదా వ్యక్తిగత కారణాల వల్ల గడువు తేదీలోపు ఐటీఆర్‌ని అందించలేకపోతే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం లేట్ ఫైలింగ్ ఫీజు వంటివి కట్టాల్సి రావచ్చు. ఫైలింగ్ రుసుము, బ్యాలెన్స్ పన్ను బాధ్యతపై వడ్డీ చెల్లింపు వంటివి కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే గడువులోగా రిటర్న్‌ను ఫైల్ చేయడం మంచిది.
Published by:Mahesh
First published:

Tags: Income tax, Interest rates, ITR, ITR Filing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు