టెలికం బెయిలవుట్ సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరణే... టెలికం మంత్రికి రిలయన్స్ జియో లేఖ

Reliance Jio | ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా కలిపి దాదాపు రూ.1.4 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో భాగమైన వడ్డీ, పెనాల్టీని ఎత్తివేసేందుకు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-COAI ప్రయత్నిస్తోంది. ఈ వైఖరిని రిలయన్స్ జియో తప్పుపడుతోంది.

news18-telugu
Updated: November 3, 2019, 1:41 PM IST
టెలికం బెయిలవుట్ సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరణే... టెలికం మంత్రికి రిలయన్స్ జియో లేఖ
రిలయన్స్ జియో లోగో, రవిశంకర్ ప్రసాద్ (File)
  • Share this:
Reliance Jio | ప్రభుత్వం మద్దతు లేకపోతే టెలికామ్ ఇండస్ట్రీ కుప్పకూలుతుందన్న సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -COAI వైఖరిని రిలయెన్స్ జియో తిప్పికొట్టింది. దీనిపై తన పోరాటాన్ని కొనసాగిస్తూ... తాజాగా కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మరోసారి భారీ లేఖ రాసింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు 14 ఏళ్లుగా చెల్లించాల్సిన చట్టబద్ధమైన బకాయిలపై చర్యలు తీసుకోకుండా... వెసులుబాటు కల్పించాలని అనుకోవడం సుప్రీంకోర్టు తాజా తీర్పును ధిక్కరించినట్లవుతుందని రిలయన్స్ జియో తన లేఖలో తెలిపింది. ఇలాంటి నిర్ణయం పోటీ దారు కంపెనీలకు సమస్యగా మారుతుందని వివరించింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది.

 

రిలయన్స్ జియో రాసిన లేఖ


జియో... 2016 నుంచీ మొబైల్ ఫోన్స్‌కి ఇస్తున్న ఫ్రీ కాల్స్, చవకైనా డేటా వల్ల... ఇండియాలో ప్రపంచంలోనే అత్యంత తక్కువ టెలికం టారిఫ్‌లు ఉన్నాయని అక్టోబర్ 24న సుప్రీంకోర్టు తన ఆర్డర్‌లో తెలిపింది. టెలికం లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వాడకం ఛార్జీలు వంటి చట్టబద్ధమైన బకాయిలు... టెలికం కంపెనీలు తప్పక చెల్లించాలనీ, వాటిపై 14 ఏళ్లుగా ఉన్న వడ్డీ, పెనాల్టీ వంటి వాటిని ఎత్తివేయడం అన్నది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లే అవుతుందని రిలయన్స్ జియో గుర్తుచేసింది.

రిలయన్స్ జియో రాసిన లేఖ


ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా కలిపి మొత్తం దాదాపు రూ.1.4 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో వడ్డీ, పెనాల్టీని ఎత్తివేసేందుకు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-COAI ప్రయత్నిస్తోంది. ఈ వడ్డీ, పెనాల్టీ వంటివి మొత్తం బకాయిల్లో సగం దాకా ఉంటాయి.

రిలయన్స్ జియో రాసిన లేఖ
నిజానికి ఈ బకాయిలు చెల్లించే పొజిషన్‌లోనే భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. పైగా ఈ రెండు కంపెనీలు ఏకమై రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో చాలా ప్రయోజనాలు పొందాయి. అందువల్ల ఇవి గత బకాయిలను తప్పనిసరిగా చెల్లించాలని రిలయన్స్ జియో తన లేఖలో కోరుతోంది.

రిలయన్స్ జియో రాసిన లేఖ


నవంబర్ 1న కూడా రిలయన్స్ జియో... టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సుదీర్ఘ లేఖ రాసింది. టెలికామ్ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న అభిప్రాయంతో తాము ఏకీభవించబోమని రిలయెన్స్ జియో... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వివరించింది. ప్రభుత్వం మద్దతు లేకపోతే టెలికామ్ ఇండస్ట్రీ కుప్పకూలుతుందన్న సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-COAI వైఖరిని రిలయెన్స్ జియో తిప్పికొట్టింది.

రిలయన్స్ జియో రాసిన లేఖ


 

పోటీ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆస్తులు అమ్మి చెల్లించాలని, కొత్తగా ఈక్విటీని ఇష్యూ చేయాలని రిలయెన్స్ జియో కోరింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నట్లు తాజాగా తెలిపిన రిలయన్స్ జియో... చట్టప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది.

 

Pics : లవ్లీ బ్యూటీ తరుణీ సింగ్ క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

RCEP : యూపీఏ హయాంలో కొంపముంచారు... సోనియా గాంధీకి పియూష్ గోయల్ కౌంటర్

Bigg Boss 3 | శ్రీముఖి డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో జబర్దస్త్ కామెడీ షో... ఇక పంచ్‌ల తుఫానే

ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే బెస్ట్... కార్మికుల మాట

తొడపై టాటూతో అసిమా నర్వాల్ హాట్ ట్వీట్
First published: November 3, 2019, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading