మీ ఇంట్లో కేబుల్ టీవీ ఉందా? నెలనెలా కేబుల్ బిల్ చెల్లిస్తున్నారా? మీకు శుభవార్త. కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI శుభవార్త చెప్పింది. వినియోగదారులకు మేలు చేసేలా కొత్త నిర్ణయాలను ప్రకటించింది. టారిఫ్ ఆర్డర్‌కు ట్రాయ్ సవరణలు చేసింది. ఇకపై రూ.130+జీఎస్టీ చెల్లించినవారికి 200 ఛానెల్స్ అందించాలి. గతంలో రూ.130+జీఎస్టీ చెల్లిస్తే 100 ఛానెల్స్ మాత్రమే వచ్చేవి. ఆ తర్వాత ప్రతీ 25 అదనపు ఛానెళ్లకు రూ.20 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఏకంగా 200 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ చూడొచ్చు. దాంతో పాటు ప్రసార భారతికి చెందిన దూరదర్శన్ ఛానెళ్లు అదనంగా చూడొచ్చు. మొత్తం రూ.160 చెల్లించేవారికి అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకటించింది.
గతంలో బొకేలో ఉండే ఛానెళ్ల గరిష్ట ధర రూ.19 ఉండేది. ఇప్పుడు బొకే ఛానెళ్లలో ఒక ఛానెల్ ధర రూ.12 మించకూడదని ఆదేశించింది ట్రాయ్. దీంతో వినియోగదారులకు మరింత మేలు జరగనుంది. మల్టీటీవీ విషయంలో యూజర్ల ఫిర్యాదుల్ని కూడా పరిష్కరించింది ట్రాయ్. ఒకే ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్వర్క్ కెపాసిటీ ఫీజులో గరిష్టంగా 40% చెల్లిస్తే చాలు. అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. గతేడాది కేబుల్ టీవీ, డీటీహెచ్ విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది ట్రాయ్. అయితే ట్రాయ్ నిబంధనలు గందరగోళం సృష్టించాయి. వినియోగదారులపై భారం పడింది. దీంతో ట్రాయ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన ట్రాయ్ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకటించింది.
స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్మీ ఎక్స్2 ప్రో అద్భుతం
ఇవి కూడా చచదవండి:
Lock Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోలేరు
SBI Card: ఒక్క ఎస్ఎంఎస్తో మీ ఎస్బీఐ కార్డు బ్లాక్ చేయొచ్చు ఇలా
Loan: 59 నిమిషాల్లో అప్పు... ఏ లోన్ అయినా అప్లై చేయండిలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.