Home /News /business /

TELEGRAM INTRODUCES PAYMENTS 20 VOICE CHAT SCHEDULING MK GH

Telegram Features: టెలిగ్రామ్ యాప్​లో పేమెంట్​, వాయిస్ చాట్ షెడ్యూలింగ్‌ ఫీచర్లు.. ఎలా పనిచేస్తాయంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telegram Features: క్రొత్త అప్​డేట్​ ప్రకారం అన్ని టెలిగ్రామ్ చాట్‌ల కోసం పేమెంట్​ ఫీచర్​ను యాడ్​ చేసింది. అంతేకాక, వాయిస్ చాట్‌ల కోసం షెడ్యూలింగ్, మినీ ప్రొఫైల్‌లను అందుబాటులోకి తెచ్చింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం ఏదైనా చాట్‌లోని మెసేజెస్​ను, ఇన్వైట్ లింక్స్​ను టైమర్​ సెట్​ చేసుకొని ఆటో-డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా, వేగంగా చాట్​ చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఇంకా చదవండి ...
వాట్సాప్​ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ వల్ల ఆ యాప్​కి వినియోగదారులు దూరమవుతున్నారు. ఇదే సమయంలో టెలిగ్రామ్​ డౌన్​లోడ్స్​ పెరిగాయి. దీంతో వినియోగదారులను మెప్పించడానికి, మరింత మందిని చేర్చుకోవడానికి టెలిగ్రామ్​ కొత్త ఫీచర్స్​ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా వాయిస్​ ఛాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది. ఈ వాయిస్​ సపోర్ట్​ క్లబ్‌హౌస్ యాప్​లోని వాయిస్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది. అంతేకాక, ఈ వాయిస్ చాట్‌లకు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించడానికి కొత్త అప్​డేట్​ను ప్రకటించింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం అన్ని టెలిగ్రామ్ చాట్‌ల కోసం పేమెంట్​ ఫీచర్​ను యాడ్​ చేసింది. అంతేకాక, వాయిస్ చాట్‌ల కోసం షెడ్యూలింగ్, మినీ ప్రొఫైల్‌లను అందుబాటులోకి తెచ్చింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం ఏదైనా చాట్‌లోని మెసేజెస్​ను, ఇన్వైట్ లింక్స్​ను టైమర్​ సెట్​ చేసుకొని ఆటో-డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా, వేగంగా చాట్​ చేసుకునే అవకాశం కలుగుతుంది.

దీనిపై టెలిగ్రామ్​ స్పందిస్తూ "మేము మొదట 2017లో పేయిమెంట్​ ఫీచర్​ను జోడించాం. ఈ ఫీచర్​తో యాప్​ను వదలకుండా వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. అనగా- పిజ్జాను ఆర్డర్ చేయడం దగ్గరి నుండి టాక్సీ బుక్​ చేసుకునే వరకు ఏ పనైనా సరే చాట్​ చేస్తూనే పూర్తి చేసుకోవచ్చు” అని కంపెనీ తన బ్లాగ్‌పోస్టులో తెలిపింది. "ఈ రోజు నుంచి వ్యాపారులు టెలిగ్రామ్​​ ప్లాట్​ఫామ్​లో క్రెడిట్ కార్డ్ చెల్లింపులను స్థానికంగా అంగీకరించవచ్చు. 8 ఇంటిగ్రేటెడ్ థర్డ్-పార్టీ పేమెంట్​ ప్రొవైడర్ల ద్వారా కూడా చెల్లింపులను అంగీకరించవచ్చు" అని తెలిపింది. మర్చెంట్​ సేవలు, డెలివరీ డ్రైవర్లకు అదనంగా టిప్​ ఇవ్వాలనుకునే కొనుగోలుదారులు అక్కడే తమ టిప్​ను జోడించవచ్చు. ఈ చెల్లింపులకు టెలిగ్రామ్​ ఎటువంటి కమిషన్​ తీసుకోదు. మీ చెల్లింపులన్నీ పూర్తి సెక్యూర్​గా ఉంటాయని టెలిగ్రామ్​ పేర్కొంది. టెలిగ్రామ్ నుంచి అదనపు అనుమతులు పొందకుండానే ఏ వ్యాపారి అయినా సరే పేమెంట్స్​ API ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. తమ పేమెంట్​ హిస్టరీలోని అన్ని వివరాలను పేమెంట్​ మాన్యువల్​ నుంచి చూసుకోవచ్చు.

క్లబ్​హౌస్​కు పోటీగా కొత్త ఫీచర్లు..
ఇక, టెలిగ్రామ్ తన ఛానెల్స్​లో వాయిస్​ చాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది. వాయిస్​ చాట్​ ఎక్స్​పీరియన్స్​ను మరింత మెరుగుపర్చడం కోసం ఈ ఫీచర్ణు అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ చాట్‌లతో యూజర్లు తమ స్నేహితులతో సులభంగా ఇంటరాక్ట్ కావొచ్చు. ఆయా గ్రూప్స్​లో ఛానెల్‌ నిర్వాహకులు అవసరాన్ని బట్టి నిర్దిష్ట తేదీ, సమయంలో వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేయవచ్చు. ఈ షెడ్యూల్​ సమయంలో ఆటోమేటిక్​గా మీ వాయిస్​ మెసేజ్​ గ్రూప్​ సభ్యులందరికీ పంపించబడుతుంది. ఈ వాయిస్​ చాట్​ను షెడ్యూల్ చేసుకోవడం కోసం అడ్మిన్​లు ఛానల్​ ఐకాన్​పైన అలాటే త్రీడాట్​ సెట్టింగ్స్​పైన ట్యాప్​ చేయాలి ‘స్టార్​ వాయిస్​ చాట్​’ ఆప్షన్లు సెలక్ట్ చేసుకొని తర్వాత ‘షెడ్యూల్​ వాయిస్​ చాట్​’ ఆప్షన్​పై ట్యాప్​ చేయాలి. అప్పుడు అడ్మిన్లు తేదీని, సమయాన్ని ఎంచుకోవచ్చు.

తర్వాత వాయిస్​ చాట్ షెడ్యూల్​ చేసుకోవడం కోసం కింద ఉన్న బటన్​పై ట్యాప్​ చేయాలి. గ్రూప్​ సభ్యులందరికీ కౌంట్​ డౌన్​తో సహా షెడ్యూల్​ వాయిస్​ చాట్​ నోటిఫికేషన్​ ఛానల్​ పైభాగంలో కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన ఈ షెడ్యూలింగ్​ ఫీచర్​ హ్యాండీ ఎడిషన్​గా ఉంటుంది. ఇక వీటితో పాటు టెలిగ్రామ్​ రెండు కొత్త​ వెబ్​ యాప్​లను కూడా జతచేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండిట్లో కూడా యానిమేటెడ్ స్టిక్కర్లు, డార్క్ మోడ్, చాట్ ఫోల్డర్లు వంటి మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
Published by:Krishna Adithya
First published:

Tags: Telegram

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు